బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీ.. కొత్త వేరియంట్ | The new variant of the BMW X-3 SUV | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీ.. కొత్త వేరియంట్

Published Wed, Jul 8 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీ.. కొత్త వేరియంట్

బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీ.. కొత్త వేరియంట్

ధర రూ.59.9 లక్షలు
 
న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ తన స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్‌యూవీ)మోడల్ ఎక్స్3లో కొత్త వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 30డి ఎం స్పోర్ట్ పేరుతో అందిస్తున్న ఈ కొత్త వేరియంట్ ధర రూ.59.9 లక్షలని(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) కంపెనీ పేర్కొంది. 3-లీటర్ ఆరు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌తో అందిస్తున్న ఈ కారును చెన్నై ప్లాంట్‌లోనే అసెంబుల్ చేశామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ చెప్పారు.

డ్రైవింగ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఎంచుకోవడానికి వీలయ్యేవిధంగా వివిధ మోడ్‌ల్స్‌తో కూడిన బీఎండబ్ల్యూ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కంట్రోల్ స్విచ్ వంటి వినూత్నమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం  బీఎండబ్ల్యూ ఎక్స్‌ల్స్3లో రెండు వేరియంట్లు (తాజాగా అందిస్తున్న బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 30డి ఎం స్పోర్ట్, బీఎండబ్ల్యూ ఎక్స్3 డ్రైవ్ 20డి) అందిస్తున్నామని వాన్ పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement