మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నట్టుండి లగ్జరీ కార్లలో షికార్లు చేయడం మొదలు పెట్టాడు. దాదాపు 22 కోట్ల స్కామ్‌కు పాల్పడి, లగ్జరీ ఫ్లాట్, విలువైన ఆభరణాలు కొనుగోలు చేశాడు. అదీ తన ప్రేయసికోసం. ఏంటా అని ఆరాతీస్తే, ఆరు నెలల పాటు కొనసాగిన ఇతగాడి బండారం బయట పడింది.
నెట్టింట హల్‌చల్ చేస్తున్న స్టోరీ వివరాలు..
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నెలకు రూ.13వేల జీతంతో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసేవాడు హర్ష్ కుమార్ క్షీరసాగర్. లగ్జరీ లైఫ్‌పై మోజు పెంచుకున్న కుమార్ అడ్డదారి వెతుక్కున్నాడు. యశోదా శెట్టి అనే మహిళా ఉద్యోగితో చేతులు కలిపి దాదాపు రూ. 21 కోట్ల 59 లక్షల 38 వేలు కొట్టేశాడు.
నకిలీ పత్రాలను ఉపయోగించి ఇండియన్ బ్యాంక్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో ఖాతా తెరిచారు. తరువాత ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా భారీ కుంభకోణానికి తెర తీశారు. ఇలా వచ్చిన డబ్బులతో హర్ష్ కుమార్ తన ప్రియురాలికి విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 4 బీహెచ్‌కే ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేనా..తగ్గేదేలే అంటూ బీఎండబ్ల్యూ కారు, బీఎండబ్ల్యూ బైక్, ఖరీదైన డైమండ్ ఆభరణాలు కొనుగోలు చేశాడు. దాదాపు ఆరు నెలల తరువాత వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
హర్ష్‌కుమార్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్ కలిసి బ్యాంకుకు ఫేక్ పత్రాలను సమర్పించి డబ్బులను డ్రా చేశారని విచారణలో తేలింది. ఈ డబ్బులను తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించు కున్నారని పోలీసులు గుర్తించారు.
మహిళా కాంట్రాక్ట్ వర్కర్ భర్త రూ.35 లక్షల విలువైన ఎస్‌యూవీని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్ష్ కుమార్ అనిల్ క్షీరసాగర్ ఎస్‌యూవీతో పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: రిటైర్మెంట్ డిప్రెషన్ డేంజర్ బెల్స్ : ఏం చేయాలి?!
Comments
Please login to add a commentAdd a comment