ఐడియా ఉండాలేకానీ.. ఈ లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదేమో..కేరళకు చెందిన ఒక యువకుడు ఇదే విషయాన్ని మరో సారి రుజువు చేశాడు. తన దగ్గర ఉన్న బడ్జెట్ కారు మారుతి 800ని ఏకంగా లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు. దీనికి ఖర్చు చేసింది కూడా చాలా తక్కువ. కేవలం 45 వేల రూపాయలను వెచ్చించి దీన్ని రూపొందించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఐదు రోజుల్లో దాదాపు 3 లక్షల వ్యూస్ సంపాదించింది.
వివరాల్లోకి వెళితే కేరళకు 18 ఏళ్ల యువకుడు ఆటోమొబైల్ ఔత్సాహికుడు హదీఫ్ ఘనతను సాధించాడు. యూట్యూబ్ ఛానెల్ ట్రిక్స్ ట్యూబ్ ఈ వీడియోను షేర్ చేసింది. మొత్తం కస్టమైజేషన్‌కు రూ. 45,000 ఖర్చవుతుందని చెప్పాడు హదీఫ్. విలాసవంతమైన కార్లలాగా మోడిఫై చేయడం ఇష్టమని, అందుకే రోల్స్ రాయిస్ లాంటి కారును, లోగోను సృష్టించానని చెప్పుకొచ్చాడు. (ఎట్టకేలకు శుభవార్త చెప్పిన అంబానీ : త్వరలోనే మూడు ముళ్లు!)
రోల్స్ రాయిస్ తరహాలో ముందు భాగంలో పెద్ద సైజు గ్రిల్‌ను అమర్చాడు. ఇంకా మెరుగైన ఇంటీరియర్స్, LED DRLలు, పెయింట్ జాబ్‌తో ఇంప్రెసివ్‌గా తయారు చేశాడు. అంతేకాదు ‘స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ’ అని రాసి ఉన్న కార్ బానెట్‌ని కూడా అందించానని హదీఫ్ తెలిపాడు. ఇదంతా కేవలం రూ.45 వేలలోనే చేశానని చెప్పాడు. అయితే, హదీఫ్ ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో అతను మోటార్ సైకిల్ ఇంజిన్‌ని ఉపయోగించి జీప్‌ను తయారు చేశాడట. అంతేకాదు ఇలాంటి ఆకర్షణీమైన కార్లను చాలా సులువుగా తయారు చేయగలనని వెల్లడించాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (రూ.2000 నోట్లు: ఆర్‌బీఐ గుడ్ న్యూస్)
కాగా శ్రీనగర్‌కు చెందిన ఒక గణిత ఉపాధ్యాయుడు బిలాల్ అహ్మద్ చెత్తనుంచి సౌరశక్తితో నడిచే కారును తయారు చేశాడు. కారు బానెట్, బూట్, కిటికీలపై కూడా సోలార్ ప్యానెల్స్ ను కూడా సోలార్ ప్యానెల్స్ అమర్చాడు. అవసరమైన ఆర్థిక సాయంలేక దీనికి 11 ఏళ్లు పట్టిందని, లేదంటే తాను కశ్మీర్‌కు చెందిన ఎలాన్ మస్క్‌గా మారేవాడిని అని వ్యాఖ్యానించాడు ఇది మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించడం,సహాయం చేయడం తెలిసిన సంగతే.
Comments
Please login to add a commentAdd a comment