MG Comet EV
-
ఎంజీ బుల్లి కామెట్ ఈవీస్పెషల్ గేమర్ ఎడిషన్: ధర పెరిగిందా?
MG unveils Comet EV Gamer Edition ఎంజీ మెటార్ ఇండియా తన బుల్లి ఈవీ కామెట్ లో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ‘గేమర్ ఎడిషన్’గా పేరుతో కామెట్ ఈవీ ఆల్-ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈసీ సెగ్మెంట్లో ఇది కస్టమైజ్ చేసిన ఫస్ట్కారుగా నిలిచింది. గేమర్ ఎడిషన్ ట్రిమ్ గేమర్లు, యువ కొనుగోలుదారులే లక్ష్యంగా స్టీరింగ్ వీల్ కవర్, థీమ్డ్ మేట్స్ లాంటి స్పెషల్ యాక్ససరీస్‌తో ఆకర్ణణీయంగా తీసుకొచ్చింది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) కామెట్ ఈవీ బేస్ ధరతో పోలిస్తే ఈ ఎడిషన్ ధర రూ. 64,999 ఎక్కువ. రూ. 8.65 లక్షలతో ఎక్స్‌క్లూజివ్ గేమర్ ఎడిషన్ ఎంజీ కామెట్ ఈవీ - పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు కామెట్ 'గేమర్ ఎడిషన్'ను ఆన్లైన్లో లేదా భారతదేశం అంతటా ఎంజీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్ ) బోల్డ్, వైబ్రంట్, డైనమిక్ , టెక్నో వైబ్ ప్రేరణగా ఈ కామెట్ EV ఎడిషన్, గేమింగ్‌లో అడ్రినలిన్ రష్‌ని ఇష్టపడే Gen Z కోసం డార్క్ అంట్ లైట్ తేలికపాటి థీమ్‌లలో డార్క్ క్రోమ్, మెటల్ ఫినిషింగ్‌తో రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ మెటీరియల్‌తో స్పెషల్ఎట్రాక్షన్గా ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈస్తటిక్ అండ్ డిజైన్ ఓరియంటెడ్‌గా, గేమింగ్ స్ట్రీమర్, ఇన్ఫ్లుయెన్సర్ మోర్టల్ (నమన్ మాథుర్) సహకారంతో దీన్ని రూపొందించింది. సైడ్ మౌల్డింగ్‌లు, కార్పెట్ మ్యాట్లు, ఇంటీరియర్ ఇన్సర్ట్లు, బాడీ గ్రాఫిక్స్, స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్లు వంటి ప్రత్యేకతలున్నాయి. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) ఇంకా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS +EBD, ఫ్రంట్ & రియర్ 3 pt తోపాటు, సీట్ బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్, TPMS (పరోక్ష) , ISOFIX చైల్డ్ సీట్లు లాంటి ఇతర ఫీచర్లున్నాయి. ఎంజీ కామెట్ EV 17.3 KWH Li-ion బ్యాటరీతో 230 కిమీ (క్లెయిమ్) బ్యాటరీ పరిధితో వస్తుంది మరియు దాదాపు 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) కాగా ఎంజీ మోటార్స కామెట్ ఎలక్ట్రిక్ వాహనం ఏప్రిల్ 2023లో భారతదేశంలో లాంచ్ చేసింది. దేశీయంగా ఇదే కాంపాక్ట్కారుగా పాపులర్ అయింది. పేస్ వేరియంట్ కోసం 7,98,000 నుండి (ఎక్స్-షోరూమ్), రూ. ప్లష్ వేరియంట్ కోసం 9,98,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్న సంగతి తెలిసిందే. -
చీపెస్ట్ ఈవీ ‘ఎంజీ కామెట్’ వెయిటింగ్‌కు చెక్: బుకింగ్ ప్రైస్ తెలిస్తే!
సాక్షి, ముంబై: ఎంజీ మోటార్స్ కాంపాక్ట్ ఈవీ కామెట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కంపెనీ తీపి కబురు. భారతదేశపు చౌకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఇవీ ఇప్పుడు బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. ఎంజీ మోటార్ ఇండియా వెబ్సైట్ ద్వారా లేదా ఎంజీ డీలర్‌షిప్‌ల వద్ద కస్టమర్లు కేవలం రూ. 11వేలు మాత్రమే చెల్లించి మే బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ‘MyMG’ యాప్‌లో ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. కస్టమర్లు తమ కార్ బుకింగ్‌ల స్టేటస్‌ను వారి ఫోన్ల నుండే ట్రాక్ చేయవచ్చు. కామెట్ ఈవీ ప్రత్యేక ఆఫర్ ధరలో అందుబాటులో ఉంటుంది. పేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు. ప్లే, ప్లష్ వేరియంట్ ధరలు రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ ఆఫర్ మొదటి 5వేల బుకింగ్‌లకు మాత్రమే పరిమితం. మే నెలలోనే దశలవారీ డెలివరీలు ప్రారంభమని కంపెనీ తెలిపింది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) కామెట్ ఈవీ: 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్‌తో ఫ్లోటింగ్ట్విన్ డిస్ప్లే వైడ్స్క్రీన్తో వస్తోంది. ఫుల్లీ కస్టమైజ్డ్ విడ్జెట్లతో కూడిన ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, స్మార్ట్ కీ మరో ప్రత్యేక లక్షణం, స్టైలిష్ డిజైన్ కామెట్ ఒకే ఛార్జ్‌పై దాదాపు 230 కి.మీ పరిధిని అందజేస్తుందని కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. Introducing the MG Comet EV, the no-nonsense car that keeps it real. The car’s latest tech keeps you connected with your squad and has all the space for your fam. Experience the plush interiors, latest tech and futuristic design of the Comet EV! Bookings open now! #MGCometEV — Morris Garages India (@MGMotorIn) May 13, 2023 ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు -
ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి
ఎంజి మోటార్ ఇండియా ఇటీవల తన కామెట్ (Comet) ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాంచ్ సమయంలో కంపెనీ కేవలం ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడించింది, కాగా ఇప్పుడు వేరియంట్స్, వాటి ధరలను కూడా అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు: ఎంజి కామెట్ మొత్తం మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి పేస్ (Pace), ప్లే (Play), ప్లస్ (Plus). ఈ మూడు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 7.98 లక్షలు, రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ మే 15 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఈ నెల చివర నాటికి మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే మొదటి బుక్ చేసుకున్న 5000 మందికి మాత్రమే ప్రారంభ ధరలు వర్తిస్తాయి. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. (ఇదీ చూడండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!) డిజైన్ & ఫీచర్స్: దేశీయ మార్కెట్లో విడుదలైన ఎంజి కామెట్ చూడటానికి చిన్నదిగా ఉన్నపటికీ మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. రెండు వింగ్ మిర్రర్స్ కనెక్టెడ్ క్రోమ్ స్రిప్ కలిగి ముందు వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బాస్ కలిగి, సైడ్ ప్రొఫైల్ 12 ఇంచెస్ వీల్స్ తో ఉంటుంది. రియర్ ఫ్రొఫైల్ లో కూడా వెడల్పు అంతటా వ్యాపించి ఉండే లైట్ బార్ చూడవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ముందు భాగంలో ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి లోపల వైట్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ & డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ ఉంటాయి. ముందు ప్యాసింజర్ సీటులో వన్ టచ్ టంబుల్ అండ్ ఫోల్డ్ ఫీచర్స్ లభిస్తాయి. అయితే రియర్ సీట్లు 50:50 స్ప్లిట్ పొందుతాయి. అంతే కాకుండా ఇందులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చూడండి: భారత్‌లో రూ. 15.95 లక్షల బైక్ లాంచ్ - ప్రత్యేకతలేంటో తెలుసా?) బ్యాటరీ అండ్ రేంజ్: ఎంజి కామెట్ 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ కోసం IP67 రేటింగ్ పొందుతుంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ARAI ధ్రువీకరించింది. ఇది 42 bhp పవర్ అండ్ 110 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కామెట్ 3.3 కిలోవాట్ ఆన్ బోర్డ్ ఛార్జర్‌తో 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. -
ఎం జి కామెట్ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం అనువైన ధరలో
-
మొదలైన 'ఎంజీ కామెట్' టెస్ట్ డ్రైవ్స్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
ఇటీవల భారతదేశంలో విడుదలైన చిన్న హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారు 'ఎంజీ కామెట్' ఎంతో మంది వాహన ప్రేమికుల మనసు దోచింది. ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే కస్టమర్లు 2023 మే 15 నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు, టెస్ట్ డ్రైవ్స్ వంటి వివరాలు ఇక్కడ చూసేద్దాం.. గత నెల చివరిలో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ కారు ఎంజి కామెట్ ఈవీ టెస్ట్ డ్రైవ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). కాగా డెలివరీలు మే నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. ఎంజి కామెట్ చూడటానికి చిన్న కారు అయినప్పటికీ అద్భుతమైన డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు డిజైన్ విషయానికి వస్తే ఎంజీ కామెట్ ఈవీ వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బార్ కలిగి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ లైట్ బార్ కింద ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం గమనించవచ్చు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) ఫీచర్స్ విషయానికి వస్తే ఈ చిన్న కారు 10.25 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డ్రైవర్ డిస్ప్లే రెండూ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, మ్యాన్యువల్ ఏసీ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటితో పాటు 55కి పైగా కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) 3.67 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎంజి కామెట్ ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 230 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI దృవీకరించింది. ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారు 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. ఎంజి కామెట్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ పరిమాణం పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఏబీఎస్ విత్ ఈబిడి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ కెమెరా వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారుకి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చేస్తున్న ఎంజీ బుజ్జి ఈవీ కామెట్ లాంచ్ అయింది. అందరూ ఊహించినట్టుగానే రూ. 10లక్షల లోపు ధరతోనే తీసుకొచ్చింది. పరిచయ ఆఫర్‌గా దీని ప్రారంభ ధరను రూ.7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. సిటీ రన్‌అబౌట్ కోసం చూస్తున్న కొనుగోలుదారులే లక్ష్యంగా స్పోర్టీ లుక్, యూనిక్ కలర్స్‌లో కామెట్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ను లాంచ్ చేసింది. అందుబాటులో లభ్యం కానున్న ఈ కారు ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువేనని సగటున నెలకు ధర రూ. 519 ఖర్చవుతుందని కంపెనీ వెల్లడించింది. ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ ధర, లభ్యత కామెట్ ఈవీ ప్రారంభ ధర రూ.7.98లక్షలు (ఎక్స్-షోరూమ్). ఏప్రిల్ 27 నుండి టెస్ట్ డ్రైవ్‌కి అందుబాటులో ఉంటుంది. బుకింగ్‌లు మే 15న ప్రారంభమవుతాయి. డెలివరీలు నెల తర్వాత మొదలవుతాయి. వైట్, బ్లాక్, సిల్వర్ సింగిల్ కలర్ ఆప్షన్లతో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు వచ్చింది. బ్లాక్ రూఫ్‌తో గ్రీన్, బ్లాక్ రూఫ్‌తో వైట్ డ్యుయల్ టోన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. (ఏఐపై ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు: అద్భుతమైన వీడియో ) ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ ఫీచర్లు ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు 17.3kWh బ్యాటరీతో వచ్చింది. ఇది 41 hp పీక్ పవర్‌ను, 110 Nm పీక్ టార్క్యూను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక దీని టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు (100kmph)గా ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని ఎంజీ మోటార్స్ పేర్కొంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లతో కామెట్ ఈవీని తీసుకొచ్చింది. 2,974mm పొడవు, 1,505mm వెడల్పు ,1,640mm ఎత్తును 2,010mm వీల్‌బేస్‌తో వచ్చింది. ఇక పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, భారతదేశంలో లభించే ఇతర చిన్న కారు ఆల్టో K10 కంటే , కామెట్ ఈవీ కంటే 556 మిమీ పొడవు తక్కువ. 10.25 ఇంచుల సైజ్ ఉండే రెండు స్క్రీన్లలో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేగా, రెండోది ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేగా ఉంటుంది. యాపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ ఆటో కంట్రోల్‌లతో కూడిన టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇంకా 12 ఇంచుల వీల్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, రేర్ పార్కింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ లాంటి ప్రధాన ఫీచర్లున్నాయి. టాటా టియాగో ఈవీ, సిట్రాయిన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కార్లకు ఎంజీ కామెట్ ఈవీ గట్టిపోటీ ఇవ్వనుంది. టాటా టియాగోతో పోలిస్తే ధర కూడా తక్కువే కావడం గమనార్హం. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన)