బీఎండబ్ల్యూ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ లైన్.. కొత్త వేరియంట్
ధర రూ. 39.9 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ ట్యురిస్మో స్పోర్ట్ లైన్ కారులో అప్‌డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ వేరియంట్ పరిచయ ధర రూ.39.90 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ చెప్పారు. ఈ కొత్త వేరియంట్‌లో డ్రైవింగ్ పరిస్థితులను బట్టి వివిధ మోడ్‌ల డ్రైవింగ్‌ను ఎంచుకునే బీఎండబ్ల్యూ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కంట్రోల్ స్విచ్ వంటి ఫీచర్ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో 12కు పైగా మోడళ్లను విక్రయిస్తున్నామని, వీటిల్లో ఎనిమిదింటిని చెన్నై ప్లాంట్‌లోనే అసెంబుల్ చేస్తున్నామని వివరించారు. 2007 నుంచి భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటివరకూ రూ.490 కోట్లు పెట్టుబడులు పెట్టింది.