ఈ మాటలన్నది మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్. ఆయన నిరాడంబరతను ప్రస్తుత యూపీ మంత్రి, ఒకప్పుడు మన్మోహన్‌సింగ్ బాడీగార్డ్‌గా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ అసిమ్ అరుణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘2004 నుంచి దాదాపు మూడేళ్ల పాటు మన్మోహన్‌కు బాడీగార్డుగా పనిచేశాను. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ప్రధానికి భద్రత కలి్పస్తుంది. క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్‌కు నాయకత్వం వహించే అవకాశం నాకు లభించింది.
క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నేను ప్రధానికి దగ్గరగా ఉండాల్సి వచ్చేది. ఏదైనా కారణాలవల్ల ఆయన వెంట ఒక అంగరక్షకుడు మాత్రమే ఉండాల్సి వస్తే.. నేనే ఉండేవాడిని. నీడలా ఆయనతో ఉండటమే నా బాధ్యత. డాక్టర్ సింగ్ వద్ద కేవలం ఒక కారు ఉండేది. అది మారుతి 800. ప్రధానమంత్రి కాన్వాయ్‌లోని నల్ల బీఎండబ్ల్యూ కార్ల వెనుక అది పార్క్ చేసి ఉండేది.
కాన్వాయ్ తీసే ప్రతీసారి ఆయన ఆ కారువైపు ఆతీ్మయంగా చూసేవారు. ఎందుకని అడిగితే.. ‘ఈ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించడం నాకు ఇష్టం లేదు అసిమ్. నా వాహనం అదే(మారుతి)’ అనేవారు. ఈ కారు మీ లగ్జరీ కోసం కాదు.. సెక్యూరిటీ ఫీచర్లున్నాయి కాబట్టి మీరు ఇదే వాడాలి’ అని వివరించేవాడిని’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2004లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్‌ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమాండోగా శిక్షణ పొందిన తొలి ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్.
Comments
Please login to add a commentAdd a comment