
పుణే: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్.. భారత లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బ్రాండ్ ‘ఈక్యూ’ని మంగళవారం ఇక్కడ ప్రారంభించింది. నూతన బ్రాండ్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ఈక్యూసీ’ పేరిట తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలకానుందని సంస్థ ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ వెల్లడించారు. ఎలక్ట్రిక్‌కు సంబంధించిన అన్ని వాహనాలను ఇదే బ్రాండ్ నుంచి విడుదలచేయనున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment