ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సీఎన్‌జీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థలు, తమ కార్లను సీఎన్‌జీ విభాగంలో లాంచ్ చేశాయి. ఈ కథనంలో రూ.8 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న టాప్ 5 కార్ల గురించి తెలుసుకుందాం.
టాటా పంచ్
అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచిన టాటా పంచ్ ప్రస్తుతం మార్కెట్లో సీఎన్‌జీ విభాగంలో.. ఓ సరసమైన కారుగా లభిస్తోంది. ఇది ప్యూర్, అడ్వెంచర్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 7.22 లక్షలు, రూ. 7.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి ఫ్యూయెల్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులో సీఎన్‌జీ బ్యాడ్జెస్ చూడవచ్చు.
టాటా పంచ్ సీఎన్‌జీ కారులో 3.5 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఫోర్ స్పీకర్ ఆడియో సెటప్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం వంటి ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ సీఎన్‌జీ కారు 6000 rpm వద్ద 72.4 Bhp పవర్, 3250 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఇది పెట్రోల్ కారు కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ కారు ప్రారంభ ధర రూ. 7.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది పెట్రోల్ (రూ. 5.92) వేరియంట్ ప్రారంభ ధర కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఇది 68 బీహెచ్‌పీ పవర్, 95.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో 3.5 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి ఉన్నాయి.
టాటా ఆల్ట్రోజ్
టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ మొత్తం ఎనిమిది వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.2 లీటర్ ఇంజిన్ 6000 rpm వద్ద 72.4 Bhp, 3500 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారులో 4 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ పార్కింగ్ సెన్సార్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్స్ ఉన్నాయి.
హ్యుందాయ్ ఆరా
హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.7.48 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ రెండు కలర్ ఆప్షన్స్ పొందుతాయి. ఇందులోని ఇంజిన్ 68 Bhp, 95.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో 3.5 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టిల్ట్ స్టీరింగ్ వీల్, ముందు భాగంలో పవర్ విండోస్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, అడ్జస్టబుల్ రియర్ సీటు హెడ్‌రెస్ట్ వంటివి ఉన్నాయి.
మారుతి సుజుకి సెలెరియో
మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.6.73 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ 5300 rpm వద్ద 55.9 Bhp పవర్.. 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment