Maruti 800
-
‘బీఎండబ్ల్యూ ప్రధాని కోసం.. నా కారు మారుతి 800’
ఈ మాటలన్నది మాజీ ప్రధాని మన్మోహన్సింగ్. ఆయన నిరాడంబరతను ప్రస్తుత యూపీ మంత్రి, ఒకప్పుడు మన్మోహన్సింగ్ బాడీగార్డ్‌గా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ అసిమ్ అరుణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘2004 నుంచి దాదాపు మూడేళ్ల పాటు మన్మోహన్‌కు బాడీగార్డుగా పనిచేశాను. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ప్రధానికి భద్రత కలి్పస్తుంది. క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్‌కు నాయకత్వం వహించే అవకాశం నాకు లభించింది. క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా నేను ప్రధానికి దగ్గరగా ఉండాల్సి వచ్చేది. ఏదైనా కారణాలవల్ల ఆయన వెంట ఒక అంగరక్షకుడు మాత్రమే ఉండాల్సి వస్తే.. నేనే ఉండేవాడిని. నీడలా ఆయనతో ఉండటమే నా బాధ్యత. డాక్టర్ సింగ్ వద్ద కేవలం ఒక కారు ఉండేది. అది మారుతి 800. ప్రధానమంత్రి కాన్వాయ్‌లోని నల్ల బీఎండబ్ల్యూ కార్ల వెనుక అది పార్క్ చేసి ఉండేది. కాన్వాయ్ తీసే ప్రతీసారి ఆయన ఆ కారువైపు ఆతీ్మయంగా చూసేవారు. ఎందుకని అడిగితే.. ‘ఈ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించడం నాకు ఇష్టం లేదు అసిమ్. నా వాహనం అదే(మారుతి)’ అనేవారు. ఈ కారు మీ లగ్జరీ కోసం కాదు.. సెక్యూరిటీ ఫీచర్లున్నాయి కాబట్టి మీరు ఇదే వాడాలి’ అని వివరించేవాడిని’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2004లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమాండోగా శిక్షణ పొందిన తొలి ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్. -
కిర్రాక్ కుర్రోడు: రూ. 45 వేలకే ‘రోల్స్ రాయిస్’! వైరల్ వీడియో
ఐడియా ఉండాలేకానీ.. ఈ లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదేమో..కేరళకు చెందిన ఒక యువకుడు ఇదే విషయాన్ని మరో సారి రుజువు చేశాడు. తన దగ్గర ఉన్న బడ్జెట్ కారు మారుతి 800ని ఏకంగా లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు. దీనికి ఖర్చు చేసింది కూడా చాలా తక్కువ. కేవలం 45 వేల రూపాయలను వెచ్చించి దీన్ని రూపొందించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఐదు రోజుల్లో దాదాపు 3 లక్షల వ్యూస్ సంపాదించింది. వివరాల్లోకి వెళితే కేరళకు 18 ఏళ్ల యువకుడు ఆటోమొబైల్ ఔత్సాహికుడు హదీఫ్ ఘనతను సాధించాడు. యూట్యూబ్ ఛానెల్ ట్రిక్స్ ట్యూబ్ ఈ వీడియోను షేర్ చేసింది. మొత్తం కస్టమైజేషన్‌కు రూ. 45,000 ఖర్చవుతుందని చెప్పాడు హదీఫ్. విలాసవంతమైన కార్లలాగా మోడిఫై చేయడం ఇష్టమని, అందుకే రోల్స్ రాయిస్ లాంటి కారును, లోగోను సృష్టించానని చెప్పుకొచ్చాడు. (ఎట్టకేలకు శుభవార్త చెప్పిన అంబానీ : త్వరలోనే మూడు ముళ్లు!) రోల్స్ రాయిస్ తరహాలో ముందు భాగంలో పెద్ద సైజు గ్రిల్‌ను అమర్చాడు. ఇంకా మెరుగైన ఇంటీరియర్స్, LED DRLలు, పెయింట్ జాబ్‌తో ఇంప్రెసివ్‌గా తయారు చేశాడు. అంతేకాదు ‘స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ’ అని రాసి ఉన్న కార్ బానెట్‌ని కూడా అందించానని హదీఫ్ తెలిపాడు. ఇదంతా కేవలం రూ.45 వేలలోనే చేశానని చెప్పాడు. అయితే, హదీఫ్ ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో అతను మోటార్ సైకిల్ ఇంజిన్ని ఉపయోగించి జీప్‌ను తయారు చేశాడట. అంతేకాదు ఇలాంటి ఆకర్షణీమైన కార్లను చాలా సులువుగా తయారు చేయగలనని వెల్లడించాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (రూ.2000 నోట్లు: ఆర్బీఐ గుడ్ న్యూస్) కాగా శ్రీనగర్‌కు చెందిన ఒక గణిత ఉపాధ్యాయుడు బిలాల్ అహ్మద్ చెత్తనుంచి సౌరశక్తితో నడిచే కారును తయారు చేశాడు. కారు బానెట్, బూట్, కిటికీలపై కూడా సోలార్ ప్యానెల్స్ ను కూడా సోలార్ ప్యానెల్స్ అమర్చాడు. అవసరమైన ఆర్థిక సాయంలేక దీనికి 11 ఏళ్లు పట్టిందని, లేదంటే తాను కశ్మీర్‌కు చెందిన ఎలాన్ మస్క్‌గా మారేవాడిని అని వ్యాఖ్యానించాడు ఇది మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించడం,సహాయం చేయడం తెలిసిన సంగతే. -
మారుతీ వేగన్ ఆర్ అమ్మకాలు @ 15 లక్షలు
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు 15 లక్షల అమ్మకాల మైలురాయిని సాధించింది. వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఎప్పటికప్పుడు ఈ మోడల్లో మార్పులు, చేర్పులు చేయడం, విజయవంతమైన మార్కెటింగ్ విధానాల ద్వారా ఈ ఘనతను సాధించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) మనోహర్ భట్ చెప్పారు. ఈ మోడల్‌ను 2000 సంవత్సరంలో మార్కెట్లోకి తెచ్చామని, భారత్‌లో విక్రయమవుతున్న అత్యుత్తమ 5 బ్రాండ్లలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. 2010-11లో ఈ మోడల్లో సీఎన్జీ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. గతనెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో వ్యాగన్ ఆర్ మూడో స్థానంలో నిలిచిందని సియామ్(సొ సైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మాన్యుఫాక్చరర్స్) వెల్లడించిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 1,56,000 కార్లను విక్రయించామని, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ 93 వేలకు పైగా కార్లను అమ్మామని చెప్పారు. కాగా ఈ కంపెనీ మోడళ్లు- మారుతీ 800, ఆల్టోలు ఒక్కోటి 25 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.