మెర్సిడెజ్ నుంచి 2 కొత్త కన్వర్టబుల్ కార్లు
ధర శ్రేణి రూ.60 లక్షలు- రూ.2.25 కోట్లు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెజ్ బెంజ్’ నుంచి మరో రెండు టాప్‌లెస్ బ్యూటీ కార్లు మార్కెట్‌లోకి వచ్చారుు. కంపెనీ తాజాగా రెండు కొత్త కన్వర్టబుల్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ‘సి-300 క్యాబ్రియోలెట్’, ‘ఎస్-500 క్యాబ్రియోలెట్’ అనే ఈ కార్ల ధరలు వరుసగా రూ.60 లక్షలుగా, రూ.2.25 కోట్లుగా (ఎక్స్‌షోరూమ్ న్యూఢిల్లీ) ఉన్నారుు. తమ ‘టాప్ ఆఫ్ పిరమిడ్’ వ్యూహంలో భాగంగా అంతర్జాతీయ పోర్ట్‌ఫోలియోలోని అత్యుత్తమ ప్రొడక్ట్‌లను భారతీయుల కోసం ఇక్కడి మార్కెట్‌లోకి తీసుకువచ్చామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో రొనాల్డ్ ఫాల్గర్ తెలిపారు. తాజా కార్ల ఆవిష్కరణతో భారత్‌లోని ప్రీమియం కార్ల విభాగంలో తమ స్థానం మరింత పదిలమౌతుందని ధీమావ్యక్తం చేశారు. ఇక ఈ కొత్త కార్లతో భారత్‌లో అతిపెద్ద కన్వర్టబుల్ పోర్ట్‌ఫోలియోను కలిగిన వాహన కంపెనీగా అవతరించామని పేర్కొన్నారు.
సి-300: ఇందులో 2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగా న్ని 6.4 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. ఇందులోని ఫ్యాబ్రిక్ రూఫ్ 20 సెకన్లలో ఫోల్డ్ అవుతుందని పేర్కొంది. ఈ కారులో 9 స్పీడ్ ట్రాన్‌సమిషన్‌ను పొందుపరిచినట్లు తెలిపింది.
ఎస్-500: ఈ కారులో 4.7 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.6 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. ఇందులోని ఫ్యాబ్రిక్ రూఫ్ 20 సెకన్లలో ఫోల్డ్ అవుతుందని పేర్కొంది. ఈ కారులో 9 స్పీడ్ ట్రాన్‌సమిషన్‌ను పొందుపరిచినట్లు తెలిపింది.