
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పోర్ట్స్ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ పోర్ష.. ఈ ఏడాది జనవరి–మార్చిలో భారత్‌లో 188 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 22 శాతం అధికం.
2013 తర్వాత ఒక త్రైమాసికంలో ఈ స్థాయి అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఎస్‌యూవీలైన కయెన్, మకాన్ విజయవంతంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయని కంపెనీ తెలిపింది.
పోర్ష నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లు కూడా ఇవేనని వివరించింది. 2021 జనవరి–మార్చిలో కంపెనీ 62 శాతం వృద్ధి సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment