vishalakshi
-
చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరు చెరిపేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరును లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది చాలా బాధాకరమని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్రాస్ నుంచి చిత్రపరిశ్రమ నగరానికి వచ్చేసమయంలో చిత్రపరిశ్రమలో 24 క్రాఫ్ట్‌ల్లో పనిచేస్తున్న వారికోసం ఎంతో శ్రమించి అప్పటి ముఖ్యమంత్రులతో మాట్లాడి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఏర్పాటు చేస్తే చిత్రపరిశ్రమలోని పెద్దలు ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని చెప్పరని కేవలం చిత్రపురి కాలనీ అనే సంబోధించడం బాధాకరమన్నారు. చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రి నెలకొల్పుతామని చిత్రపురి కమిటీకి 2 సంవత్సరాల క్రితం తాము నివేదిక పంపి, తాము ఆసుపత్రి ఏర్పాటు, అనుమతుల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా ఇప్పుడు చిత్రపరిశ్రమలోని ఓ ప్రముఖ వ్యక్తి వచ్చి తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ప్రకటించడం బాధాకరమని, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేరును పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే అనుకోవచ్చునని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు శైలజారెడ్డి, విశాలాక్షి, రాధారెడ్డి, లక్ష్మిరెడ్డిలు మాట్లాడుతూ... పేద కళాకారుల కోసం ఆసుపత్రి నిర్మించడాన్ని తాము వ్యతిరేకిండంలేదని, కాని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెండు సంవత్సరాల క్రితమే తాము ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చిత్రపురి కమిటీకి నివేదిక ఇచ్చామని, కరోనా వల్ల కొద్దిగా ఆలస్యం, కమిటీ తమకు ఎంత స్థలం కేటాయించాలి అనే విషయం చర్చించడం, తాము అనుమతులు ఇతరత్రా పనుల్లో ఉండగానే తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి నిర్మిస్తాను అని ఓ సినీ ప్రముఖుడు ప్రకటించుకోవడం సరికాదన్నారు. తమకు అవకాశం ఇచ్చి స్థలం కేటాయిస్తే సంవత్సరంలోపు ఆసుపత్రి నిర్మించి పేద కళాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. చిత్రపురి కాలనీలో ఉన్న పాఠశాలను ప్రైవేట్‌కు అప్పగించారని, ఇప్పుడు ఆసుపత్రి నిర్మించి దాన్ని కూడా ప్రైవేట్‌కు అప్పగించరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. (క్లిక్: సినీ కార్మికుల కోసం ఆస్పత్రి నిర్మిస్తా: చిరంజీవి) -
స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ విశాల శకం
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాలుపంచుకోవాలన్న కాంక్షతో.. తల్లిగా, భార్యగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉద్యమ పథంలో ఉరకలెత్తిన ధీశాలి... రూపాకుల విశాలాక్షి. సమరశీల మహిళగా మహాత్ముని పిలుపుతో ప్రత్యక్ష పోరాటంలో సైతం ఆమె భాగస్వామిగా మారారు. దేశంలో ఎక్కడ ఉద్యమం జరిగినా ముందు వరుసలో నిలబడ్డారు. లాఠీ దెబ్బలను, జైలు శిక్షలను లెక్క చెయ్యకుండా స్వేచ్ఛా స్వాతంత్య్రమే లక్ష్యంగా తెల్లదొరల్ని ఎదిరించారు. దేశం కోసం అహర్నిశలూ శ్రమించి, కడవరకు సేవా దృక్పథంతో జీవనం సాగించిన ఈ యోధురాలు గురువారం నాడు మాతృభూమి ఒడిలో శాశ్వతంగా ఒదిగిపోయారు. ఆమె మరణంతో విశాఖలో ఒక స్వాతంత్య్ర శకం ముగిసినట్లయింది. విశాఖపట్నం మహారాణి పేటకు చెందిన శిష్టా› దక్షిణామూర్తి, సీతామహాలక్ష్మి దంపతుల ఎనిమిది మంది సంతానంలో నాలుగో సంతానంగా విశాలాక్షి. 1926 ఏప్రిల్ 6వ తేదీన జన్మించారు. తండ్రి స్వాతంత్య్ర పోరాటంలో విశాఖ నుంచి కీలక పాత్ర పోషించేవారు. ఆయనను చూస్తూ పెరిగిన విశాలాక్షి.. తన తొమ్మిదవ ఏట.. తండ్రితో కలిసి ఉద్యమంలోకి తొలి అడుగు వేశారు. బాల్యంలోనే ఆమెకు స్వాతంత్య్ర సమర యోధుడైన రూపాకుల రామకృష్ణయ్య కుమారుడు సుబ్రహ్మణ్యంతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది నెలలకు గాంధీజీ విశాఖలో పర్యటించిన సందర్భంలో విశాలాక్షి ఆ సభకు హాజరై.. మహాత్ముని మాటలతో సమర స్ఫూర్తి పొందారు. తొలిసారి జైలుకి! ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్న విశాలాక్షిని రాజమండ్రి జైలుకి తరలించారు. జైలుకు వెళ్లడం అదే మొదటిసారి కావడంతో కాస్త భయం వేసినా.. దేశ భక్తి ముందు ఆ భయం బలాదూర్ అయిపోయిందని తమతో ఎప్పుడూ అంటుండేవారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతారు. అదే సమయంలో కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ తండ్రి మంగళంపల్లి పట్టాభిరామయ్య వద్ద విశాలాక్షి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారు. తన సంగీత పరిజ్ఞానాన్ని సైతం స్వాతంత్య్ర పోరాటానికే ఆమె వినియోగించారు. విశాలాక్షి సంగీత సారథ్యంలో కొందరు గ్రామాల్లోకి వెళ్లి పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో ఒకరోజు బ్రిటిష్ వాళ్ల చేతికి విశాలాక్షి దొరికిపోయారు. బళ్లారి జైల్లో బ్రిటిష్ పోలీసులు ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో ఎడమ చెవి నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత వినికిడి కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ విశాలాక్షి వెనకడుగు వెయ్యలేదు. క్విట్ ఇండియా ఉద్యమం, ఖాదీ ఉద్యమం.. ఇలా ప్రతి ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఇసుక తిన్నెలపై సమాలోచనలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, మదరాసు, గుజరాత్.. ఇలా ఏ ప్రాంతంలో గాంధీజీ ఉద్యమానికి పిలుపునిచ్చినా.. అక్కడికి వెళ్లిపోయేవారు విశాలాక్షి. ఈ ప్రాంత సమర యోధులైన క్రొవ్విడి లింగరాజు, బులుసు కామేశ్వరరావు, వావిలాల గోపాల కృష్ణయ్య, మొదలైన ప్రముఖులతో కలిసి చర్చల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉదయమంతా ఆయా గ్రామాలు, ప్రాంతాల్లో తిరిగి.. ప్రజల్ని చైతన్య పరిచేవారు. సాయంత్రం మహారాణి పేటలో తమ ఇంటికి సమీపంలో ఉన్న సముద్రపు ఇసుకతిన్నెలపై కూర్చొని భావి ఉద్యమం కోసం సమాలోచనలు జరుపుతూ వ్యూహరచన చేసేవారు. బ్రిటిష్ సైన్యం కంటబడకుండా భోజనాలు విశాలాక్షి మామగారైన రామకృష్ణయ్యతో పాటు మరికొందరిపై బ్రిటిష్ అధికారులు కనిపిస్తే కాల్చివెయ్యాలని సైన్యానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఆయనతో సహా మరికొందరు పోరాట వీరులు తమ ఇంటి సమీపంలో ఉన్న మరొకరి ఇంట్లో తలదాచుకున్నారు. వారికి ప్రతిరోజూ బ్రిటిష్ సైన్యం కంటపడకుండా విశాలాక్షి భోజనాలు స్వయంగా తీసుకెళ్లేవారు. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి స్వాతంత్య్ర ప్రకటన వెలువడినప్పుడు ఆ విషయం తెలుసుకున్న విశాలాక్షి.. ఆనందంతో ఆ వీధి ప్రజలందరినీ నిద్రలేపేశారు. మాతృభూమి బానిస సంకెళ్లు తెంచుకున్న ఈ రోజు మనకు పండుగ రోజంటూ సంబరాలు చేసుకున్నారు. ఇంట్లో స్వీట్లు ఏవీ లేకపోవడంతో డబ్బాలో ఉన్న పంచదారని అందరి నోట్లో పోసి తీపి చేశారు. బాణాసంచా కాల్చి ఆ రోజంతా విశాలాక్షి ఆనందంగా గడిపారు. అగ్రవర్ణాలు వెలి వేసినా..! అగ్రవర్ణానికి చెందిన విశాలాక్షి చేపట్టిన ఆలయ ప్రవేశ హరిజనోద్ధరణ ఉద్యమం.. ఆ వర్గానికి మింగుడు పడలేదు. దీంతో.. అగ్రవర్ణాలంతా కలిసి.. విశాలాక్షి కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఏ శుభ కార్యానికి కూడా పిలవడం మానేశారు. అయినప్పటికీ.. విశాలాక్షి బాధపడకుండా.. హరిజనవాడల్లో వారి బాగోగుల కోసం కృషిచేశారు. వారితోనే సహపంక్తి భోజనాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. స్వాతంత్య్ర సమరంలో ఉద్ధృతంగా పాల్గొన్న సమరయోధులలో అతికొద్ది మందికి కేంద్ర ప్రభుత్వం తామ్రపత్రాన్ని అందించేది. ఆ మహద్భాగ్యం విశాలాక్షి కి దక్కింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా విశాలాక్షి తామ్రపత్రాన్ని అందుకున్నారు. విశాలాక్షి ఓ వైపు స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుంటూనే.. ఇంకోవైపు పేదలకు సహాయం చేస్తుండేవారు. 2002లో భర్త మరణించాక ఆయన పేరిట మరికొన్ని సేవా కార్యక్రమాలను చేపట్టారు. అమ్మ అడుగు జాడల్లో విశాలాక్షికి ఆరుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రవికుమార్ సంఘ సేవకుడు, రాజీవ్‌గాంధీ మానవసేవ జాతీయ అవార్డు గ్రహీత. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె శిష్టా› శ్రీలక్ష్మీ అంతర్జాతీయ వెటరన్ క్రీడాకారిణి, యోగా శిక్షకురాలు, ప్రకృతి చికిత్సాలయం వైద్యురాలు. మరో కుమార్తె కూడా మైథిలి హైదరాబాద్‌లో ఉంటున్నారు. రవికుమార్, శ్రీలక్ష్మి ఇరువురూ విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటున్నారు. తోడబుట్టిన నలుగురు అన్నదమ్ములు శిష్టా›్ల సత్యనారాయణ, వెంకటరామశాస్త్రి, యజ్ఞనారాయణ, లక్ష్మీనారాయణ విశాఖపట్నంలోనే నివసిస్తున్నారు. విశాలాక్షి ప్రతి ఏటా రాఖీ పండుగనాడు మహారాణిపేటలోని తన స్వగృహానికి వీరిని పిలిపించుకుని వారికి రాఖీ కట్టేవారు. విశాలాక్షి మరణంతో ఒక శకం అంతరించినట్లయింది. స్వాతంత్య్ర సముపార్జన కోసం సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి.. భావితరాలకు అందమైన భవిష్యత్తు ఫలాలు అందించేందుకు తమ శక్తిని ధారబోసిన సమరయోధులు చరిత్రలో ఒకరొకరుగా మమేకమైపోతున్నారు. వారిలో విశాఖ జిల్లాలో విశాలాక్షి చివరి వారు. – కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నం హరిజనులకు ఆలయ ప్రవేశం హరిజనోద్ధరణ ఉద్యమం మొదలైన రోజుల్లో ఉద్యమాన్ని ముందుండి నడిపిన అతి కొద్ది మందిలో విశాలాక్షి ఒకరు. అప్పట్లో హరిజనులకు ఆలయ ప్రవేశం నిషేధించారు. ఏపీ హరిజన సేవా సంఘం సభ్యురాలైన విశాలాక్షి పదివేల మంది కార్యకర్తలతో కలిసి హరిజనులకు తిరుమల తిరుపతి ఆలయ ప్రవేశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టారు. ఆ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసి బళ్లారి జైలులో పెట్టారు. అయినా వెరవక విశాలాక్షి ఉద్యమాన్ని కొనసాగించడంతో.. హరిజనులకు ఆలయ ప్రవేశం సుగమంగా మారింది. మొదట తిరుమల ఆలయం, ఆ తర్వాత అన్ని ఆలయాల్లోకీ హరిజనులకు ప్రవేశం కల్పించారు -
యోధురాలి నిష్క్రమణం
బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డిన రూపాకుల విశ్రమించింది. క్విట్ ఇండియా.. అని చిన్నతనంలోనే గర్జించిన గళం ఆగిపోయింది. భర్త, మామల ఆడుగుజాడల్లో స్వాతంత్య్రోద్యమంలోకి దూకి.. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలతోపాటు హరిజనోద్ధరణకు అవిశ్రాంత కృషి సల్పిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు రూపాకుల విశాలాక్ష్మి అస్తమించారు. శ్వాసకోస వ్యాధితో కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్న ఆమె గురువారం ఉదయం 11.44 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసి తామ్రపత్రం అందుకున్న ఆమె.. తనకొచ్చే సమరయోధుల పింఛనులో కూడా చాలా వరకు సమాజ సేవకే వెచ్చించిన విశాల హృదయురాలామె. ఉద్యమ సమయంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లిన విశాలాక్షి 94 ఏళ్ల సుదీర్ఘ జీవనయానాన్ని ముగించడంతో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఖిన్నులయ్యారు. ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధురాలు, తామ్రపత్ర గ్రహీత రూపాకుల విశాలాక్షి (94) అస్తమించారు. కొద్ది రోజులుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విశాలాక్షి గురువారం ఉదయం 11.44 గంటలకు మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మహారాణిపేటలోని స్వగృహంలో ఉంచారు. గాంధీజీ పిలుపుతో ఉద్యమంలోకి.. విశాఖపట్నం మహారాణిపేటవాసి శిష్ట్లా దక్షిణామూర్తి, సీతామహాలక్ష్మి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతతిలో నాలుగో సంతానంగా విశాలాక్షి 1926 ఏప్రిల్ ఆరో తేదీన జన్మించారు. తండ్రి దక్షిణామూర్తి స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, స్వదేశీ ఉద్యమం వంటి పలు ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, మహాత్మాగాంధీ పిలుపు మేరకు చిన్నవయసులోనే ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రూపాకుల రామకృష్ణయ్య కుమారుడు సుబ్రహ్యణ్యాన్ని 1935వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుంటున్న భర్త, మామల అడుగుజాడల్లో నడిచారు. హరిజనోద్యమంలో కీలక భూమిక దేశ నేతలతో పాటు చురుగ్గా ఉద్యమంలో పాలుపంచుకున్న విశాలాక్షిని పలుమార్లు తెల్లదొరలు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపారు. 1946వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరిజన సేవా సంఘం సభ్యురాలైన విశాలాక్షి పదివేల మంది కార్యకర్తలతో కలిసి హరిజనులకు తిరుపతి ఆలయ ప్రవేశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టారు. ఆమెను అరెస్ట్ చేసి బళ్లారి జైల్లో పెట్టారు. వారి ఉద్యమంతో హరిజనులకు ఆలయ ప్రవేశం సుగమమైంది. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విశాలాక్షి 2 సంవత్సరాల పాటు గడిపిన జైలు జీవితంలో లాఠీదెబ్బలు తిన్నారు. 1946లో వీరు చేపట్టిన ఆలయప్రవేశ ఉద్యమం సందర్భంగా విశాలాక్షి కుటుంబం అగ్రవర్ణానికి చెందినదైనా అగ్రవర్ణాల వారు వీరిని వెలివేసి, శుభ, అశుభ కార్యక్రమాలకు పిలవడం మానేశారు. విశాలాక్షి మామ రామకృష్ణయ్యను మహాత్మాగాంధీ ఏపీ హరిజన సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా 1941లో నియమించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం, విశాఖపట్నంలో జరిగిన ఉప్పు సత్యా గ్రహం, టౌన్‌హాలులో మహాత్మాగాంధీ ముఖ్య నేతలతో చేపట్టిన స్వాతంత్య్ర ఉద్యమంలో భర్త సుబ్రహ్మణ్యం, మామ రామకృష్ణయ్యలతో కలిసి పాల్గొన్నా రు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం, విశాఖపట్నంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, టౌన్‌హాలులో మహాత్మాగాంధీ ముఖ్య నేతలతో చేపట్టిన స్వాతంత్య్ర ఉద్యమంలో భర్త సుబ్రహ్మణ్యం, మామ రామకృష్ణయ్యలతో కలిసి పాల్గొన్నారు. భర్త మరణం 2002లో భర్త రూపాకుల సుబ్రహ్మణ్యం మరణించినా, ధైర్యం కోల్పోలేదు. ఆయన జయంతి, వర్ధంతి సమయాల్లో పేదలకు వస్త్రదానం చేసేవారు. పేద యువతుల వివాహానికి ఆర్థిక చేయూతనిస్తూ ఆయన స్మృతుల్లోనే జీవించారు. సంగీతం, పుస్తక పఠనం రూపాకుల విశాలాక్షి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తం డ్రి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. రోజూ కీర్తనలు రాసి పాడుకోవడం, రామాయణ, మహాభారత, భగవద్గీత వంటి గ్రంథాలను చదవడం అలవాటుగా మార్చుకున్నారు. కుటుంబమంతా దేశ సేవలోనే.. రూపాకుల విశాలాక్షి భర్త సుబ్రహ్మణ్యం, మామ రామకృష్ణయ్య, తండ్రి శిష్ట్లా దక్షిణామూర్తి, కుమారుడు రూపాకుల రవికుమార్‌తో సహా కుటుంబం మొత్తం దేశసేవకు అంకితమయ్యారు. సామాజిక సేవ వయసు మీద పడినా సమాజసేవ చేయాలన్న ఆలోచన విశాలాక్షిని వీడలేదు. కేంద్రప్రభుత్వం తనకు ఇచ్చే స్వాతంత్య్ర సమరయోధుల పింఛనులో అధిక మొత్తం పేదల కోసమే ప్రతి నెలా ఖర్చు చేసేవారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పేద కుటుంబాలకు చెందిన మహిళలకు వస్త్రాలు, నిత్యావసరాలు అందజేసేవారు. సోదరులతో ఆత్మీయానుబంధం : సోదరులతో ఆమెది ఆత్మీయానుబంధం. తోడబుట్టిన నలుగురు అన్నదమ్ములు శిష్ట్లా సత్యనారాయణ, వెంకటరామశాస్త్రి, యజ్ఞనారాయణ, లక్ష్మీనారాయణ విశాఖపట్నంలోనే నివసిస్తున్నారు. ఏటా రాఖీ పండుగనాడు మహారాణిపేటలోని తన స్వగృహానికి వీరిని పిలిపించుకుని వారికి రాఖీ కట్టేవారు. ఇదీ ఆమె కుటుంబం.. విశాలాక్షికి ఆరుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు రూపాకుల రవికుమార్ సంఘ సేవకుడు, రాజీవ్‌గాంధీ మానవసేవ జాతీయ అవార్డు గ్రహీత. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె శిష్ట్లా శ్రీలక్ష్మి అంతర్జాతీయ క్రీడాకారిణి, యోగా శిక్షకురాలు, ప్రకృతి చికిత్సాలయం వైద్యురాలు, మరో కుమార్తె గూడా మైథిలి (గృహిణి) ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. రవికుమార్, శ్రీలక్ష్మి ఇరువురూ విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటున్నారు. తామ్రపత్ర గ్రహీత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న సమరయోధుల్లో అతికొద్ది మందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తామ్ర పత్రాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా విశాలాక్షి అందుకున్నారు. నేడు అంత్యక్రియలు విశాలక్షి పార్థివ దేహానికి 25వ తేదీ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు జ్ఞానాపురంలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధురాలైన ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని ఆమె కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
విశాలాక్షి ఇకలేరు
► అన్నాడీఎంకే వర్గాలు దిగ్భ్రాంతి ► సీఎం జయలలిత సంతాపం అన్నాడీఎంకే సీనియర్ మహిళా నేత, పార్టీ నిర్వాహక కార్యదర్శి విశాలాక్షి నెడుం జెలియన్(93) సోమవారం చెన్నైలో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె సోమవారం కన్ను మూశారు. ఈ సమాచారంతో అన్నాడీఎంకే వర్గాలు దిగ్భ్రాంతికి లోనయ్యారుు. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో ఒకప్పుడు మంత్రిగా, సీనియర్‌గా పనిచేసిన దివంగత వీఆర్ నెడుంజెలియన్ సతీమణి విశాలాక్షి. 1924 ఆగస్టు 23న సేలంలో జన్మించిన ఆమె 1946లో వైద్య డిగ్రీ సాధించారు. ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌గా, రచరుుతగా వ్యవహరిస్తూ వచ్చిన విశాలాక్షి భర్త మరణానంతరం అన్నాడీఎంకేకు అంకితం అయ్యారు. పదహారేళ్లుగా అన్నాడీఎంకేలో నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. అహర్నిశలు పార్టీ కోసం శ్రమిస్తూ, పార్టీ ప్రధాన కార్యదర్శి జె.జయలలితకు సహకరించేవారు. పార్టీ పరంగా సాగే వ్యవహారాలను పర్యవేక్షిస్తూ, ముందుకు సాగుతూ వచ్చిన విశాలాక్షి నెడుంజెలియన్ పదిహేను రోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. ఆమెకు వైద్య చికిత్సలు అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో సాయంత్రం మూడున్నర, నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణ సమాచారం అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పొన్నయ్యన్‌కు అందడంతో, ఆయన మిగిలిన వారి దృష్టికి తీసుకెళ్లారు. మీడియా తో పొన్నయ్యన్ మాట్లాడుతూ పారీ ్టకి ఆమె అందించిన సేవల్ని వివరిస్తూ తన సానుభూతి తెలియజేశారు. మంగళవారం చెన్నైలో ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నారుు. విశాలాక్షి నెడుంజెలియన్ మరణ సమాచారంతో సీఎం జయలలితతో పాటుగా అ న్నాడీఎంకే వర్గాలు దిగ్భ్రాంతికి లో నయ్యారుు. సీఎం జయలలిత పేరిట సంతాప సందేశాన్ని అన్నాడీఎంకే కార్యాలయం విడుదల చేసిం ది. అందులో విశాలాక్షి నెడుంజెలియన్ సేవలను గుర్తు చేస్తూ, ఆమె లేని లోటు తీరనిదిగా అన్నా ఛిడీఎంకే కార్యాలయం ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. -
ఆ పిల్లలే వారికి దేవుళ్లు
ఉన్నత విద్యావంతుడు గణేశ్... స్పెషల్ టీచర్ విశాలాక్షి. దేవుడికిచ్చిన మాట కోసం... ఉద్యోగాలు మానుకున్నాడతడు. చుట్టూ ఉన్న పిల్లల్లోనే దేవుడున్నాడని... విదేశీ అవకాశాలను వదులుకున్నారామె. వీరిద్దరూ శ్రమిస్తున్నది ప్రత్యేకమైన పిల్లల సంక్షేమం కోసమే. అదే వీరి ప్రయాణాన్ని ఒకే గమ్యం వైపు నడిపిస్తోంది. ఒక లక్ష్యం కోసం పాటుపడుతున్న ఈ స్నేహితులు ఎందరికో జీవన నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. చెన్నై నగరంలో నుంగంబాక్కంలోని నాగేశ్వర రోడ్డులో ఉంది కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్. నరాల బలహీనత, బుద్ధిమాంద్యం, జన్యులోపాలతో పుట్టిన పిల్లలకు అక్కడ వైద్యం జరుగుతోంది. డాక్టరు నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు గణేశ్. అతడి కళ్లలో దైన్యం... ప్రపంచంలోని నైరాశ్యమంతా గూడుకట్టుకుని ఉన్నట్లుంది ముఖం. అతడి చేతుల్లో ఉన్న ఎనిమిదిరోజుల పాపాయి శ్వేతకు ఇవేవీ తెలియదు. తనను బతికించుకోవడానికి తండ్రి జీవితాన్ని ధారపోస్తాడని ఆ బిడ్డకే కాదు ఆ క్షణంలో గణేశ్‌కి కూడా తెలియదు. ఏ క్షణాన ఫిట్స్ వస్తుందో బిడ్డ మెలికలు తిరిగిపోతూ కళ్లు తేలేస్తుందోనని ఒకటే ఆందోళన. కళ్లు మూసుకుని కళ్ల ముందు మెదిలిన దేవుళ్లందరికీ మొక్కుతున్నాడు. ఇది జరిగి పద్ధెనిమిదేళ్లవుతోంది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘‘భగవంతుడా! నా బిడ్డను ఆరోగ్యవంతురాలిని చేయి. నేను నా జీవితమంతా ఇలాంటి బిడ్డలకు సేవ చేసి నీ రుణం తీర్చుకుంటాను - అని మొక్కాను. ఏ దేవుడు కరుణించాడో తెలియదు. కానీ నా బిడ్డ కోలుకుంది. తర్వాత నేను పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలో ‘హృదయాలయ’ అనే హోమ్ ప్రారంభించాను. ఇప్పుడు దానిని నిడదవోలుకు మార్చాం. మా హోమ్‌లో బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్లలను సంరక్షిస్తున్నాం. తప్పిపోయిన పిల్లలకు ఆశ్రయమిస్తున్నాం. జెమిని టీవీ కార్యక్రమంలో మా హోమ్‌లో ఉన్న పిల్లలను చూసి వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు’’ అని చెప్పారు గణేశ్. దేవుడికిచ్చిన మాట కోసం... భగవంతుడిని నమ్మే వారిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో దేవుడిని వరమడిగే ఉంటారు. వారిలో చాలామంది కోరిక నెరవేరిన తర్వాత చాలా సౌకర్యంగా మొక్కు సంగతి మర్చిపోతారు. అలా మర్చిపోకపోవడం గణేశ్‌లో నిజాయితీ. కుమార్తె వైద్యం కోసం అతడు సికింద్రాబాద్‌లోని స్వీకార్ ఉప్కార్ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్లో గడిపాడు. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న ఠాకూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ప్రత్యేకమైన పిల్లలకు చదువు చెప్పడంలో శిక్షణ పొందుతున్న విశాలాక్షి పరిచయమయ్యారు. మాటల్లో మాటగా దేవుడికిచ్చిన మాటను ఆమెతో పంచుకున్నారు గణేశ్. వారిద్దరిలో ప్రత్యేకమైన పిల్లల కోసం ఏదైనా చేయాలనే తపన ఉంది. గణేశ్ ప్రయత్నానికి భార్య విజయలక్ష్మి సహకరించారు. ‘‘హృదయాలయ ఆవిర్భావానికి ఆ తపనే కారణం’’ అంటారాయన. నిర్వహణ కష్టమే అయినా... హోమ్ నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఒడుదొడుకులు అన్నీ ఇన్నీ కావు. ఆ విషయాలను పక్కన పెట్టి తమకు సహాయం అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు గణేశ్. ‘‘కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి గారి కోడలు రాధమ్మ బియ్యం, పప్పు దినుసులు పంపిస్తున్నారు. గణేశ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో సంపాదించిన డబ్బులో ఎక్కువ ఈ హోమ్‌కే ఖర్చు చేశారు. ఉన్న రెండెకరాలూ అమ్మేశారు. అతడి స్నేహితులు మంచి స్థితిలో ఉన్న వాళ్లు అప్పుడప్పుడూ సహాయం చేస్తున్నారు. నా బంగారం, గణేశ్ గారి భార్య బంగారమూ తాకట్టుకెళ్లింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పిల్లలను ఏ రోజూ పస్తు పెట్టలేదు’’ అన్నారు విశాలాక్షి. చిత్తశుద్ధితో చేస్తే... గణేశ్ నమ్మే దేవుడు ఇతడికి స్పందించే మనసిచ్చాడు. అలాగే గంపెడంత కష్టాన్నీ ఇచ్చాడు. పాపాయిని ఏ క్షణాన ఫిట్స్ భూతం మింగేస్తుందోనని కంటి మీద రెప్పవేయకుండా గడిపారు గణేశ్. ఇప్పుడు అలాంటి ఎందరో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పిల్లల్లో దేవుడుంటాడని నమ్మడంలో ఒక సంతోషం ఉంటుంది. ప్రత్యేకమైన పిల్లలు ఎప్పటికీ పిల్లలే. కాబట్టి దేవుడు వీరిలో ఎప్పటికీ ఉంటాడు- అంటారు గణేశ్. నిజమే... వారికి ఆ పిల్లలే దేవుళ్లు. - సాక్షి ఫ్యామిలీ ఫొటోలు : రాజేశ్, శేఖర్, న్యూస్‌లైన్ నిడదవోలు ప్రతిరోజూ ... నేర్పించాల్సిందే! మాది పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి. గణేశ్‌గారు స్పెషల్ చిల్డ్రన్ కోసం హోమ్ పెట్టాలని చెప్పినప్పుడు మా ఊరే సరైన ప్రదేశం అని సూచించాను. ఈ పిల్లలకు పళ్లు తోముకోవడం నుంచి ప్రతిదీ ప్రతిరోజూ నేర్పించాల్సిందే. తమ పేరు, స్కూల్ పేరు, ఊరి పేరు రోజూ డ్రిల్ చేయిస్తాం. ఫోన్ నంబరు పలికిస్తున్నాం. పిల్లల్లో ఏకాగ్రత, మైండ్ - హ్యాండ్ కో ఆర్డినేషన్ అలవడడానికి పేపర్ కవర్ల తయారీ నేర్పించాను. వాళ్ల మూడ్‌ని బట్టి వారంలో రెండు లేదా మూడు రోజులు కూర్చోబెడతాను. పిల్లలు నాతో ఎంతగా అల్లుకుపోయారంటే ఒక్కరోజు నేను కనిపించకపోతే బెంగపెట్టుకుంటారు. - విశాలాక్షి, స్పెషల్ టీచర్ -
త్వరలో పోస్టల్ కోర్ బ్యాంకింగ్ సేవలు
ఎదులాపురం, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాలలో పోస్టల్ కోర్ బ్యాంకింగ్ స ర్వీసులు త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర డీపీఎస్ (డెరైక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్) విశాలాక్షి పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ హెడ్ పోస్టాఫీస్‌ను ఆమె సందర్శించారు. కోర్ బ్యాం కింగ్ సర్వీసులు అమలు చేసేందుకు అనువైన పరిస్థితుల పరిశీలనకు హెడ్ పోస్టాఫీస్‌ను సందర్శించినట్లు డీపీఎస్ తెలిపారు. బ్యాంకింగ్ సేవ ల రూపంలో ప్రతీ హెడ్ పోస్టాఫీస్ పరిధిలో ఏ టీఎం సౌకర్యాలు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ హెడ్ పోస్టాఫీస్‌లోని సే వింగ్స్ బ్యాంక్ ఖాతాల వివరాలను వినియోగదారులు పరిశీలించుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ హెడ్ పోస్టాఫీస్ పరిధిలో 9,206 ఖా తాలున్నాయని, వినియోగదారులు ఎంత త్వర గా స్పందించి ఖాతాల వెరిఫికేషన్ చేసుకుంటే అంత త్వరగా కోర్ బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే వీలుంటుందని తెలిపా రు. కార్యాలయంలోని వివిధ సేవల పనితీరు గురించి జిల్లా పోస్టల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీపీఎస్ వెంట జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ పండరి, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ సంతోష్, సిబ్బంది ఉన్నారు.