బంపర్‌ ఆఫర్‌: మలేషియా,థాయిలాండ్‌కి ‘ఎగిరి’పోదామా! | Singapore Airlines rolls out special fares for flights India | Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌: మలేషియా,థాయిలాండ్‌కి ‘ఎగిరి’పోదామా!

Published Sat, Jul 23 2022 10:15 AM | Last Updated on Sat, Jul 23 2022 10:49 AM

Singapore Airlines rolls out special fares for flights India - Sakshi

హైదరాబాద్‌: ఆసియా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు హైదరాబాద్, చెన్నై తదితర నగరాల నుంచి ప్రయాణం చేసే వారి కోసం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (ఎస్‌ఐఎ) ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్ , కొచ్చి నుండి ఆసియా అంతటా  ప్రత్యేక ప్రమోషనల్ ఛార్జీలను అందిస్తోంది.

మలేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, వియత్నాం,  ఇతర ఆసియా దేశాలకు వెళ్లేవారికి తక్కువ రేట్లలో విమాన టికెట్లను అందిస్తోంది.  ఈ ఆఫర్‌లో ఫ్లయిట్‌ టికెట్లను రూ. 16,200 రేటు నుంచి పొందవచ్చని  కంపెనీ పేర్కొంది. ఆగస్టు 5 వరకూ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్, చెన్నైకి సంబంధించి పెప్టెంబర్‌ 2 నుంచి 2023 మార్చి 31 వరకూ చేసే ప్రయాణాలకు ఈ రేట్లు వర్తిస్తాయి. అలాగే అహ్మదాబాద్, కొచ్చిల నుంచి ఆగస్టు 2, 2023 మార్చి 31 మధ్య కాలంలో చేసే ప్రయాణాలకు ఆఫర్‌ ధర వర్తిస్తుంది.    

భారతదేశం నుండి పెరుగుతున్న డిమాండ్‌ కనుగుణంగా రాబోయే నెలల్లో చెన్నై, హైదరాబాద్ , కొచ్చి నుండి కార్యకలాపాలను గణనీయంగా పెంచడానికి కూడా సిద్ధమవుతోంది సింగపూర్‌  ఎయిర్‌లైన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement