rolls out
-
బంపర్ ఆఫర్: మలేషియా,థాయిలాండ్‌కి ‘ఎగిరి’పోదామా!
హైదరాబాద్: ఆసియా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు హైదరాబాద్, చెన్నై తదితర నగరాల నుంచి ప్రయాణం చేసే వారి కోసం సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఎ) ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్ , కొచ్చి నుండి ఆసియా అంతటా ప్రత్యేక ప్రమోషనల్ ఛార్జీలను అందిస్తోంది. మలేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఇతర ఆసియా దేశాలకు వెళ్లేవారికి తక్కువ రేట్లలో విమాన టికెట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లో ఫ్లయిట్ టికెట్లను రూ. 16,200 రేటు నుంచి పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఆగస్టు 5 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్, చెన్నైకి సంబంధించి పెప్టెంబర్ 2 నుంచి 2023 మార్చి 31 వరకూ చేసే ప్రయాణాలకు ఈ రేట్లు వర్తిస్తాయి. అలాగే అహ్మదాబాద్, కొచ్చిల నుంచి ఆగస్టు 2, 2023 మార్చి 31 మధ్య కాలంలో చేసే ప్రయాణాలకు ఆఫర్ ధర వర్తిస్తుంది. భారతదేశం నుండి పెరుగుతున్న డిమాండ్ కనుగుణంగా రాబోయే నెలల్లో చెన్నై, హైదరాబాద్ , కొచ్చి నుండి కార్యకలాపాలను గణనీయంగా పెంచడానికి కూడా సిద్ధమవుతోంది సింగపూర్ ఎయిర్‌లైన్స్. -
ఈ కార్లపై రూ. 3.06 లక్షల భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: కొత్తగా కారు సొంతం చేసుకోవాలనుకునే వారికి, అలాగే కొత్తకారు అప్డేట్ అవ్వాలనుకునే వారికి ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరోసారి తీపి కబురు చెప్పింది. ఇటీవల లాంచ్ చేసిను థార్ మినహా అన్ని కార్లపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. బీఎస్-6 కార్లను భారీ డిస్కౌంట్ ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అఫర్లో దాదాపు 3.06 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ రేట్లు ఏప్రిల్ 30, 2021 వరకు అందుబాటులో ఉంటాయి. అధికారిక వెబ్సైట్ ప్రకారం ఆయా డీలర్ల పరిధిల ఈ తగ్గింపులో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు కెయువి 100 ఎన్ఎక్స్టి నుండి అల్టురాస్ జీ 4 ఫ్లాగ్షిప్ ఎస్యూవీ వరకు పలు మోడళ్ల కార్లపై నగదు ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్ లాంటి ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా అల్టురాస్ జీ 4 ఎస్యూవీ కొనుగోలుపై మొత్తం 3.06 లక్షల వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో 2 2.2 లక్షల వరకు నగదు ఆఫర్ రూ 50,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. కార్పొరేట్ ఆఫర్ , ఇతర ప్రయోజనాలు వరుసగా 16,000, 20,000 వరకు లభ్యం. మరాజ్జో ఎంపీవీలో అందించే గరిష్ట తగ్గింపు 41,000 రూపాయలు. ఇందులో రూ. 20,000 వరకు నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 6,000 వరకు లభిస్తాయి. చదవండి: ఉన్నట్టుండి పేలిన ఫోన్, షాకైన జనం: వైరల్ వీడియో ఎన్నిసార్లు గెలుస్తావ్ భయ్యా..! నెటిజన్లు ఫిదా -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్ బుక్ సారధ్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన యూజర్లుకు కొత్త అప్ డేట్ అందించింది. వాట్సాప్‌లోని గ్రూప్ చాట్లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ తోఎప్పటికీ మ్యూట్ చేసే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్ లో వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని ట్వీట్ చేసింది. వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ ఫీచర్‌ను చివరకు లాంచ్ చేసింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ క్రొత్త ఫీచర్ ప్రజలు ఆ ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపులనుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇదిసహాయపడుతుంది. చాట్‌ను మ్యూట్ చేస్తే సంబంధిత గ్రూపులనుంచి నోటిఫికేషన్ రాదు. సందేశాలు, చిత్రాలు లేదా వీడియోలు, ఇతర ఏ ఫీడ్ ఇబ్బంది పెట్టదు. అంతేకాదు. అవసరమైతే దీన్ని అన్‌మ్యూటింగ్ అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఈ సదుపాయం ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు మ్యూట్ చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. You can now mute a chat forever 🤫 pic.twitter.com/DlH7jAt6P8 — WhatsApp Inc. (@WhatsApp) October 23, 2020 -
కియా మెటార్స్ సోనెట్ : రికార్డు బుకింగ్స్
సాక్షి,అనంతపూర్: ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ ప్లాంట్ లో ప్రత్యేకంగారూపొందించిన కియా మోటార్స్ ఎస్యూవీ సోనెట్ ను ఆవిష్కరించింది. రానున్న పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నెలలోనే దీన్ని లాంచ్ చేయనుంది. కియా సోనెట్ సంస్థ తాజా ‘మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తి ఇది. కియా సెల్టోస్ మాదిరిగానే దేశీయ మార్కెట్ తో పాటు,వివిధ ప్రపంచ మార్కెట్లలో దీన్ని విక్రయించనుంది. పెద్ద ఎత్తున ఈ కారును ఉత్పత్తి చేస్తున్నామని,భారతదేశంలో వివిధ వాతావరణ పరిస్థితులలో, కొన్నికిష్టమైన ఏరియాల్లో 100,000 కిలోమీటర్లకు పైగా పరీక్షించిన తరువాత దీన్ని ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. గత నెలలో జరిగిన వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించిన దీన్ని సెప్టెంబర్18న సోనెట్‌ను భారతదేశంలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 70 మార్కెట్లలో దీన్ని అందుబాటులోకి తేనుంది. తమ తొలి కస్టమర్ కారు కియా సోనెట్ ను అధికారికంగా విడుదల చేయడం సంతోషంగా ఉందని కియా మోటార్స్ ఇండియా సీఎండీ కూఖ్యూన్ షిమ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల మధ్య సొనెట్‌ను తీసుకురాడం చాలా గర్వించదగిన విషయమనీ, ఇది తమకొక ముఖ్యమైన రోజని వ్యాఖ్యానించారు. అనంతపురంలోని అత్యాధునిక ప్లాంట్ ఉద్యోగుల అభిరుచి, అంకితభావానికి నిదర్శమని పేర్కొన్నారు. రికార్డ్ బుకింగ్‌లు బుకింగ్ ప్రారంభించిన మొదటి రోజున ఈ కారు ఇప్పటికే 6,523 యూనిట్ల రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్‌లను సేకరించింది. కియా మోటార్స్ ఇండియా భారతీయ మార్కెట్లో ఇప్పటికే సెల్టోస్, కార్నివాల్ రెండు వాహనాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, టెక్నికల్, డైనమిక్ డిజైన్, 30కు పైగా అత్యుత్తమ ఫీచర్లు వాయిస్ అసిస్ట్ సహా 57 యువీఓ కనెక్ట్ ఫీచర్లు, డీఎన్ఏ బోల్డ్, విలక్షణమైన డిజైన్ లతో కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో కియా సోనెట్ ఆకర్షించనుంది. Even the wild have a pecking order. See how the #KiaSonet ends up right at the top of it while making their date wilder than your imagination. Pre-Book Now!#TheNextLevelOfWild #WildByDesign — Kia Motors India (@KiaMotorsIN) August 20, 2020 -
మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ ఎలైట్, ధర ఎంతంటే
సాక్షి, చెన్నై: జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ గురువారం తన కొత్త వి-క్లాస్ ఎలైట్‌ను విడుదల చేసింది. ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్‌పై కన్నేసిన బెంజ్ మల్టీ పర్సస్ వెహికల్‌ను తీసుకొచ్చింది. వి-క్లాస్ ఎక్స్ప్రెషన్ , వి-క్లాస్ ఎక్స్‌క్లూజివ్ కార్లకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వి-క్లాస్ ఎలైట్‌ను ఆవిష్కరించింది. స్పెయిన్‌లో రూపొందించిన వి-క్లాస్ ఎలైట్, దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. లగ్జరీ ఎంపీవీ ధర రూ .1.10 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఇండియా) గా నిర్ణయించింది. వి-క్లాస్ ప్రొడక్ట్ రేంజ్ వి-క్లాస్ ఎక్స్ప్రెషన్ధర రూ .68.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్ ఇండియా), వి -క్లాస్ ఎక్స్‌క్లూజివ్ రూ .81.90 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా) వీటితో పాటు విక్లాస్ ఎలైట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాదు ప్రతి నెలా కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించేందుకు కంపెనీ చూస్తోందని ఆయన అన్నారు. లగ్జరీ మార్కెట్ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు .మసాజ్ ఫంక్షన్, క్లైమేట్ కంట్రోల్, రిమోట్ సీట్లు సహా, కంట్రోల్డ్ డోర్, 15 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వి-క్లాస్ ఎలైట్‌లో ఎజిలిటీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఈ కారులో పొందుపర్చినట్టు చెప్పారు. -
బ్రెయిన్ గెయిన్: బీటెక్ విద్యార్థులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బీటెక్ విద్యార్థుల ఫెలోషిప్ పథకంపై కేంద్రం శరవేగంగా కదులుతోంది. అత్యుత్తమ ప్రతిభగల వెయ్యి మంది బీటెక్ విద్యార్థులకోసం ఉద్దేశించిన పీఎం రీసెర్చ్ ఫెలోషిప్స్(పీఎంఆర్ఎఫ్) పథకానికి కేబినెట్ ఆమోదం లభించింది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లే ఔత్సాహికులకు ప్రోత్సాహిమిచ్చే దశగా ఈ ఫెలోషిప్‌ను ఇవ్వనున్నామని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ఇందుకోసం రూ.1,650 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. తద్వారా విద్యార్థుల బ్రెయిన్ డ్రెయిన్ శ్రమను..బ్రెయిన్ గెయిన్గా మార్చుతున్నామన్నారు. 2018-19 నుంచి మూడేళ్లపాటు ప్రతి ఏడాది 1000 మంది పీహెచ్డీ విద్యార్థుల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నామని మంత్రి వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థుల నుంచి తుది జాబితాను ఎంపిక చేస్తారు. వీరందరూ మొదటి రెండు సంవత్సరాలకు నెలకు రూ.70వేలు, మూడో ఏడాది రూ.75వేలు, నాలుగు, ఐదో సంవత్సరం రూ.80వేల స్కాలర్షిప్ పొందనున్నారు. అంతేకాదు అధ్యయన పేపర్ల ప్రజెటింగ్ కోసం విదేశాల్లో సెమినార్లు, కాన్ఫరెన్సెలకు వెళ్లే అధ్యయన విద్యార్థులకు వార్షికంగా (విదేశీ ప్రయాణ ఖర్చులు)మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు స్కాలర్షిప్లు కూడా అందిస్తున్నామని మంత్రి వివరించారు. పీఎం రిసెర్చ్ ఫెలోషిప్స్(పీఎంఆర్ఎఫ్) పథకం కింద.. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఐఐఎస్సీ, ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీల్లో బీటెక్ పూర్తయిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎమ్మెస్సీ(సైన్స్ అండ్ టెక్నాలజీ) విద్యార్థులు నేరుగా ఐఐటీలు, ఐఐఎస్‌లో పీహెచ్డీ చేసేందుకు అవకాశం లభించనుంది. -
ఎం అండ్ ఎం ఎక్స్‌యూవీ500 పెట్రోల్ వెర్షన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్ర అండ్‌మహీంద్ర కొత్ వెర్షన్ ఎస్‌యూవీలాంచ్ చేసింది. పెట్రోల్ వెర్షన్లో ఎస్యూవీ ఎక్స్ యూవీని 500 ను విడుదల చేసింది. దీని రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. తాజా నివేదిక ప్రకారం 6స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త వెహికల్ లభించనుంది. 2.2 లీటర్ mHawk పెట్రోల్ ఇంజిన్‌తో, 140 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే స్టాటిక్ బెండింగ్ హెడ్ లైట్లు, , క్రూయిస్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ లాంటి ఇతర ప్రధాన ఫీచర్లతో ఈ ఎస్యూవీ లభ్యం. పెట్రోల్ వేరియంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కస్టమర్లకు ఎక్స్‌యూవీ500 అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని ఎంఅండ్ ఎం చీఫ్ సేల్స్ & మార్కెటింగ్ ఆఫ్ రామ్ నక్రా ఒక ప్రకటనలో తెలిపారు. -
స్కోడా ఆక్టావియా లాంచ్.. ధర
న్యూఢిల్లీ: చెక్ రిపబ్లిక్కు చెందిన కార్ల తయారీ కంపెనీ స్కొడా కొత్త సెడాన్ ఆక్టావియా ను లాంచ్ చేసింది. భారతదేశంలో అత్యుత్తమంగా అమ్ముడుపోయిన సెడాన్ ఆక్టవియా కొత్త వెర్షన్‌ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 15.49 లక్షల( ఆల్ ఇండియా ఎక్స్ షోరూం ధరలు) నుంచి ప్రారంభం కానున్నట్టు తెలిపింది.. పెట్రోల్ డీజిల్ ఇంజిన్ రెండు వెర్షన్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా పెట్రోల్ లో 1.4 లీటర్, 1.8 లీటర్ల రెండు ఇంజిన్ ఎంపికలతో రూ. 15.49-20.89 లక్షల మధ్య ధరకే లభిస్తుంది. డీజిల్ 2-లీటర్ ఇంజన్‌తో నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. వీటి రూ .16.9-22.89 లక్షల మధ్య ఉంటాయని కంపెనీ ప్రకటించింది. స్కొడా కీలకమై బ్రాండ్ ఆక్టవియా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు మిలియన్ యూనిట్లు అమ్ముడైంది. 2001లో భారతదేశంలోఎంట్రీ ఇచ్చినప్పటినుంచి 90,000 యూనిట్లు విక్రయించింది. జనవరి-జూన్‌లో 15 శాతం వృద్ధి సాధించిన కంపెనీ విక్రయాలను మరింత పెంచుకోనుందని స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ అశుతోష్ దీక్షిత్ చెప్పారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో స్కొడా ఆటో ఇండియా 7,576 యూనిట్లు విక్రయించినట్టు తెలిపారు. కొత్త ఉత్పత్తులతో ఈ ఏడాది 30 శాతం అమ్మకాలు పెరగాలని, తద్వారా ప్రీమియం సెగ్మెంట్లో మా స్థానం మరింత మెరుగు పరుస్తామని దీక్షిత్ వెల్లడించారు. కొత్త ఆక్టివియాలో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, ఐ బజ్ డ్రైవర్ ఫెటీగ్ ఎలర్ట్, ఎనిమిది ఎయిర్ బాగ్స్ లాంటి అదనపు ఫీచర్లతో కార్ లవర్స్ ను ఆకట్టుకోనుంది. కొత్త ఆక్టేవియా ఈ విభాగంలో టొయోటా కరోలా అల్టిస్ గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా.