Khatija
-
ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు
సెలబ్రిటీల పిల్లలని చూస్తే.. వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ అని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా కష్టాలు ఉంటాయి. కాకపోతే అవి విచిత్రమైన కష్టాలు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూతురు కూడా తన గురించి, తండ్రి గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు బయటపెట్టింది. 'మిన్ మినీ' అనే తమిళ సినిమాతో రీసెంట్గా సంగీత దర్శకురాలిగా పరిచయమైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకుంది.ఏఆర్ రెహమన్ కూతురు కావడంతోనే మీతో మాట్లాడుతున్నారా? లేదంటే నిజంగానే మీతో స్నేహం చేస్తున్నారా అనే ప్రశ్నకు బదులిచ్చిన ఖతీజా రెహమాన్.. చిన్నప్పటి నుంచి చాలామంది తనతో మాట్లాడేవారని, కొందరు మాత్రం ఏఆర్.రెహమన్ కూతురిననే పరిచయం పెంచుకునేవారని, ఆ తర్వాత వారి అవసరాల గురించి చెప్పేవారని, అదే తనకు చాలా కష్టంగా ఉండేదని చెప్పింది.(ఇదీ చదవండి: తప్పు చేశా నాన్న.. ఏడ్చేసిన ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్)ఇక రెహమాన్ ఫ్యామిలీ విషయానికొస్తే.. ఏఆర్ రెహమాన్ తండ్రి సంగీత కళాకారుడు. ఆయన స్ఫూర్తితోనే రెహమాన్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదట్లో పియానిస్ట్‌గా పనిచేశాడు. 'రోజా' మూవీతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆస్కార్ కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకపోతే రెహమాన్ సోదరి రెహానా కూడా సంగీత దర్శకురాలే. రెహమాన్ కొడుకు ఏఆర్ అమీన్, సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కూతురు ఖతీజా సంగీత దర్శకురాలి అయిపోయింది. మిన్మినీ చిత్రానికి ఖతీజా సంగీతమందించింది. తాజాగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా, ఈమె పనితనాన్ని బాగానే మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి) -
లతా మంగేష్కర్‌కు ఆ విధంగా నివాళి అర్పించిన రెహమాన్ కుమార్తె
వారంతా స్త్రీలే. 26 దేశాల మహిళలు కలిసి దుబయ్‌లో ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’గా ఏర్పడ్డారు. తమ ప్రదర్శనలతో అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా లతా మంగేష్కర్‌కు నివాళిగా ఆమె పాడిన ఐదు పాటలను ‘కుహు కుహు’ పేరుతో ఆల్బమ్‌గా విడుదల చేశారు. ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతిజా రెహమాన్ ఈ ఐదు పాటలు పాడింది. ‘లతా ఒక శక్తి. మేమందరం ఈ ఆల్బమ్ ద్వారా స్త్రీ శక్తిని చాటాం’ అని తెలిపింది ఖతిజా.శ్రోతలకు ఇదో శ్రావ్యమైన కానుక. ‘ఆర్కెస్ట్రా అనగానే రికార్డింగ్ స్టుడియోలో, స్టేజ్ మీద మగవారు నిండిపోయి ఉంటారు. కండక్టర్‌గా ఎప్పుడూ సూట్ వేసుకున్న మగవాడే కనిపిస్తాడు. ఈ స్టీరియోటైప్ మారాలి. ప్రపంచంలో ఉత్తమమైన మ్యుజీషియన్స్‌గా స్త్రీలు ఉన్నారు. వారంతా తమ ప్రతిభను చూపాలి. మేమంతా అందుకే ఒక వేదిక మీదకు వచ్చి పెర్ఫామ్ చేస్తున్నాం’ అంటారు దుబయ్‌లోని ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’ సభ్యులు. 26 దేశాల నుంచి 51 మంది మహిళా సంగీతకారులు ఇక్కడ తమ సంగీతాన్ని వినిపిస్తున్నారు. ప్రోగ్రామ్‌లు ఇస్తున్నారు. వీరికి ఇక్కడ రికార్డింగ్ స్టుడియో ఉంది. ఇందులో సినిమాలకూ పని చేస్తున్నారు. ఎమిరేట్స్ మహిళా మంత్రి రీమ్ అల్ హష్మి ఏ.ఆర్.రెహమాన్‌ను మహిళలను ప్రోత్సహించే ఆర్కెస్ట్రాను దుబాయ్‌లో ఏర్పాటు చేయమని కోరారు. రెహమాన్ ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయడంలో సాయపడి పర్యవేక్షిస్తున్నారు. వారితో రికార్డింగ్స్ కూడా చేస్తున్నారు. పొన్నియన్ సెల్వమ్ 2’ రీ రికార్డింగ్ ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలే చేశారు. అరెబిక్ సౌందర్యం ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలో వివిధ దేశాల మహిళా సంగీతకారులు పని చేస్తున్నా ఈ ఆర్కెస్ట్రా ముఖ్య ఉద్దేశం అరబిక్ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేసి కొత్త అందాన్ని తీసుకురావడమే. ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా లో తమతమ దేశాలకు చెందిన నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు అరేబియాలో ఉపయోగించే సంగీత పరికరాలు కూడా వాడి గొప్ప మిళిత సంగీతాన్ని సృష్టిస్తున్నారు. ‘మేమంతా వేరువేరు జీవితాలు, వేరు వేరు సంగీత ధోరణుల నుంచి వచ్చాం. కాని రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టి ఒక్కటిగా మారి సమష్టిగా సంగీతాన్ని సృష్టిస్తాం. ఈ అనుభూతి అద్భుతంగా ఉంటుంది’ అంటారు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా సభ్యులు. వీరికి కండెక్టర్‌గా మోనికా ఉమ్మెన్ అనే మహిళ పని చేస్తోంది. లతాకు నివాళి తండ్రి పర్యవేక్షణలో సాగుతున్న ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చింది ఖతిజా రెహమాన్. ‘నేను వారితో పని చేసినప్పుడు వారు చూపిన ప్రేమ చాలా నచ్చింది’ అంటుందామె. గాయని అయిన ఖతిజా ఇటీవల తమిళ సినిమాలకు సంగీతం కూడా అందిస్తోంది. లతా మంగేష్కర్‌కు నివాళిగా ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి ‘కుహు కుహు’ ఆల్బమ్ తయారు చేసింది. ‘మేమందరం లతా పాటలను పునఃసృష్టించాలనుకున్నాం’ అంది ఖతీజా. లతా పాడిన ఐదు పాటలను ఎంపిక చేసుకుని ఖతీజా ఈ ఆల్బమ్‌లో పాడింది. అవి 1. పియా తోసే నైనా లాగేరే (గైడ్), 2.ఆప్ కీ నజరోనే సంఝా (అన్పడ్), 3. ఓ సజ్నా బర్ఖా బహార్ ఆయీ (పరఖ్), 4. కుహు కుహు బోలే కోయలియా (సువర్ణ సుందరి), 5. బేకస్ పె కరమ్ కీజియే (మొఘల్ ఏ ఆజమ్). ఈ ఐదు పాటలకు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలు సంగీతం అందించారు. బాణీలు యధాతథంగా ఉన్నా ఆర్కెస్ట్రయిజేషన్లో తమ సృజనను ప్రదర్శించారు. సాధారణంగా పాత పాటలు కొత్త తరహాగా పాడితే నచ్చవు. కాని ఖతీజా గళం, ఫిర్దౌస్ సంగీతం శ్రోతలకు శ్రావ్యమైన అనుభూతిని ఇచ్చాయి. గొప్ప గాయని లతా మంగేష్కర్‌కు ఇది ఒక మంచి నివాళిగా నిలిచిపోతుంది. -
అమృత హస్తాలు
33 ఏళ్ల సర్వీసు. 10 వేల డెలివరీలు. విలుప్పురం ప్రభుత్వాస్పత్రి నుంచి గత నెలలో రిటైర్ అయిన నర్సు ఖతీజాబీని తమిళనాడు ప్రభుత్వం సత్కరించి మరీ వీడ్కోలు పలికింది.కారణం ఆమె మొత్తం సర్వీసులో ఒక్క శిశువు కూడా కాన్పు సమయంలో మృతి చెందలేదు. ప్రాణం పోసే పని ఎంతటి బాధ్యతాయుతమైనదో ఖతీజాను చూసి తెలుసుకోవాలంటారు సాటి నర్సులు. ఇలాంటి నర్సులే ప్రతిచోటా కావాలి. ‘ఆ రోజుల్లో ప్రయివేటు ఆస్పత్రులు చాలా తక్కువ. ఎంతటి వాళ్లయినా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి రావాల్సిందే. క్షణం తీరిక ఉండేది కాదు’ అని గుర్తు చేసుకుంది 60 ఏళ్ల ఖతీజాబీ. ఆమె గత నెలలోనే విల్లుపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పదవీ విరమణ పొందింది. తమిళనాడు ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణియన్ ప్రత్యేక పురస్కారం అందించి మరీ ఆమెను సత్కరించాడు. ‘అందుకు కారణం నా మొత్తం సర్వీసులో ఒక్క పసికందు కూడా కాన్పు సమయంలో ప్రాణం పోగొట్టుకోకపోవడమే’ అంటుందామె సంతృప్తిగా. ► తల్లి కూడా నర్సే ఖతీజాబీ ఏదో వేరే పని దొరక్క నర్సు కాలేదు. ఆ వృత్తి పట్ల ప్రేమతోనే అయ్యింది. ‘మా అమ్మ జులేఖా కూడా నర్సుగా పని చేసేది. కాని ఆమె కాలంలో కాన్పు సమయాలు చాలా ఘోరంగా ఉండేవి. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడతారనేది చెప్పలేము. నేను ఆమెను చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు సిరంజీలతో ఆడుకున్నాను. అమ్మ వెంట హాస్పిటల్‌కు వెళుతూ హాస్పిటల్ వాసనకు అలవాటు పడ్డాను. 1990లో నేను కూడా నర్సుగా ఉద్యోగం ప్రారంభించాను. అయితే అప్పటికే నాకు పెళ్లయ్యి ఏడు నెలల గర్భిణిగా ఉన్నాను. అలా ఉంటూనే కాన్పులు చేయడం ప్రారంభించాను. నా కాన్పు అయ్యాక కేవలం రెండు నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ డ్యూటీకి హాజరయ్యాను’ అంది ఖతీజా. ► స్త్రీల వేదన 1990లలో మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో 556 మంది శిశువులు మరణించేవారు. నవజాత శిశువుల్లో ప్రతి 1000 మందికి 88 మంది మరణించేవారు. ‘సిజేరియన్ ఆపరేషన్లు చాలామటుకు స్త్రీలను, శిశువులను కాపాడాయి. నేను పని చేసే ఆస్పత్రిలో కేవలం ఒక డాక్టరు, ఇద్దరు నర్సులు ఉండేవాళ్లం. సిజేరియన్ చేసే సామాగ్రి మా దగ్గర ఉండేది కాదు. అందుకే కాన్పు కాంప్లికేట్ అవుతుందని డౌట్ రాగానే జిల్లా (కడలూర్) ఆస్పత్రికి పంపేసేదాన్ని. ఆ తర్వాత కూడా సిజేరియన్‌కు స్త్రీలు భయపడితే ధైర్యం చెప్పేదాన్ని. కానీ ఇవాళ మామూలు నొప్పులు వద్దని స్త్రీలు సిజేరియనే కోరుకుంటున్నారు’ అని తెలిపింది ఖతీజా. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు పెంచడం, స్త్రీల అక్షరాస్యత కోసం శ్రద్ధ పెట్టడం తదితర కారణాల వల్ల ప్రసూతి మరణాలు తగ్గుముఖం పట్టాయని ఖతీజా అంటోంది. ‘ఇవాళ మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో కేవలం 88 మంది పిల్లలే మరణిస్తున్నారు. నవజాత శిశువుల్లో వెయ్యికి 27 మంది మరణిస్తున్నారు’ అందామె. ► ఎంతో సంతృప్తి ‘2008 మార్చి 8 నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు డ్యూటీకి రావడంతోటే ఇద్దరు స్త్రీలు నొప్పులతో ఉన్నారు. వారి కాన్పుకు సాయం చేశాను. రోజులో ఇద్దరు సాధారణమే. కాని ఆ తర్వాత ఆరు మంది వచ్చారు. వారంతా కూడా ఆ రోజే కాన్పు జరిగి పిల్లల్ని కన్నారు. బాగా అలసటగా అనిపించింది. కాని సాయంత్రం డ్యూటీ దిగి వెళుతుంటే ఎనిమిది మంది చంటి పిల్లలు తల్లుల పక్కన పడుకుని కేరుకేరు మంటుంటే ఏడుస్తుంటే చాలా సంతోషం కలిగింది. కాన్పు సమయంలో స్త్రీలు ఎంతో ఆందోళనగా ఉంటారు. వారికి ముందుగా ధైర్యం చెప్పడంపై నేను దృష్టి పెట్టేదాన్ని. బిడ్డను కనే సమయంలో వారు ఎంత బాధ అనుభవించినా బిడ్డ పుట్టి కేర్మన్నాక తప్పనిసరిగా నవ్వు ముఖంతో బిడ్డవైపు చూసేవారు. వారి ఆ నవ్వు నాకు ఎంతో సంతృప్తినిచ్చేది. రిటైరయ్యానన్న మాటేగాని నా మనసు మాత్రం అలాంటి తల్లుల సేవలోనే ఉండమని చెబుతోంది’ అని ముగించింది ఖతీజా. మారిన దృష్టి ‘నేను కాన్పులు చేసిన కొత్తల్లో రెండో సంతానంగా, మూడో సంతానంగా కూడా ఆడపిల్లే పుడితే ఆ తల్లులు అంతులేనంతగా ఏడ్చేవారు. అసలు తండ్రులు చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. ఇవాళ ఆ ధోరణిలో మార్పు వచ్చింది. అమ్మాయిలు పుట్టినా అబ్బాయిలు పుట్టినా కేవలం ఇద్దరు చాలని ఎక్కువమంది అనుకుంటున్నారు. నా మొత్తం సర్వీసులో 50 మంది కవలలకు పురుడు పోశాను. ఒక కాన్పులో ట్రిప్లెట్ పుట్టారు’ అందామె. -
లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్
సాక్షి, ముంబై: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కుమార్తెలు రతీజా రెహమాన్, రహీమా రెహమాన్ ఫాస్టెస్ట్, లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పోర్షే టైకాన్ కారు కొన్న విషయాన్ని స్వయంగా రెహమాన్ ట్విటర్లో వెల్లడించారు. యువ నిర్మాతలు, కూల్ మెటావర్స్ ప్రాజెక్ట్ లీడర్స్ రతీజా, రహీమా (ఏఆర్ఆర్ స్టూడియోస్) కారు కొన్నందుకు ముఖ్యంగా కాలుష్య రహిత కార్‌ను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో సంతోషం ప్రకటించారు. అంతేకాదు ‘గర్ల్ పవర్’ అంటూ గర్వాన్ని ప్రకటించారు. “ARR స్టూడియోస్” పేరుతో ఉన్న ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును, పక్కనే ఖతీజా , రహీమా నిలబడి ఉన్న బ్యూటిఫుల్ పిక్‌ను షేర్ చేశారు. జర్మన్ స్పోర్ట్స్ కార్కు చెందిన, జెంటియన్ బ్లూ మెటాలిక్ కలర్లో మెరిసిపోతున్న పోర్షే టైకాన్ ధర రూ. 1.53 కోట్ల నుంచి రూ. 2.34 కోట్లు. ఉంటుంది. జర్మన్ స్పోర్ట్స్ కార్ తయారీదారు Taycan EV టాప్-స్పీడ్‌ను 260Kmphకి పరిమితం చేసింది.ఈ కారు కేవలం 2.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో పోర్షే టైకాన్ ఒకటి. ఈ ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కారుకు భారతదేశంలో డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు దీనిపై మనసు పారేసుకుంటున్నారు. 2021లో భారతదేశంలో పోర్షే టైకాన్‌ను లాంచ్ చేసింది. Taycan RWD, Taycan 4S, Taycan Turbo మరియు Taycan Turbo Sin ఉన్నాయి. Our young producers of #ARRstudios spearheading cool #Metaverse projects @RahmanKhatija #RaheemaRahman. Have chosen to go green with the #electriccar. Be the change you want to see. #bosswomen #girlpower #gogreen pic.twitter.com/i8TFUZULF9 — A.R.Rahman (@arrahman) November 23, 2022 -
పెళ్లి చేసుకున్న ఏఆర్ రెహమాన్ కూతురు, ఫోటోలు వైరల్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పెద్ద కూతురు ఖతీజా రెహజాన్ వివాహం వైభవంగా జరిగింది. రియాస్దీన్ షేక్ మహమ్మద్ అనే సౌండ్ ఇంజనీర్‌తో మే5న ఆమె పెళ్లి జరిగింది. రియాస్దీన్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, ఖతీజా ప్రింటెడ్ ఆఫ్-వైట్ దుస్తుల్లో ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఫోటోను స్వయంగా ఖతీజా షేర్ చేస్తూ.. మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరిగింది. ఈరోజు కోసం ఎంతో ఎదురుచూశాను అంటూ పోస్ట్ చేసింది. రెహమాన్ కూడా నూతన జంటను దీవించాలంటూ ఫోటోను షేర్ చేశారు. దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. View this post on Instagram A post shared by ARR (@arrahman) -
ఏఆర్ రెహమాన్ కుమార్తె ఎంగేజ్మెంట్.. వరుడెవరంటే ?
AR Rahman Daughter Khatija Engaged With Riyasdeen: ఏఆర్ రెహమాన్ అంటే తెలియని వారెవరూ ఉండరు. అత్యంత అరుదైన ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. ఎన్నో చిత్రాలకు సంగీతం అందించిన ఆయన సంగీత ప్రేమికుల్ని అలరిస్తున్నారు. అయితే ఇటీవల ఏఆర్ రెహమాన్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌కు ఎంగేజ్మెంట్ జరిగింది. రియా సిద్దీన్ షేక్ మహమ్మద్ అనే వ్యక్తితో డిసెంబర్ 29న నిశ్చితార్థం చైన్నైలో జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఖతీజా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇన్ స్టాలో ఖతీజా పోస్ట్ చేసిన ఎంగేజ్మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె పెళ్లి చేసుకునే వ్యక్తి ఇంజినీర్, ఎంటర్ ప్రెన్యూర్ అని తెలుస్తోంది. అయితే వివాహం ముహుర్తం ఇంకా నిర్ణయించలేదని సమాచారం. కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. ఏఆర్ రెహమాన్‌కు ఖతీజా, రహీమా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. View this post on Instagram A post shared by 786 Khatija Rahman (@khatija.rahman) -
తస్లీమాకు ఏఆర్ రెహమాన్ కుమార్తె ధీటైన రిప్లై
నిజమైన స్త్రీవాదం అంటే ఏంటో గూగుల్‌లో వెతికి చూడాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్‌కు.. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా హితవు పలికారు. కాగా తస్లీమా.. రెహమాన్ కుమార్తె ఖతీజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఖతీజా బుర్జా ధరించిన ఫోటోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘నాకు ఏఆర్ రెహమాన్ పాటలంటే చాలా ఇష్టం. కానీ ఖతీజాను ఎప్పుడూ చూసిన నాకు ఊపిరాడని అనుభూతి కలుగుతుంది. తండ్రి ఏఆర్ రెహమాన్ చెప్పినందుకే ఆమె ముఖాన్ని కవర్ చేసుకుంటారేమో’ అంటూ ఆరోపించారు. ఇక ఇలాంటి విమర్శలు రావడం ఖతీజాకు మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఆమె వస్త్రధారణపై అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇష్టమైన దుస్తులు ధరించే స్వేచ్ఛ తనకు ఉందని విమర్శకుల నోళ్లను మూయించేలా ఖతీజా కౌంటర్ ఇచ్చారు. ఇక తస్లీమా ట్వీట్‌పై ఖతీజా తనదైన స్టైల్లో స్పందించారు. తస్లీమా వ్యాఖ్యలకు బదులిస్తూ.. ఓ కొటేషన్‌తో మండుతున్న అగ్ని ఫోటోను పంచుకున్నారు. ‘నేను మౌనంగా ఉన్నంత మాత్రాన తప్పుగా అంచనా వేయకండి. మాట్లాడకుండా ఉన్నానంటే అది నా మంచితనం. నా ప్రియమైన స్నేహితులారా. .ఎవరికైతే నా వస్త్రధారణ వల్ల ఊపిరాడటం లేదో వారు దయచేసి వెళ్లి స్వచ్చమైన గాలిని స్వీకరించండి. ఎందుకంటే నేను బుర్ఖా ధరించడం వల్ల ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లేదు. వాస్తవానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. నిజమైన స్త్రీ వాదం అంటే ఏంటో గూగుల్‌లో వెతకండి. నిజమైన ఫెమినిజం ఇతర మహిళలను ఎప్పుడూ కించపరచదు అలాగే వారి తండ్రుల్ని సమస్యలోకి లాగదు. అసలు నేను నా ఫోటోలను మీ పరిశీలన కోసం,మెప్పు కోసం మీకు పంపించినట్టు నాకైతే గుర్తు లేదు.' అంటూ సమాధానమిచ్చారు. అలాగే మరో పోస్ట్‌ను షేర్చేస్తూ.. ఈ విషయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎవరూ కూడా తస్లీమాపై వ్యతిరేకంగా మాట్లాడొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు. View this post on Instagram Been only a year and this topic is in the rounds again..there’s so much happening in the country and all people are concerned about is the piece of attire a woman wants to wear. Wow, I’m quite startled. Every time this topic comes the fire in me rages and makes me want to say a lot of things..Over the last one year, I’ve found a different version of myself which I haven’t seen in so many years. I will not be weak or regret the choices I’ve made in life. I am happy and proud of what I do and thanks to those who have accepted me the way I am. My work will speak, God willing.. I don’t wish to say any further. To those of you who feel why I’m even bringing this up and explaining myself, sadly it so happens and one has to speak for oneself, that’s why I’m doing it. 🙂. Dear Taslima Nasreen, I’m sorry you feel suffocated by my attire. Please get some fresh air, cause I don’t feel suffocated rather I’m proud and empowered for what I stand for. I suggest you google up what true feminism means because it isn’t bashing other women down nor bringing their fathers into the issue 🙂 I also don’t recall sending my photos to you for your perusal 🙂 A post shared by 786 Khatija Rahman (@khatija.rahman) on Feb 14, 2020 at 11:45am PST -
ఫోటోతో సమాధానం చెప్పిన రెహమాన్
బుర్ఖా వివాదం అనంతరం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 24 గంటల్లోపే ఈ ఫోటోను దాదాపు 2 లక్షల మంది లైక్ చేశారు. ‘హలో ఇండియా మ్యాగజైన్’ ఫోటో షూట్ సందర్భంగా తీసిన ఈ ఫోటోలో రెహమాన్ పిల్లలు ఖతీజా, రహిమా, అమీన్ ముగ్గురు ఉన్నారు. అయితే ఈ ఫోటోలో కూడా ఖతీజా బుర్ఖా ధరించే ఉన్నారు. అమీన్, రహీమ మాత్రం మోడ్రన్ దుస్తులు ధరించి ఫోటో షూట్లో పాల్గొన్నారు. రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఒక్క ఫోటోతో విమర్శించే వాళ్ల నోళ్లు మూయించారంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram Raheema ,Khatija and Ameen posing for Hello magazine 😊 A post shared by @ arrahman on Feb 8, 2019 at 4:54am PST రెహమాన్ ఆస్కార్ అవార్డు సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఖతీజా బుర్ఖాలో రావడంతో కొంతమంది విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. రెహమాన్ సంకుచిత స్వభావం కలవాడని, బుర్ఖా ధరించాలని కూతురిపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. వీటిపై స్పందించిన ఖతీజా.. వ్యక్తిగత స్వేచ్ఛను తన తల్లిదండ్రులు గౌరవిస్తారని తెలిపారు. బుర్ఖా ధరించడాన్ని తాను గౌరవంగా భావిస్తానని ఖతీజా వెల్లడించారు. -
తెలియకుండా మాట్లాడొద్దు
ముంబై: తన తండ్రిని విమర్శించిన వారికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా దీటుగా సమాధానం ఇచ్చారు. రెహమాన్ ఆస్కార్ అవార్డు సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో ఇటీవల ఓ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో రెహమాన్, ఖతీజాల భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అదేసమయంలో విమర్శలు కూడా వచ్చాయి. ఖతీజా బుర్ఖాలో రావడంతో కొంతమంది విమర్శనాస్త్రాలు సంధించారు. రెహమాన్ సంకుచిత స్వభావం కలవాడని, బుర్ఖా ధరించాలని కూతురిపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. దీనిపై ఖతీజా ఫేక్బుక్లో స్పందించింది. ‘నా జీవితం పట్ల నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను. నాకు నచ్చిన దుస్తులు ధరిస్తాను. వాస్తవ పరిస్థితులు తెలియకుండా దయచేసి సొంత తీర్పులు ఇవ్వకండి. ఇటీవల జరిగిన వేడుకలో వేదికపై మా నాన్నతో జరిపిన నేను జరిపిన సంభాషణపై మంచి స్పందన వచ్చింది. అలాగే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. నా తండ్రి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కొంతమంది విమర్శించారు. ఇలాంటి వారికి నేను చెప్పేది ఒక్కటే. వ్యక్తిగత స్వేచ్ఛను నా తల్లిదండ్రులు గౌరవిస్తారు. బుర్ఖా వేసుకోవడం నాకు ఇష్టం. బుర్ఖా ధరించడాన్ని గౌరవంగా భావిస్తాన’ని ఖతీజా వెల్లడించింది. విమర్శకుల నోళ్లు మూయించేందుకు రెహమాన్ కూడా తన ట్విటర్లో ఓ ఫొటో షేర్ చేశారు. నీతా అంబానీతో తన భార్య సైరా, కుమార్తెలు ఖతీజా, రహీమ దిగిన ఫొటోను ‘ఫ్రీడం టూ చూజ్’ పేరుతో ట్విటర్లో పెట్టారు. ఖతీజా మినహా సైరా, రహీమ బుర్ఖాలు లేకుండానే ఉన్నారు. తన ఇష్టప్రకారమే ఖతీజా బుర్ఖా ధరించిందని ఈ ఫొటో ద్వారా స్పష్టం చేశారు. (మనస్సాక్షే దారి చూపుతుంది!) The precious ladies of my family Khatija ,Raheema and Sairaa with NitaAmbaniji #freedomtochoose pic.twitter.com/H2DZePYOtA — A.R.Rahman (@arrahman) February 6, 2019 -
మనస్సాక్షే దారి చూపుతుంది!
ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన పాటలు నిత్యం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాయి. రెహమాన్‌ను గుర్తు చేస్తూనే ఉంటాయి. పదేళ్ల క్రితం ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికిగాను రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు రెహమాన్. 81వ ఆస్కార్ వేడుకలో పది అవార్డ్స్‌కు నామినేట్ అయిన ఈ చిత్రం ఎనిమిది అవార్డులను గెలుచుకుంది. అందులో రెహమాన్‌కు రెండు వచ్చాయి. ఈ చిత్రం ఆస్కార్ సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో ఓ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్, ఆయన కుమార్తె ఖతీజాల ఎమోషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. ‘‘ఎన్నో పెద్ద పెద్ద అవార్డులను సాధించిన ప్రముఖ సంగీత దర్శకునిగా మా నాన్నగారు ప్రపంచానికి తెలుసు. మా నాన్న రెండు ఆస్కార్ అవార్డులు సాధించి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో ఆయనలో ఏ మార్పు రాలేదు. అయితే కుటుంబానికి కేటాయించే సమయం తగ్గింది. అయినప్పటికీ మధ్య మధ్య మమ్మల్ని విహారయాత్రలకు తీసుకెళుతూ ఆ లోటు కూడా తెలియకుండా చేస్తున్నారు. మా నాన్నగారు గొప్ప మానవతావాది. ఎందరికో సహాయం చేస్తుంటారు. కానీ వాటిని మాతో కూడా పంచుకోరు’’ అని ఖతీజా అన్నారు. ఆ తర్వాత ‘మాతో పాటు ఇప్పటి యువతీ యువకులు పాటించేలా ఏవైనా సలహాలు ఇస్తారా?’ అని తండ్రిని ఖతీజా అడిగితే ‘‘నిజానికి నాకు సలహాలు ఇవ్వడం నచ్చదు. నేను పెరుగుతున్నప్పుడు మా అమ్మ చెప్పిన విలువలనే మీకు (తన బిడ్డలను ఉద్దేశించి) చెబుతూ వచ్చాను. ఇప్పుడు మీరు మీ హార్ట్‌ని ఫాలో అయ్యే టైమ్ వచ్చింది. జీవితంలో నీ మనస్సాక్షి మీకు మంచి మార్గనిర్దేశకం అవుతుంది. ఆ భగవంతుడు కూడా మీకు దారి చూపించాలని కోరుకుంటున్నాను’’ అని భావోద్వేగంగా బదులిచ్చారు ఏఆర్ రెహమాన్. ఈ వేడుకలో నటుడు అనిల్ కపూర్, రచయిత గుల్జార్ తదితరులు పాల్గొన్నారు. ‘‘పదేళ్ల క్రితమే రెహమాన్ ఆస్కార్ సాధించడం చాలా ఆనందంగా ఉంది’’ అని ఏ పాటకైతే రెహమాన్ అవార్డు సాధించారో ఆ పాటను రచించిన గుల్జార్ అన్నారు. -
ఖతీజా-ముహమ్మద్ల పరిణయం
ఖతీజా కేవలం అందం, సిరిసంపదలు కలిగిన స్త్రీ మాత్రమే కాదు. ఎంతో వివేకం, విజ్ఞత, తెలివితేటలు, దూరదృష్టి గల మహిళామణి కూడా! అందుకే ఆమె సచ్ఛీలత, సత్యసంధత, నీతి, నిజాయితీల ప్రతిరూపమైన ముహమ్మద్ (స) గారిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు. నఫీసా వెళ్లి అబూతాలిబ్తో మాట్లాడింది. ముహమ్మద్ (స) ఆ విషయాన్ని ధృవీకరించారు. అబూతాలిబ్ తన చెవుల్ని తానే నమ్మలేకపోయారు. ‘అవును, నా ముహమ్మద్‌కు ఏం తక్కువ? ఇంతటి సత్యసంధుడు, సచ్ఛీలుడు, నిజాయితీపరుడు అరేబియా అంతా కాగడా పట్టి వెతికినా కనపడడు’ అనుకున్నారు అబూతాలిబ్. వెంటనే సోదరులను వెంటబెట్టుకుని ఖతీజా బాబాయి అమ్రూబిన్ అసద్, సోదరుడు అమ్రూబిన్ ఖువైలిద్లను కలుసుకుని, సంబంధం గురించి మాట్లాడారు. అసద్, ఖువైలిద్లిద్దరూ పరమ సంతోషంగా వెంటనే ఒప్పేసుకున్నారు. ఖతీజాతో చర్చించి వివాహ తేదీని నిశ్చయించుకున్నారు. చూస్తూ చూస్తూనే ఆ రోజు కూడా రానే వచ్చింది. ఇరుకుటుంబాల పెద్దలు, పిన్నలంతా ఖతీజా ఇంట సమావేశమయ్యారు. ముహమ్మద్ బాబాయి అబూతాలిబ్ నికాహ్ ప్రసంగం చేశారు. దైవాన్ని ప్రస్తుతించిన అనంతరం, అబూతాలిబ్ మాట్లాడుతూ, ‘ఇతను నా సోదరుడు అబ్దుల్లాహ్ కుమారుడు. పేరు ముహమ్మద్. ఖురైష్ వంశం మొత్తంలో ఇంతటి సుగుణ సంపన్నుడు మరొకరు లేరు. అతనివద్ద ధన సంపదలు లేకపోవచ్చు కానీ సుగుణ సంపదకు కొదవ లేదు. అయినా ధనసంపదలు శాశ్వతం కావు. సంపద తరిగే, పెరిగే నీడలాంటిది. ఈ రోజు ఉండవచ్చు. రేపు లేకపోవచ్చు. ఈ రోజు ఒకరి దగ్గరుంటే, రేపు మరొకరి దగ్గర ఉండవచ్చు. ముహమ్మద్ నాకు ప్రాణసమానం. ఈ విషయం మీకందరికీ తెలుసు. ముహమ్మద్, ఖువైలిద్ కూతురు ఖతీజాను వివాహమాడుతున్నాడు. ఈ శుభసందర్భంగా నేను నా ఆస్తిలో నుండి 20 ఒంటెల్ని మహర్‌గా నిర్ణయిస్తున్నాను. దైవసాక్షి! ఇతని భవిష్యత్ ఉజ్వలంగా ఉండబోతోంది. దైవకృప, ఆయన కారుణ్యం తనవెంట ఉన్నాయి’ అంటూ వివాహ ప్రసంగం ముగించారు అబూతాలిబ్. ఈ విధంగా ఈ వివాహ శుభకార్యం ఆనందోత్సాహాలతో ముగిసింది. తాహిరా ఆమిన్ ఇంట కాలుమోపింది. అప్పుడు ముహమ్మద్ వయసు ఇరవై ఐదు సంవత్సరాల రెండునెలల పదిరోజులు. బీబీ ఖతీజా వయసు నలభై సంవత్సరాలు. ఖతీజా, ముహమ్మద్ గార్ల దాంపత్యజీవితం హాయిగా, ఆనందంగా గడిచిపోతోంది. ఒకరి సహచర్యం మరొకరికి శాంతిని, ప్రశాంతతను పంచిపెడుతోంది. ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఖతీజా కేవలం అందం, సిరిసంపదలు కలిగిన స్త్రీ మాత్రమే కాదు. ఎంతో వివేకం, విజ్ఞత, తెలివితేటలు, దూరదృష్టి గల మహిళామణి కూడా! అందుకే ఆమె సచ్ఛీలత, సత్యసంధత, నీతి, నిజాయితీల ప్రతిరూపమైన ముహమ్మద్ (స) గారిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు. ఒక ఆదర్శ ఇల్లాలుగా, ఉత్తమ భర్తగా వారిద్దరూ కూడా తమను తాము నిరూపించుకున్నారు. మూఢాచారాలు, మార్గభ్రష్టత్వంలో మునిగి ఉన్న సమాజాన్ని ఎలాగైనా సంస్కరించి, మంచి సమాజంగా, సౌశీల్యం ఉన్నత మానవీయ విలువలు ఉట్టిపడే సమాజంగా తీర్చిదిద్దాలన్నది ముహమ్మద్ (స) ఆలోచన. దీనికోసం ఆయన ఎంతగానో పరితపించేవారు. ఏకాంతంలో కూర్చొని ఆలోచించేవారు. దైవధ్యానంలో లీనమైపోయేవారు. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)