
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అన్యదేశ్య కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు విదేశాల నుంచి తమకు ఇష్టమైన కార్లను దిగుమతి చేసుకుంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఏంజెల్ వన్ చైర్మన్ 'దినేష్ ఠక్కర్' తన గ్యారేజిలో అత్యంత ఖరీదైన లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల ఈయన సరికొత్త స్పోర్ట్స్ కారు పోర్స్చే 911 GT3 టూరింగ్ డెలివరీ తీసుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అత్యంత స్టైలిష్ సూపర్ కార్ బ్రాండ్ అయిన పోర్స్చే కంపెనీకి చెందిన '911 GT3 టూరింగ్' కారుని ఇటీవల కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. రూ. 2.75 కోట్ల ఎక్స్-షోరూమ్ వద్ద లభించే ఈ కారు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంది. ఈ స్పోర్ట్స్ కారు 4.0 లీటర్ ఫ్లాట్ 6 ఇంజన్‌తో 502 పీఎస్ పవర్ అండ్ 470 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పర్ఫామెన్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఇదీ చదవండి: కోట్ల సంపదను కాదని సన్యాసం పుచ్చుకున్న వజ్రాల వ్యాపారి ఫ్యామిలీ.. ఎందుకో తెలిస్తే..
పోర్స్చే 911 GT3 టూరింగ్ మాత్రమే కాకుండా ఈయన గ్యారేజిలో లంబోర్ఘిని ఉరుస్ (రూ. 4.17 కోట్లు), ఫెరారీ 488 పిస్తా, లంబోర్ఘిని హురాకాన్ పెర్ఫార్మంటే (రూ. 4 కోట్లు), మెర్సిడెస్ AMG జీటీ బ్లాక్ సిరీస్ (రూ. 5.5 కోట్లు), పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్, మెర్సిడెస్-AMG G63, మినీ కూపర్ ఉన్నాయి. అంతే కాకూండా భారతదేశపు మొట్టమొదటి పోర్షే టేకాన్ టర్బో S ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment