![Krisumi Group to Invest Rs 2000 Crore To Build 1051 Apartments](/styles/webp/s3/article_images/2024/06/24/luxury-apartment.jpg.webp?itok=wpCh5U1P)
రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రముఖ రియల్టీ సంస్థ 'క్రిసుమి కార్పొరేషన్' తన విస్తరణ ప్రణాళికలో భాగంగా గురుగ్రామ్‌లో 1,051 లగ్జరీ అపార్ట్‌మెంట్లను నిర్మించడానికి రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
క్రిసుమి కార్పొరేషన్ అనేది కృష్ణా గ్రూప్ అండ్ జపాన్‌కు చెందిన సుమిటోమో కార్పొరేషన్ మధ్య జాయింట్ వెంచర్. ఇది ఇప్పటికే సెక్టార్ 36A, గురుగ్రామ్‌లో పెద్ద లగ్జరీ టౌన్‌షిప్ 'క్రిసుమి సిటీ'ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో మొదటి దశ 433 యూనిట్లతో కూడిన 'వాటర్‌ఫాల్ రెసిడెన్సెస్' పూర్తికాగా, రెండవ దశ 320 యూనిట్లతో కూడిన 'వాటర్‌ఫాల్ సూట్‌లు' 2028లో డెలివరీ చేయడానికి షెడ్యూల్ చేసింది.
ఇవి కాకుండా.. మరో 1,051 లగ్జరీ యూనిట్లతో కూడిన తమ టౌన్‌షిప్‌లో ఫేజ్ 3, ఫేజ్ 4లో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సోమవారం క్రిసుమి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 2.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతుంది. అదనంగా.. 350 కోట్ల రూపాయల పెట్టుబడితో టౌన్‌షిప్‌లో సుమారు 1,60,000 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో 2 ఎకరాలలో అత్యాధునిక క్లబ్‌ను సంస్థ అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించిన నిర్మాణ కార్యకలాపాలు గత నెలలో ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment