Porsche 911 model
-
కోట్ల విలువైన కారు కొనుగోలు చేసిన సలార్ నటుడు!
సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల బడే మియాన్ చోటే మియాన్లో చిత్రంలో కనిపించారు. అంతకుముందు మలయాళంలో తెరకెక్కించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్గా నటించింది. దుబాయ్‌లో ఓ వ్యక్తి నిజజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.తాజాగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. సరికొత్త పోర్షే మోడల్ కారును కొన్నారు. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోర్షే ఇండియా బ్రాండ్ ప్రతినిధులతో పృథ్వీరాజ్ మాట్లాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అతనితో పాటు భార్య సుప్రియా మీనన్ కూడా ఉన్నారు. కాగా.. పృథ్వీరాజ్ ఇప్పటికే లంబోర్గిని, పోర్స్చే, టాటా సఫారి, మినీ కూపర్ లాంటి మోడల్ కార్లు కలిగి ఉన్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఎల్2: ఎంపురాన్ షూట్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో నటించడమే కాకుండా లూసిఫర్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్లో జరుగుతుండగా.. కేరళ, న్యూఢిల్లీ, లడఖ్, యూఎస్ఏ, యూకే లొకేషన్లలో కూడా చిత్రీకరించారు. View this post on Instagram A post shared by Porsche India (@porsche_in) -
దినేష్ ఠక్కర్ గ్యారేజిలో మరో సూపర్ కారు.. ధర ఎన్ని కోట్లంటే?
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అన్యదేశ్య కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు విదేశాల నుంచి తమకు ఇష్టమైన కార్లను దిగుమతి చేసుకుంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఏంజెల్ వన్ చైర్మన్ 'దినేష్ ఠక్కర్' తన గ్యారేజిలో అత్యంత ఖరీదైన లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల ఈయన సరికొత్త స్పోర్ట్స్ కారు పోర్స్చే 911 GT3 టూరింగ్ డెలివరీ తీసుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అత్యంత స్టైలిష్ సూపర్ కార్ బ్రాండ్ అయిన పోర్స్చే కంపెనీకి చెందిన '911 GT3 టూరింగ్' కారుని ఇటీవల కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. రూ. 2.75 కోట్ల ఎక్స్-షోరూమ్ వద్ద లభించే ఈ కారు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంది. ఈ స్పోర్ట్స్ కారు 4.0 లీటర్ ఫ్లాట్ 6 ఇంజన్‌తో 502 పీఎస్ పవర్ అండ్ 470 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పర్ఫామెన్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదీ చదవండి: కోట్ల సంపదను కాదని సన్యాసం పుచ్చుకున్న వజ్రాల వ్యాపారి ఫ్యామిలీ.. ఎందుకో తెలిస్తే.. పోర్స్చే 911 GT3 టూరింగ్ మాత్రమే కాకుండా ఈయన గ్యారేజిలో లంబోర్ఘిని ఉరుస్ (రూ. 4.17 కోట్లు), ఫెరారీ 488 పిస్తా, లంబోర్ఘిని హురాకాన్ పెర్ఫార్మంటే (రూ. 4 కోట్లు), మెర్సిడెస్ AMG జీటీ బ్లాక్ సిరీస్ (రూ. 5.5 కోట్లు), పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్, మెర్సిడెస్-AMG G63, మినీ కూపర్ ఉన్నాయి. అంతే కాకూండా భారతదేశపు మొట్టమొదటి పోర్షే టేకాన్ టర్బో S ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Dinesh Thakkar (@dineshdthakkar) -
‘చెల్లని చెక్కుతో లగ్జరీ కారు కొన్నాడు’
వాషింగ్టన్ : రూ కోటి విలువైన పోర్షే లగ్జరీ కారును నకిలీ చెక్‌తో కొనుగోలు చేసిన వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన వెలుగుచూసింది. తన ఇంట్లోని కంప్యూటర్లో ప్రింట్ చేసిన చెక్‌తో పోర్షే కారును కొనుగోలు చేయడంతో పాటు రోలెక్స్ వాచీలను నకిలీ చెక్‌లతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ గతవారం కాసీ విలియం కెల్లీ (42) పట్టుబడ్డాడు. వాల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం కెల్లీ డెస్టిన్‌లోని పోర్షే డీలర్షిప్ వద్ద జులై 27న 1,39,203 డాలర్ల నకిలీ చెక్‌ను ఇచ్చి దర్జాగా పోర్షే 911 టర్బోను తీసుకువెళ్లాడు. ఆయన ఇచ్చిన చెక్ చెల్లకపోవడంతో డీలర్ ఒకలూసా కౌంటీ షెరీఫ్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. చెల్లని చెక్కు ఇచ్చి పోర్షే కారులో చెక్కేసిన కెల్లీ ఆ కారుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అదే కారులో మిరమర్ బీచ్‌లో ఓ నగల దుకాణానికి వెళ్లి 61,521 డాలర్లకు మరో నకిలీ చెక్ ఇచ్చి మూడు రోలెక్స్ వాచీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే చెక్ నగదుగా మారే వరకూ వాచ్‌లను జ్యూవెలర్ తన వద్దే ఉంచుకున్నారు. చెక్ చెల్లకపోవడంతో జ్యూవెలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ చెక్‌లతో మోసగించిన కెల్లీని పోలీసులు అరెస్ట్ చేయగా తన ఇంట్లో కంప్యూటర్ నుంచి ఈ చెక్కులను ప్రింట్ చేశానని అంగీకరించాడు. కెల్లీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని వాల్టన్ కౌంటీ జైలుకు తరలించారు. చదవండి : పోర్షే కయన్ కూపే @ 1.32 కోట్లు -
కారు యజమానికి రూ. 9.8 లక్షల జరిమానా
అహ్మదాబాద్ : విలాసవంతమైన పోర్షే కారుతో వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్ లేని కారణంగా అతడి కారును ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఏకంగా రూ. 9.8 లక్షల మేర జరిమానా విధించారు. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాలు... అహ్మబాద్‌లోని హెల్మెల్ క్రాస్‌రోడ్ వద్ద బుధవారం సిల్వర్ కలర్ పోర్షే కారు(911 స్పోర్ట్స్ కారు)ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించడంతో పాటు సరైన పత్రాలు లేకపోవడంతో కారును కాసేపు అక్కడే నిలిపారు. అనంతరం కారుకు సంబంధించిన సమాచారాన్ని చెక్ చేయగా లక్షల్లో జరిమానాలు పేరుకు పోయినట్లు గుర్తించారు. అన్నీ కలిపి దాదాపు 10 లక్షల రూపాయల జరిమానా విధించి.. చలానా చెల్లించిన తర్వాతే కారును తిరిగి ఇస్తామని కారు యజమానికి చెప్పడంతో అతడు బిక్క ముఖం వేశాడు. కాగా ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులు ట్వీట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. ‘అమ్మో ఈ జరిమానాతో మరో కారును కొనుక్కోవచ్చు. బహుశా ఇదే అతిపెద్ద భారీ జరిమానా అనుకుంటా’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మోటారు వాహన సవరణ చట్టం వాహనదారులకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటన గురించి అహ్మదాబాద్ డీఎస్పీ మాట్లాడుతూ... మోటారు వాహన చట్టం ప్రకారం కారును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తికి ఆర్టీవో మెమో ఇచ్చామని పేర్కొన్నారు. బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాతే కారును అతడికి అప్పగిస్తామని తెలిపారు. ఇక జర్మనీకి చెందిన జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే. భారత్‌లోనూ తన మార్కెట్‌ను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో రెండు అధునాతన కార్లను భారత్‌లో ప్రవేశపెట్టింది. ‘911 కార్రెరా ఎస్’ పేరిట విడుదలైన విలాసవంతమైన స్పోర్ట్స్ కారు ధర రూ.1.82 కోట్లు కాగా.. ‘911 కార్రెరా ఎస్ కాబ్రియోలెట్’ పేరుతో విడుదలైన మరో కారు ధర రూ.1.99 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. వెనుక ఇంజిన్ కలిగిన ఈ మోడల్ కార్లు అధునాతనంగా రూపుదిద్దుకుని ఆటో మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. -
పోర్షే 911 కొత్త వెర్షన్
ప్రారంభ ధర రూ.1.42 కోట్లు హైదరాబాద్‌లో ఔట్లెట్! న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ‘పోర్షే’ తాజాగా ‘911 మోడల్’లోనే కొత్త వె ర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర శ్రేణి రూ.1.42 కోట్లు-రూ.2.66 కోట్లుగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. ‘911 మోడల్’ కరెరా క్యాబ్రియోలెట్, కరెరా ఎస్, టర్బో, టర్బో ఎస్ క్యాబ్రియోలెట్ అనే నాలుగు వేరి యంట్లలో లభ్యంకానున్నది. తాజా అప్డేటెడ్ వెర్షన్ 911 మోడల్‌కు చెందిన 8వ జనరేషన్ వెహికల్ అని కంపెనీ తెలిపింది. గత వెర్షన్లతో పోలిస్తే తాజా వెహికల్ 12% అధిక మైలేజీ అందిస్తుందని పేర్కొంది. భారత్‌లో కార్యకలాపాల విస్తరణ కోసం పోర్షే త్వరలో చెన్నై, హైదరాబాద్‌లో కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం కంపెనీకి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, కొచ్చి ప్రాంతాల్లో ఔట్లెట్స్ ఉన్నాయి.