మాయావతికి మరోషాక్
ఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత‍్రి మాయావతి ముఖ్య అనుచరుడు మరొకరు పార్టీని వీడారు.
బీఎస్పీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు బ్రజేష్ పాఠక్ బీజేపీ గూటికి చేరారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఎస్పీకి చెందిన మరో ముఖ్యనేత, సీనియర్ ఎమ్మెల్యే స్వామిప్రసాద్ మౌర్య ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీఎస్పీ జనరల్ సెక్రెటరీగా, మంత్రిగా, విపక్షనేతగా పనిచేసిన మౌర్య బీజేపీలో చేరారు. కాగా ఇతర పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఇటీవల బీఎస్పీలో చేరారు.