Mercedes-Benz EQS 450+ Electric Car: ఇప్పటి వరకు ప్రపంచంలో ఎలక్ట్రిక్ కారు అనగానే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే కంపెనీ టెస్లా. ఎందుకంటే, టెస్లా కారును ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా దూరం ప్రయాణిస్తుంది. అలాగే, ఈ కారులో అత్యధునిక సదుపాయాలు కూడా ఉంటాయి. అందుకే, ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో టెస్లా కార్లు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే, టెస్లా కంపెనీకి చెక్ పెట్టేందుకు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ రంగంలోకి దిగింది. మెర్సిడెస్ బెంజ్ తన ఫ్యాన్సీ ఎలక్ట్రిక్ ఎస్‌యువి, సెడాన్ కార్లను మార్కెట్లోకి తీసుకొని రావడం ద్వారా టెస్లా చెక్ చెప్పాలని చూస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+
మెర్సిడెస్ కొత్త ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ కారు ఈక్యూఎస్ ప్రారంభ పరీక్షలలో ఎలోన్ మస్క్ టెస్లా కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చింది. 2022 మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ ఎడ్మండ్స్ చేసిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్టులో422 మైళ్లు ప్రయాణించింది. టెస్లా ఉత్తమ మోడల్ కంటే దాదాపు 20 మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించింది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిమీ వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర $102,310(రూ.76,07,899) లుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.ఈ కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 10-80 శాతం చేరుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిలో 107.8 kWh బ్యాటరీ సామర్ధ్యం గల ఇంజిన్ ఉంది.
(చదవండి: అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చైనా..)
Comments
Please login to add a commentAdd a comment