► అన్నాడీఎంకే వర్గాలు దిగ్భ్రాంతి
► సీఎం జయలలిత సంతాపం
అన్నాడీఎంకే సీనియర్ మహిళా నేత, పార్టీ నిర్వాహక కార్యదర్శి విశాలాక్షి నెడుం జెలియన్(93) సోమవారం చెన్నైలో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె సోమవారం కన్ను మూశారు. ఈ సమాచారంతో అన్నాడీఎంకే వర్గాలు దిగ్భ్రాంతికి లోనయ్యారుు.
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో ఒకప్పుడు మంత్రిగా, సీనియర్‌గా పనిచేసిన దివంగత వీఆర్ నెడుంజెలియన్ సతీమణి విశాలాక్షి. 1924 ఆగస్టు 23న సేలంలో జన్మించిన ఆమె 1946లో వైద్య డిగ్రీ సాధించారు. ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌గా, రచరుుతగా వ్యవహరిస్తూ వచ్చిన విశాలాక్షి భర్త మరణానంతరం అన్నాడీఎంకేకు అంకితం అయ్యారు. పదహారేళ్లుగా అన్నాడీఎంకేలో నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. అహర్నిశలు పార్టీ కోసం శ్రమిస్తూ, పార్టీ ప్రధాన కార్యదర్శి జె.జయలలితకు సహకరించేవారు. పార్టీ పరంగా సాగే వ్యవహారాలను పర్యవేక్షిస్తూ, ముందుకు సాగుతూ వచ్చిన విశాలాక్షి నెడుంజెలియన్ పదిహేను రోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డారు.
ఆమెకు వైద్య చికిత్సలు అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో సాయంత్రం మూడున్నర, నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణ సమాచారం అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పొన్నయ్యన్‌కు అందడంతో, ఆయన మిగిలిన వారి దృష్టికి తీసుకెళ్లారు. మీడియా తో పొన్నయ్యన్ మాట్లాడుతూ పారీ ్టకి ఆమె అందించిన సేవల్ని వివరిస్తూ తన సానుభూతి తెలియజేశారు. మంగళవారం చెన్నైలో ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నారుు. విశాలాక్షి నెడుంజెలియన్ మరణ సమాచారంతో సీఎం జయలలితతో పాటుగా అ న్నాడీఎంకే వర్గాలు దిగ్భ్రాంతికి లో నయ్యారుు. సీఎం జయలలిత పేరిట సంతాప సందేశాన్ని అన్నాడీఎంకే కార్యాలయం విడుదల చేసిం ది. అందులో విశాలాక్షి నెడుంజెలియన్ సేవలను గుర్తు చేస్తూ, ఆమె లేని లోటు తీరనిదిగా అన్నా ఛిడీఎంకే కార్యాలయం ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
విశాలాక్షి ఇకలేరు
Published Tue, Nov 15 2016 2:55 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
Advertisement
Advertisement