భారీ టార్గెట్‌ పెట్టుకున్న ఫ్లిప్‌కార్ట్‌ | Flipkart expects 17x jump in fashion business during Big Billion Days sale | Sakshi
Sakshi News home page

భారీ టార్గెట్‌ పెట్టుకున్న ఫ్లిప్‌కార్ట్‌

Published Mon, Sep 18 2017 8:37 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

భారీ టార్గెట్‌ పెట్టుకున్న ఫ్లిప్‌కార్ట్‌ - Sakshi

భారీ టార్గెట్‌ పెట్టుకున్న ఫ్లిప్‌కార్ట్‌

సాక్షి, న్యూఢిల్లీ:  బిగ్ బిలియన్ డేస్  అంటూ  ఆఫర్లకు తెరలేపిన  ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ భారీ టార్గెట్‌నే   పెట్టుకుంది.  ముఖ్యంగా  ఈ స్పెషల్‌ సేల్‌  ఫ్యాషన్‌  విభాగం  బిజినెస్‌లో  భారీ జంప్‌ ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ ఫెస్టివ్‌  షాపింగ్‌ లో  దాదాపు 60శాతం అమ‍్మకాలతో 17రెట్లు ఎక్కువ   వ్యాపారం సాధించనున్నామని  ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.  

వివిధ కేటగిరీల్లో సుమారు 5రెట్ల అదనపు స్టయిల్స్‌తో కోటి పైగా మోడల్స్‌ను ఈ సేల్‌లో అందుబాటులో ఉంచామనీ,  భారీ డిస్కౌంట్లతో  వినియోగదారులకు ఆకట్టుకోనున్నామని పేర్కొంది.  ఈ కార్యక్రమంలో మొత్తం అమ్మకాలలో 60 శాతం కంటే ఎక్కువ భాగం ఫ్యాషన్ విభాగానిదేనని ఫ్లిప్‌కార్ట్‌ లైఫ్‌ స్టయిల్‌ హెడ్‌  రిషి వాసుదేవ తెలిపారు. పండుగ షాపింగ్‌  పర్యాయ పదంగా బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌ నిలవనుందని వెల్లడించింది.   అలాగే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీ డిమాండ్‌ను ఊహించి తమ సామర్ధ్యాన్ని రెండింతలు చేశామనీ, ఈ నేపథ్యంలో క్రేజీ డీల్స్‌, పాపులర్‌ బ్రాండ్స్‌పై మక్కువతో మరింతగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ను ఎంచుకుంటారన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement