సాక్షి, చెన్నై: జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ గురువారం తన కొత్త వి-క్లాస్ ఎలైట్‌ను విడుదల చేసింది. ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్‌పై కన్నేసిన బెంజ్ మల్టీ పర్సస్ వెహికల్‌ను తీసుకొచ్చింది. వి-క్లాస్ ఎక్స్‌ప్రెషన్ , వి-క్లాస్ ఎక్స్‌క్లూజివ్ కార్లకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వి-క్లాస్ ఎలైట్‌ను ఆవిష్కరించింది. స్పెయిన్‌లో రూపొందించిన వి-క్లాస్ ఎలైట్, దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. లగ్జరీ ఎంపీవీ ధర రూ .1.10 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఇండియా) గా నిర్ణయించింది.
వి-క్లాస్ ప్రొడక్ట్ రేంజ్ వి-క్లాస్ ఎక్స్‌ప్రెషన్‌ధర రూ .68.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్ ఇండియా), వి -క్లాస్ ఎక్స్‌క్లూజివ్ రూ .81.90 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా) వీటితో పాటు విక్లాస్ ఎలైట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాదు ప్రతి నెలా కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించేందుకు కంపెనీ చూస్తోందని ఆయన అన్నారు. లగ్జరీ మార్కెట్ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు .మసాజ్ ఫంక్షన్, క్లైమేట్ కంట్రోల్, రిమోట్ సీట్లు సహా, కంట్రోల్డ్ డోర్, 15 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వి-క్లాస్ ఎలైట్‌లో ఎజిలిటీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఈ కారులో పొందుపర్చినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment