MG Comet EV Bookings Open at Rs 11K Deliveries to Begin - Sakshi
Sakshi News home page

MG Comet EV: చీపెస్ట్‌ ఈవీ ‘ఎంజీ కామెట్‌’ వెయిటింగ్‌కు చెక్‌: బుకింగ్‌ ప్రైస్‌ తెలిస్తే!

Published Mon, May 15 2023 2:10 PM | Last Updated on Mon, May 15 2023 4:17 PM

MG Comet EV bookings open at Rs11k deliveries to begin - Sakshi

సాక్షి, ముంబై:  ఎంజీ మోటార్స్‌ కాంపాక్ట్‌ ఈవీ  కామెట్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి  కంపెనీ తీపి కబురు.  భారతదేశపు చౌకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్‌ ఇవీ  ఇప్పుడు బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. ఎంజీ మోటార్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా లేదా ఎంజీ డీలర్‌షిప్‌ల వద్ద కస్టమర్‌లు   కేవలం రూ. 11వేలు మాత్రమే చెల్లించి మే బుక్ చేసుకోవచ్చు. 

కంపెనీ ‘MyMG’ యాప్‌లో ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. కస్టమర్‌లు తమ కార్ బుకింగ్‌ల స్టేటస్‌ను వారి ఫోన్‌ల నుండే ట్రాక్‌ చేయవచ్చు. కామెట్ ఈవీ  ప్రత్యేక ఆఫర్‌ ధరలో అందుబాటులో ఉంటుంది. పేస్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు. ప్లే, ప్లష్ వేరియంట్‌ ధరలు రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ ఆఫర్ మొదటి 5వేల  బుకింగ్‌లకు మాత్రమే పరిమితం. మే నెలలోనే దశలవారీ డెలివరీలు ప్రారంభమని కంపెనీ తెలిపింది. (టీ స్టాల్‌ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు)

కామెట్ ఈవీ: 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్‌తో ఫ్లోటింగ్ట్విన్ డిస్‌ప్లే వైడ్‌స్క్రీన్‌తో వస్తోంది. ఫుల్లీ కస్టమైజ్‌డ్‌ విడ్జెట్‌లతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్,  స్మార్ట్ కీ మరో ప్రత్యేక లక్షణం, స్టైలిష్ డిజైన్ కామెట్ ఒకే ఛార్జ్‌పై దాదాపు 230 కి.మీ పరిధిని అందజేస్తుందని  కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండిస్వీట్‌ కపుల్‌ సక్సెస్‌ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement