ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా ఈ ఏడాది రెండంకెల బలమైన వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేస్తోంది. ‘2023 జనవరి–జూన్‌లో 97 శాతం వృద్ధితో 3,500 యూనిట్లు విక్రయించాం. ఎస్‌యూవీలు 200 శాతం, స్పోర్ట్స్ కార్ల విభాగం 127 శాతం అధిక అమ్మకాలను సాధించాయి.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి 20 శాతం మాత్రమే. జూలైలోనూ మెరుగైన విక్రయాలు నమోదు చేశాం’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. కాగా, కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్యూ8 ఈ–ట్రాన్ విడుదల చేసింది.
ధర ఎక్స్‌షోరూంలో రూ.1.14 కోట్ల నుంచి ప్రారంభం. 50, 55 ట్రిమ్స్‌లో లభిస్తుంది. ట్రిమ్‌నుబట్టి ఒకసారి చార్జింగ్‌తో 491–600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 55 ట్రిమ్ గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకన్లలో అందుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment