ఇకపై థియేటర్లలో ఐదు షోలు | Telangana cabinet sub-committee Meeting over film industry development | Sakshi
Sakshi News home page

ఇకపై థియేటర్లలో ఐదు షోలు

Published Mon, Mar 21 2016 4:07 PM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM

ఇకపై థియేటర్లలో ఐదు షోలు - Sakshi

ఇకపై థియేటర్లలో ఐదు షోలు

హైదరాబాద్ : సినీ అభిమానులకు శుభవార్తే. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకటం కష్టమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించే పద్దతి త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు నాలుగు ఆటలుగా ఉన్న ప్రదర్శనను ఇకపై అయిదు ప్రదర్శనలకు ... అయితే ఐదో షో కచ్చితంగా చిన్న సినిమా అయి ఉండాలని తెలంగాణ సబ్ కమిటీ సోమవారం సూచించింది.

అలాగే చిన్న సినిమాల పరిమితి 30 నుంచి 50 థియేటర్లకు పెంచుతూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక సినీ కార్మికుల నివాసాల కోసం చిత్రపురిలో 9 ఎకరాలు కేటాయింపుతో పాటు హైదరాబాద్లో టీవీ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై సబ్ కమిటీ సోమవారం సమావేశమైంది.  సినీరంగం నుండి ఈ భేటీకి దాసరి నారాయణరావు, దగ్గుబాటి సురేష్, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, శంకర్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement