కియా మెటార్స్ సోనెట్  : రికార్డు బుకింగ్స్ | Kia Motors rolls out the first Sonet from its Anantapur plant | Sakshi
Sakshi News home page

కియా మెటార్స్ సోనెట్ : రికార్డు బుకింగ్స్

Published Fri, Sep 4 2020 7:58 PM | Last Updated on Fri, Sep 4 2020 8:20 PM

Kia Motors rolls out the first Sonet from its Anantapur plant - Sakshi

సాక్షి,అనంతపూర్: ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ ప్లాంట్ లో ప్రత్యేకంగారూపొందించిన కియా మోటార్స్ ఎస్‌యూవీ సోనెట్ ను ఆవిష్కరించింది. రానున్న పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నెలలోనే దీన్ని లాంచ్ చేయనుంది. కియా సోనెట్ సంస్థ తాజా ‘మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తి ఇది. కియా సెల్టోస్ మాదిరిగానే దేశీయ మార్కెట్ తో పాటు,వివిధ ప్రపంచ మార్కెట్లలో దీన్ని విక్రయించనుంది.

పెద్ద ఎత్తున ఈ కారును ఉత్పత్తి చేస్తున్నామని,భారతదేశంలో వివిధ వాతావరణ పరిస్థితులలో, కొన్నికిష్టమైన ఏరియాల్లో 100,000 కిలోమీటర్లకు పైగా పరీక్షించిన తరువాత దీన్ని ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. గత నెలలో జరిగిన వరల్డ్ ప్రీమియర్  ప్రదర్శించిన   దీన్ని సెప్టెంబర్18న సోనెట్‌ను భారతదేశంలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 70 మార్కెట్లలో దీన్ని అందుబాటులోకి తేనుంది. తమ తొలి కస్టమర్ కారు కియా సోనెట్ ను అధికారికంగా విడుదల చేయడం సంతోషంగా ఉందని కియా మోటార్స్ ఇండియా సీఎండీ కూఖ్యూన్ షిమ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల మధ్య సొనెట్‌ను తీసుకురాడం చాలా గర్వించదగిన విషయమనీ, ఇది తమకొక ముఖ్యమైన రోజని వ్యాఖ్యానించారు. అనంతపురంలోని అత్యాధునిక ప్లాంట్‌ ఉద్యోగుల అభిరుచి, అంకితభావానికి నిదర్శమని పేర్కొన్నారు.

రికార్డ్ బుకింగ్‌లు
బుకింగ్ ప్రారంభించిన మొదటి రోజున ఈ కారు ఇప్పటికే 6,523 యూనిట్ల రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్‌లను సేకరించింది. కియా మోటార్స్ ఇండియా భారతీయ మార్కెట్లో ఇప్పటికే  సెల్టోస్,  కార్నివాల్ రెండు వాహనాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటిలిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్,  టెక్నిక‌ల్, డైనమిక్ డిజైన్,  30కు పైగా అత్యుత్తమ ఫీచర్లు వాయిస్‌ అసిస్ట్‌ సహా 57 యువీఓ కనెక్ట్‌ ఫీచర్లు, డీఎన్‌ఏ బోల్డ్‌, విలక్షణమైన డిజైన్ ల‌తో  కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కియా సోనెట్ ఆక‌ర్షించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement