expects
-
దూసుకెళ్తున్న ఆడి కార్లు.. డబుల్ డిజిట్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా ఈ ఏడాది రెండంకెల బలమైన వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేస్తోంది. ‘2023 జనవరి–జూన్‌లో 97 శాతం వృద్ధితో 3,500 యూనిట్లు విక్రయించాం. ఎస్‌యూవీలు 200 శాతం, స్పోర్ట్స్ కార్ల విభాగం 127 శాతం అధిక అమ్మకాలను సాధించాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి 20 శాతం మాత్రమే. జూలైలోనూ మెరుగైన విక్రయాలు నమోదు చేశాం’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. కాగా, కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ ఎస్యూవీ క్యూ8 ఈ–ట్రాన్ విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.14 కోట్ల నుంచి ప్రారంభం. 50, 55 ట్రిమ్స్‌లో లభిస్తుంది. ట్రిమ్నుబట్టి ఒకసారి చార్జింగ్‌తో 491–600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 55 ట్రిమ్ గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకన్లలో అందుకుంటుంది. -
2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి.. మహీంద్రా అండ్ మహీంద్రా లక్ష్యం
కేప్‌టౌన్ (దక్షిణాఫ్రికా): మహారాష్ట్రలోని చకాన్‌లో నెలకొల్పుతున్న ప్లాంటు నుంచి వార్షికంగా 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని సాధించాలని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నిర్దేశించుకుంది. 2027–29 మధ్య కాలంలో దీన్ని సాధించగలమని సంస్థ ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) వీజే నక్రా తెలిపారు. 2030 నాటికల్లా తమ మొత్తం వాహన విక్రయాల్లో 30 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. బీఈ శ్రేణిలో తొలి వాహనాన్ని వచ్చే ఏడాది ఆఖర్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతకన్నా 4–5 నెలల ముందు నుంచే చకాన్ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కాగలదని నక్రా వివరించారు. చకాన్‌లో రూ. 10,000 కోట్లతో విద్యుత్ వాహనాల ప్లాంటును నెలకొల్పేందుకు కంపెనీకి ఈ ఏడాది జనవరిలో అనుమతులు లభించాయి. బార్న్ ఎలక్ట్రిక్ (బీఈ) మోడల్స్ తయారీ కోసం ఈ ప్లాంటుపై వచ్చే 7–8 ఏళ్లలో కంపెనీ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఎక్స్‌యూవీ, కేవలం విద్యుత్ వాహనాల కోసమే ఉద్దేశించిన బీఈ బ్రాండ్ల కింద మొత్తం అయిదు ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్స్‌ను ప్రవేశపెట్టడంపై కంపెనీ కసరత్తు చేస్తోంది. -
వచ్చే ఏడాదీ రూపాయిపై ఒత్తిడి
ముంబై: రూపాయి వచ్చే ఏడాది కూడా డాలర్‌తో ఒత్తిళ్లను ఎదుర్కోవచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. డాలర్ మారకంలో 85 శ్రేణిని చేరుకోచ్చని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత చమురు ధరలు పెరిగిపోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు తదితర అంశాల ప్రభావంతో రూపాయి విలువ అక్టోబర్ 19న జీవిత కాల కనిష్ట స్థాయి 83కు తగ్గిపోవడం తెలిసిందే. ఆ స్థాయి నుంచి కోలుకుని ప్రస్తుతం 82 స్థాయిలో ట్రేడవుతోంది. ముంబైలో గురు వారం ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న పలువురు ఆర్థిక వేత్తలు స్పందిస్తూ.. కరెంటు ఖాతా లోటు విస్తరించినందున (జీడీపీలో 4 శాతానికి) ఇక ముందూ రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఎగుమతులు సైతం గత నెలలో క్షీణించడాన్ని ప్రస్తావించారు. వచ్చే ఏడాది డాలర్ మారకంలో రూపాయి 82–85 శ్రేణిలో చలించొచ్చని అంచనా వేశారు. రూ పాయి గరిష్టంగా 83, కనిష్టంగా 85కు చేరుకోవచ్చని ఐసీఆర్ఐఈఆర్ సీఈవో దీపక్ మిశ్రా, జేపీ మోర్గాన్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సాజిద్ చినాయ్ పేర్కొన్నారు. రూపాయి 80–82 రేంజ్లో ఉండొచ్చని ఎస్బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్ అంచనా వేశా రు. ఐజీఐడీఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ రాజేశ్వరిసేన్ గుప్తా 84–85కు చేరుకోవచ్చన్నారు. -
భారీ టార్గెట్ పెట్టుకున్న ఫ్లిప్‌కార్ట్
సాక్షి, న్యూఢిల్లీ: బిగ్ బిలియన్ డేస్ అంటూ ఆఫర్లకు తెరలేపిన ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ భారీ టార్గెట్‌నే పెట్టుకుంది. ముఖ్యంగా ఈ స్పెషల్ సేల్ ఫ్యాషన్ విభాగం బిజినెస్‌లో భారీ జంప్ ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ ఫెస్టివ్ షాపింగ్ లో దాదాపు 60శాతం అమ్మకాలతో 17రెట్లు ఎక్కువ వ్యాపారం సాధించనున్నామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో సుమారు 5రెట్ల అదనపు స్టయిల్స్‌తో కోటి పైగా మోడల్స్‌ను ఈ సేల్‌లో అందుబాటులో ఉంచామనీ, భారీ డిస్కౌంట్లతో వినియోగదారులకు ఆకట్టుకోనున్నామని పేర్కొంది. ఈ కార్యక్రమంలో మొత్తం అమ్మకాలలో 60 శాతం కంటే ఎక్కువ భాగం ఫ్యాషన్ విభాగానిదేనని ఫ్లిప్‌కార్ట్ లైఫ్ స్టయిల్ హెడ్ రిషి వాసుదేవ తెలిపారు. పండుగ షాపింగ్ పర్యాయ పదంగా బిగ్‌బిలియన్ డేస్ సేల్ నిలవనుందని వెల్లడించింది. అలాగే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీ డిమాండ్‌ను ఊహించి తమ సామర్ధ్యాన్ని రెండింతలు చేశామనీ, ఈ నేపథ్యంలో క్రేజీ డీల్స్, పాపులర్ బ్రాండ్స్‌పై మక్కువతో మరింతగా ఆన్లైన్ షాపింగ్‌ను ఎంచుకుంటారన్నారు.