వాహనాల కొనుగోలు విషయంలో గానీ, వాహనాల తయారీ విషయంలో గానీ ఏదైనా సమస్య అనిపిస్తే, దానికి సంబంధిత సంస్థలు బాధ్యత వహించకపోతే మీరు కంజ్యూమర్ కోర్టుని సంప్రదించి నష్టపరిహారం పొందవచ్చు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి మరో ఇన్సిడెంట్ తెరపైకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) గురుగ్రామ్‌లోని పోర్షే అవుట్‌లెట్‌కు భారీ జరిమానా విధించింది. ఒక వినియోగదారుడు తనకు విక్రయించిన కారుని తయారు చేసిన సంవత్సరం తప్పుగా ఉందని పిర్యాదు చేసిన కారణంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
2013లో తయారు చేసిన పోర్షే కారు 2014లో తయారు చేసిన కారుగా విక్రయించారని, అంతే కాకుండా సర్వీసులో లోపం ఉన్నట్లు జస్టిస్ రామ్ సూరత్ రామ్ మౌర్య కోర్టుకు విన్నవించారు. వినియోగదారుడు ప్రవీణ్ కుమార్ మిట్టల్ పోర్షే ఇండియా, గురుగ్రామ్‌లోని పోర్స్చే సెంటర్‌కు వ్యతిరేకంగా ఫిటిషన్ వేయడంతో ఈ చర్చ జరిగింది.
(ఇదీ చదవండి: హ్యుందాయ్ 'ఎక్స్‌టర్' ఫస్ట్ లుక్ - చూసారా!)
తయారు చేసిన సంవత్సరం గురించి అబద్ధం చెబుతూ రూ. 80 లక్షలకు కేయాన్‌ను విక్రయించినట్లు కస్టమర్ ఆరోపించారు. అయితే అదే తరహాలో కొత్త కారు ఇవ్వాలని, తాను ఖర్చు చేసిన ఇతర ఖర్చులతో పాటు పూర్తి కారు ధరలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.
(ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..)
ఫిర్యాదుదారుని దుర్మార్గపు ఉద్దేశ్యాలతో ఆరోపించే ఆరోపణలను పోర్స్చే తిరస్కరించింది. తయారీ సంవత్సరం గురించి అతనికి బాగా తెలుసు. కాబట్టే దానికి తగిన తగ్గింపు కూడా పొందినట్లు పేర్కొంది. ఇరువర్గాలు తమ పత్రాలను కోర్టులో సమర్పించారు. మిట్టల్ సమర్పణలు సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద పబ్లిక్ అథారిటీ ద్వారా సేకరించడం వల్ల వాటి ప్రామాణికతను కోర్టు సమర్థించింది.
చివరకు రూ. 18 లక్షలకు పైగా ఉన్న వడ్డీతో కలిపి అతనికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని పోర్షేను ఆదేశించింది. అలాగే ఫిర్యాదుదారుడికి లిటిగేషన్ ఖర్చుగా రూ. 25,000 చెల్లించాలని ఆదేశించింది. కల్పిత పత్రాల విషయమై అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు ఆ ప్రాంత పరిధిలోని పోలీసులచే విచారణ జరిపించాలని కూడా కమిషన్ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment