మెర్సిడెస్-బెంజ్... సీఎల్‌ఏ క్లాస్ సెడాన్ | With an eye on Audi, Merc launches CLA at Rs 31.5L | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్-బెంజ్... సీఎల్‌ఏ క్లాస్ సెడాన్

Published Fri, Jan 23 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

మెర్సిడెస్-బెంజ్... సీఎల్‌ఏ క్లాస్ సెడాన్

మెర్సిడెస్-బెంజ్... సీఎల్‌ఏ క్లాస్ సెడాన్

ధర రూ. 31.5-35.9 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ సీఎల్‌ఏ క్లాస్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.31.5-35.9 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని మెర్సిడెస్-బెంజ్ ఎండీ, సీఈఓ ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో ఈ కారు లభిస్తుందని వివరించారు. ఈ కారు మంచి అమ్మకాలు సాధిస్తుందని నమ్మకం ఉందని, అందుకే భారత్‌లోనే ఈకారును ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

గత రెండేళ్లలో భారత్‌లో తమ అమ్మకాలు 50 శాతానికి పైగా వృద్ధి సాధించాయని, ఈ స్థాయి వృద్ధి మరే దేశంలోనూ లేదని వివరించారు. 2014లో 10,201 కార్లను విక్రయించామని, ఈ ఏడాది కూడా చెప్పుకోదగ్గ అమ్మకాలు సాధిస్తామని, విక్రయాల్లో రెండంకెల వృద్ధి అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది 10 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చామని, ఈ ఏడాది 15 కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తామని కెర్న్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement