నిజమైన స్త్రీవాదం అంటే ఏంటో గూగుల్‌లో వెతికి చూడాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్‌కు.. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా హితవు పలికారు. కాగా తస్లీమా.. రెహమాన్ కుమార్తె ఖతీజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఖతీజా బుర్జా ధరించిన ఫోటోను ఆమె ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘నాకు ఏఆర్ రెహమాన్ పాటలంటే చాలా ఇష్టం. కానీ ఖతీజాను ఎప్పుడూ చూసిన నాకు ఊపిరాడని అనుభూతి కలుగుతుంది. తండ్రి ఏఆర్ రెహమాన్ చెప్పినందుకే ఆమె ముఖాన్ని కవర్ చేసుకుంటారేమో’ అంటూ ఆరోపించారు. ఇక ఇలాంటి విమర్శలు రావడం ఖతీజాకు మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఆమె వస్త్రధారణపై అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇష్టమైన దుస్తులు ధరించే స్వేచ్ఛ తనకు ఉందని విమర్శకుల నోళ్లను మూయించేలా ఖతీజా కౌంటర్ ఇచ్చారు.
ఇక తస్లీమా ట్వీట్‌పై ఖతీజా తనదైన స్టైల్లో స్పందించారు. తస్లీమా వ్యాఖ్యలకు బదులిస్తూ.. ఓ కొటేషన్‌తో మండుతున్న అగ్ని ఫోటోను పంచుకున్నారు. ‘నేను మౌనంగా ఉన్నంత మాత్రాన తప్పుగా అంచనా వేయకండి. మాట్లాడకుండా ఉన్నానంటే అది నా మంచితనం. నా ప్రియమైన స్నేహితులారా. .ఎవరికైతే నా వస్త్రధారణ వల్ల ఊపిరాడటం లేదో వారు దయచేసి వెళ్లి స్వచ్చమైన గాలిని స్వీకరించండి. ఎందుకంటే నేను బుర్ఖా ధరించడం వల్ల ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లేదు. వాస్తవానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. నిజమైన స్త్రీ వాదం అంటే ఏంటో గూగుల్‌లో వెతకండి. నిజమైన ఫెమినిజం ఇతర మహిళలను ఎప్పుడూ కించపరచదు అలాగే వారి తండ్రుల్ని సమస్యలోకి లాగదు. అసలు నేను నా ఫోటోలను మీ పరిశీలన కోసం,మెప్పు కోసం మీకు పంపించినట్టు నాకైతే గుర్తు లేదు.' అంటూ సమాధానమిచ్చారు. అలాగే మరో పోస్ట్‌ను షేర్‌చేస్తూ.. ఈ విషయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎవరూ కూడా తస్లీమాపై వ్యతిరేకంగా మాట్లాడొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment