ఓటు వేసిన దర్శకుడు వివి వినాయక్‌ | Chitrapuri Colony Society Election 2020 Polling In Hyderabad | Sakshi
Sakshi News home page

‘చిత్రపురి కాలనీ’ పోలింగ్‌.. ఓటు వేసిన ప్రముఖులు

Dec 10 2020 12:05 PM | Updated on Dec 10 2020 3:09 PM

Chitrapuri Colony Society Election 2020 Polling In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ‘చిత్రపురి కాలనీ సొసైటీ’ ఎన్నికల పోలింగ్‌ గురువారం జరిగింది. ప్రముఖ నటుడు భానుచందర్‌, గిరిబాబు, దర్శకుడు వివి వినాయక్‌ తదితర సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పోలింగ్‌ కొనసాగింది. ఈ ఎన్నికల్లో నాలుగు ప్యానెల్స్‌ పాల్గొనగా.. మన ప్యానెల్‌, సత్యమేవ జయతే ప్యానెల్‌ పోటీ పడుతున్నాయి. పదకొండు మంది కమిటీ సభ్యుల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో ప్యానెల్‌లో 11 మంది అభ్యర్థులు ఉంటారు. చదవండి: చిత్రపురి కాలనీలో అక్రమాలు: నటుడు

మన ప్యానెల్‌ తరఫున నిర్మాత సి. కళ్యాణ్‌, సత్యమేవ జయతే ప్యానెల్‌ తరఫున ఓ. కల్యాణ్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 16 బూత్‌ల్లో పోలింగ్‌ నిర్వహించారు. చిత్రపురి కాలనీ సొసైటీలో మొత్తం 4,810 ఓట్లు ఉన్నాయని, పోలింగ్‌ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్లు లెక్కిస్తామని ఎన్నికల ఆఫీసర్‌ అరుణ తెలిపారు. ఎన్నికల తుది ఫలితాలు సాయంత్రం 7 గంటలకు వెల్లడించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సినీ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 67 ఎకరాల స్థలం కేటాయించి చిత్రపురి కాలనీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement