16న యూపీ–బీజేపీ శాసనసభాపక్షం భేటీ!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం మార్చి 16న జరిగే వీలుంది. రాష్ట్రానికి సీఎంని నియమించే పనిలో బీజేపీ నాయకత్వం బిజీగా ఉంది. రాష్ట్రానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రి వెంకయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌లు నియమితులయ్యారు. 16న జరిగే సమావేశంలో వెంకయ్య, యాదవ్‌లు పాల్గొని, ఎమ్మెల్యేలను సంప్రదించి, సీఎం అభ్యర్థుల పేర్లను అమిత్ షాకు నివేదిస్తారు.
హోం మంత్రి రాజ్‌నాథ్ , రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా తదితరుల పేర్లు సీఏం పదవికి పరిశీలనలో ఉన్నాయి. మళ్లీ సీఎంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వెనక్కు రావడానికి రాజ్‌నాథ్ విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఒక పాత్రికేయుడు రాజ్‌నాథ్‌ను వివరణ కోరగా ఆయన ‘రామ్ రామ్’అంటూ వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన 403 మంది పేర్లతో కూడిన జాబితాను యూపీ ముఖ్య ఎన్నికల అధికారి, ఆ రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించారు.