Brajesh Pathak
-
25 లక్షలు వద్దు.. కోటి పరిహారం కావాలి..!
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో శనివారం జరిగిన యాపిల్ సంస్థ మేనేజర్ వివేక్ తివారి ఎన్‌కౌంటర్‌పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ రాజీనామా చేయాలని సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వానికి వారి కుటుంబం నుంచి ఊహించని షాక్ తగిలింది. పోలీసుల కాల్పుల్లో మరణించిన వివేక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రులు బ్రజేష్ పాఠక్, అశుతోష్ టాండన్‌లు ఆదివారం వారి ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం తరుఫున నుంచి రూ. 25 లక్షల నష్టపరిహరం అందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వివేక్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు 25 లక్షలు అవసరం లేదని.. కోటి పరిహారం కావాలని అతని భార్య కల్పన డిమాండ్ చేశారు. తమ కుటుంబమంతా వివేక్‌పైనే అధారపడి ఉందని.. పోలీసులు అక్రమంగా కాల్చి చంపారని, తమ పిల్లల భవిష్యత్తు ఏంటని ఆమె ప్రశ్నించారు. సీఎం యోగి ఆదిత్యా ఇక్కడి వచ్చి తమకు సమాధానం చెప్పే వరకు మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించమని ఆమె తేల్చి చెప్పారు. ఆమెను కాసేపు మంత్రులు సముదాయించే ప్రయత్నం చేసిన వారి మాట వినకపోవడంతో మంత్రులు తిరిగి వెళ్లి పోయారు. తనంతరం ఆప్ నేత ఢిల్లీ మంత్రి సంజయ్ సింగ్ మృతుడి కుంటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ వారితో ఫోన్లో మాట్లాడి వివేక్ కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడతమని హామీ ఇచ్చారు. చదవండి : కారు ఆపనందుకు కాల్చేశారు -
మాయావతికి మరోషాక్
ఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్య అనుచరుడు మరొకరు పార్టీని వీడారు. బీఎస్పీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు బ్రజేష్ పాఠక్ బీజేపీ గూటికి చేరారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఎస్పీకి చెందిన మరో ముఖ్యనేత, సీనియర్ ఎమ్మెల్యే స్వామిప్రసాద్ మౌర్య ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీఎస్పీ జనరల్ సెక్రెటరీగా, మంత్రిగా, విపక్షనేతగా పనిచేసిన మౌర్య బీజేపీలో చేరారు. కాగా ఇతర పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఇటీవల బీఎస్పీలో చేరారు.