కోట్ల విలువైన కారు కొనుగోలు చేసిన సలార్ నటుడు! | Prithviraj Sukumaran Buys Swanky RS 3 Crore Porsche Car | Sakshi
Sakshi News home page

Prithviraj Sukumaran: భార్యతో కలిసి ఖరీదైన కారు కొన్న పృథ్వీరాజ్ సుకుమారన్!

Published Wed, Jun 26 2024 3:42 PM | Last Updated on Wed, Jun 26 2024 3:48 PM

Prithviraj Sukumaran Buys Swanky RS 3 Crore Porsche Car

సలార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల బడే మియాన్ చోటే మియాన్‌లో చిత్రంలో కనిపించారు. అంతకుముందు మలయాళంలో తెరకెక్కించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో అమలాపాల్‌ హీరోయిన్‌గా నటించింది. దుబాయ్‌లో ఓ వ్యక్తి నిజజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

తాజాగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. సరికొత్త పోర్షే మోడల్ కారును కొన్నారు. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోర్షే ఇండియా బ్రాండ్ ప్రతినిధులతో పృథ్వీరాజ్ మాట్లాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అతనితో పాటు భార్య సుప్రియా మీనన్ కూడా ఉన్నారు. 

కాగా.. పృథ్వీరాజ్ ఇప్పటికే లంబోర్గిని, పోర్స్చే, టాటా సఫారి, మినీ కూపర్ లాంటి మోడల్ కార్లు కలిగి ఉన్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఎల్‌2: ఎంపురాన్ షూట్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో నటించడమే కాకుండా లూసిఫర్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్‌లో జరుగుతుండగా.. కేరళ, న్యూఢిల్లీ, లడఖ్, యూఎస్ఏ, యూకే లొకేషన్లలో కూడా చిత్రీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement