Rahman Lauds Daughters Girl Power for Buying Porsche Taycan Sports Car - Sakshi
Sakshi News home page

లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్‌ పవర్‌ అంటూ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మురిపెం

Published Fri, Dec 2 2022 5:45 PM | Last Updated on Fri, Dec 2 2022 6:20 PM

Rahman lauds daughters Girl Power for buying Porsche Taycan sports car - Sakshi

సాక్షి, ముంబై:  ప్రముఖ  మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఆస్కార్‌ విన్నర్‌  ఏఆర్‌ రెహమాన్‌  కుమార్తెలు రతీజా రెహమాన్, రహీమా రెహమాన్ ఫాస్టెస్ట్‌, లగ్జరీ కారును  కొనుగోలు చేశారు. పోర్షే టైకాన్ కారు కొన్న విషయాన్ని స్వయంగా రెహమాన్‌ ట్విటర్‌లో వెల్లడించారు. యువ నిర్మాతలు, కూల్ మెటావర్స్ ప్రాజెక్ట్‌ లీడర్స్‌ రతీజా, రహీమా (ఏఆర్‌ఆర్‌ స్టూడియోస్‌) కారు కొన్నందుకు ముఖ్యంగా కాలుష్య రహిత కార్‌ను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో  సంతోషం ప్రకటించారు. అంతేకాదు ‘గర్ల్‌ పవర్‌’ అంటూ  గర్వాన్ని ప్రకటించారు. “ARR స్టూడియోస్”  పేరుతో  ఉన్న ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును, పక్కనే ఖతీజా , రహీమా నిలబడి ఉన్న బ్యూటిఫుల్‌ పిక్‌ను షేర్‌  చేశారు.

జర్మన్ స్పోర్ట్స్ కార్‌కు చెందిన, జెంటియన్ బ్లూ మెటాలిక్‌ కలర్‌లో మెరిసిపోతున్న పోర్షే టైకాన్ ధర  రూ. 1.53 కోట్ల నుంచి రూ. 2.34 కోట్లు. ఉంటుంది. జర్మన్ స్పోర్ట్స్ కార్ తయారీదారు Taycan EV టాప్-స్పీడ్‌ను 260Kmphకి పరిమితం చేసింది.ఈ కారు కేవలం 2.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో పోర్షే టైకాన్ ఒకటి.  ఈ ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కారుకు భారతదేశంలో డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు దీనిపై మనసు పారేసుకుంటున్నారు.    2021లో  భారతదేశంలో పోర్షే టైకాన్‌ను లాంచ్‌ చేసింది.  Taycan RWD, Taycan 4S, Taycan Turbo మరియు Taycan Turbo Sin  ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement