MG unveils Comet EV Gamer Edition ఎంజీ మెటార్ ఇండియా తన బుల్లి ఈవీ కామెట్ లో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ‘గేమర్ ఎడిషన్’గా పేరుతో కామెట్ ఈవీ ఆల్-ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈసీ సెగ్మెంట్‌లో ఇది కస్టమైజ్ చేసిన ఫస్ట్‌కారుగా నిలిచింది. గేమర్ ఎడిషన్ ట్రిమ్ గేమర్‌లు, యువ కొనుగోలుదారులే లక్ష్యంగా స్టీరింగ్ వీల్ కవర్, థీమ్‌డ్ మేట్స్ లాంటి స్పెషల్ యాక్ససరీస్‌తో ఆకర్ణణీయంగా తీసుకొచ్చింది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?)
కామెట్ ఈవీ బేస్ ధరతో పోలిస్తే ఈ ఎడిషన్ ధర రూ. 64,999 ఎక్కువ. రూ. 8.65 లక్షలతో ఎక్స్‌క్లూజివ్ గేమర్ ఎడిషన్ ఎంజీ కామెట్ ఈవీ - పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు కామెట్ 'గేమర్ ఎడిషన్'ను ఆన్‌లైన్‌లో లేదా భారతదేశం అంతటా ఎంజీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్‌ఫైర్ )
బోల్డ్, వైబ్రంట్, డైనమిక్ , టెక్నో వైబ్ ప్రేరణగా ఈ కామెట్ EV ఎడిషన్, గేమింగ్‌లో అడ్రినలిన్ రష్‌ని ఇష్టపడే Gen Z కోసం డార్క్ అంట్ లైట్ తేలికపాటి థీమ్‌లలో డార్క్ క్రోమ్, మెటల్ ఫినిషింగ్‌తో రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ మెటీరియల్‌తో స్పెషల్‌ఎట్రాక్షన్‌గా ఉంటుందని కంపెనీ చెప్పింది.
ఈస్తటిక్ అండ్ డిజైన్ ఓరియంటెడ్‌గా, గేమింగ్ స్ట్రీమర్, ఇన్‌ఫ్లుయెన్సర్ మోర్టల్ (నమన్ మాథుర్) సహకారంతో దీన్ని రూపొందించింది. సైడ్ మౌల్డింగ్‌లు, కార్పెట్ మ్యాట్‌లు, ఇంటీరియర్ ఇన్‌సర్ట్‌లు, బాడీ గ్రాఫిక్స్, స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్‌లు వంటి ప్రత్యేకతలున్నాయి. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి)
ఇంకా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS +EBD, ఫ్రంట్ & రియర్ 3 pt తోపాటు, సీట్ బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్, TPMS (పరోక్ష) , ISOFIX చైల్డ్ సీట్లు లాంటి ఇతర ఫీచర్లున్నాయి. ఎంజీ కామెట్ EV 17.3 KWH Li-ion బ్యాటరీతో 230 కిమీ (క్లెయిమ్) బ్యాటరీ పరిధితో వస్తుంది మరియు దాదాపు 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!)
కాగా ఎంజీ మోటార్స కామెట్ ఎలక్ట్రిక్ వాహనం ఏప్రిల్ 2023లో భారతదేశంలో లాంచ్ చేసింది. దేశీయంగా ఇదే కాంపాక్ట్‌కారుగా పాపులర్ అయింది. పేస్ వేరియంట్ కోసం 7,98,000 నుండి (ఎక్స్-షోరూమ్), రూ. ప్లష్ వేరియంట్ కోసం 9,98,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment