
సాక్షి, న్యూఢిల్లీ : జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ కాన్సెప్ట్‌తో తయారుచేసిన ఎలక్ట్రిక్ కార్ డైమ్లర్–బెంజ్‌ను లాస్ వెగాస్‌లో సోమవారం నాడు ప్రారంభమైన కార్ల షోలో ఆవిష్కరించారు. ‘విజన్ అవతార్’గా పిలిచే ఈ కారు పూర్తి పక్కకు తిరగడంతోపాటు డ్రైవర్ స్పర్శకు కూడా స్పందించడం విశేషం. ఇందులో కొత్తరకమైన ఆర్గానిక్ బ్యాటరీని కూడా ఉపయోగించారు. 2009లో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్న జేమ్స్ కామెరాన్ ‘విజన్ అవతార్’ కాన్సెప్ట్ కారు ఆవిష్కరణకు రావడం విశేషం. 30 డిగ్రీలు పక్కకు తిరిగేలా నాలుగు కారు చక్రాల ఇరుసులను తయారు చేశారు. దాన్ని ఉన్నచోటు నుంచే కారు పక్కకు తిరగ గలదు. పూర్తి ఎలక్ట్రిక్ కారైన ఇది దాటంతట అదే నడిచే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ‘ఈ కారులో నేను కూర్చొని చూశాను. దీనికి నిజంగా ప్రాణం ఉంది. శ్వాస కూడా తీసుకుంటోంది’ జేమ్స్ కామెరాన్ వ్యాఖ్యానించారు.
ఈ కారుకు నడిపేందుకు చక్రం లేకపోవడం మరో విశేషం. సెంట్రల్ కంట్రోల్ యూనిట్‌ను చేతితో పట్టుకోవడం ద్వారా నడపవచ్చు. చేయి పైకెత్తితే మెనూ సెలక్షన్ కంప్యూటర్ తెర కళ్లముందు కనిపిస్తుంది. వేళ్లతో డైరెక్షన్ ఇస్తూ కారును నడపవచ్చు. ఈ కారు మనిషిలాగా శ్వాస తీసుకున్నట్లు అనిపించడానికి కారణం వెనక భాగాన చేపల మొప్పల్లాగా బాడీ డిజైన్ చేసి ఉండడం. ఇలాంటి కారు ఎప్పటికీ మార్కెట్లోకి వస్తుందో మెర్సిడెస్ బెంజ్ యాజమాన్యం ప్రకటించలేదు. అందుకని ఇప్పుడే ఈ కారు కోసం ఆర్డర్ ఇవ్వలేకపోతున్నందుకు బాధగా ఉందని కామెరాన్ వ్యాఖ్యానించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment