Taslima Nasreen
-
Bangladesh Crisis: అది స్వయం కృతాపరాధం: తస్లీమా నస్రీన్
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల మధ్య ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం, తరువాత ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టడం సంచలనంగా మారింది. బంగ్లాదేశ్ సంక్షోభంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్‌లో ఆశ్రయం పొందడం విడ్డూరంగా ఉందన్నారు. ఇస్లాంవాదులను ప్రసన్నం చేసుకునేందుకే హసీనా బంగ్లాదేశ్ నుంచి బయటపడ్డారని, ఆమె కూడా విద్యార్థి ఉద్యమంలో భాగమైనట్లు ఉన్నదని తస్లీమా ఆరోపించారు.తస్లీమా నస్రీన్ ఒక ఆన్లైన్ పోస్ట్‌లో ‘ఇస్లామిస్టులను ప్రసన్నం చేసుకునేందుకు, హసీనా నన్ను 1999లో నా దేశం నుంచి వెళ్లగొట్టారు. అప్పట్లో నేను మరణశయ్యపై ఉన్న మా అమ్మను చూసేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లాను. ఆ తరువాత నన్ను తిరిగి బంగ్లాదేశ్‌కు రానివ్వలేదు. ఒకవిధంగా చూస్తే ఆమె ఇస్లామిస్టు ఉద్యమంలో భాగమయ్యారు. అదే ఇప్పుడు ఆమెను దేశం విడిచివెళ్లేలా చేసింది’ అని అన్నారు. షేక్ హసీనా మిలటరీ విమానంలో భారతదేశానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె ఆశ్రయం పొందేందుకు లండన్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. ఇస్లాంవాదులకు మద్దతుగా నిలిచేందుకు, అవినీతికి పాల్పడే వ్యక్తులకు ఆమె ప్రోత్సాహం అందించారని’ తస్లీమా ఆరోపించారు.తస్లీమా నస్రీన్ 1994లో ‘లజ్జ’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. దీనిపై మత ఛాందసవాద సంస్థల నుండి వచ్చిన బెదిరింపుల కారణంగా ఆమె బంగ్లాదేశ్ విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఈ పుస్తకాన్ని బంగ్లాదేశ్‌లో నిషేధించారు. అయితే చాలా ప్రాంతాల్లో ఈ బుక్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. తస్లీమా నస్రీన్ దేశం విడిచి వెళ్లిన సమయంలో హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్నారు. నాటి నుంచి రచయిత తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్‌కు దూరంగా ఉన్నారు. -
ఎఫ్బీలో జుకర్‌బర్గ్‌కు భారీ షాక్, కష్టాల్లో మెటా
న్యూఢిల్లీ: మెటా సీఈవో, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పౌండర్ మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత ప్లాట్‌ఫాంలోనే ఊహించని ఝలక్ తగిలింది. ఒక్కసారిగా 118 లక్షల ఫాలోవర్లను కోల్సోయారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను ప్రభావితం చేసే బగ్ కారణంగా కొన్ని సెకన్లలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫేస్బుక్లో జుకర్‌బర్గ్‌కు 119 మిలియన్ల (11.9 కోట్ల)మంది ఫాలోవర్లు ఉండగా అకస్మాత్తుగా అది కాస్తా 10వేల కిందికి (9920) పడి పోవడం సంచలనం రేపింది. మరోవైపు జుకర్‌బర్గ్‌తో పాటు పలువురు సెలబ్రిటీల పాలోవర్ల సంఖ్య కూడా లక్షల్లో తగ్గిపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా ప్రముఖ రచయత్రి తస్లిమా నస్రీన్ ట్వీట్ చేశారు.ఫేస్బుక్ సునామీతో తన ఫాలోవర్లు కూడా ఒక్కమారుగా 9లక్షల నుంచి 9వేలకు పడిపోయారంటూ మీడియా కథనాన్ని షేర్ చేశారు. అంతేకాదు తనకు ఫేస్బుక్ కామెడీ అంటే చాలా ఇష్టం అంటూ ఆమె ట్వీట్ చేయడం విశేషం. తర్వాత కొన్ని గంటల్లో ఈ లోపాన్ని కంపెనీ సరిచేయడంతో యథాతథంగా ఆయా సెలబ్రిటీల ఫాలోవర్లు కనిపించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లోపాన్ని త్వరగా గుర్తించి మెటా పరిస్థితిని సరిదిద్దే పనిలో ఉన్నామని, సాంకేతికత లోపాలే కారణమని మెటా తెలిపింది. అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. అయితే, పొరపాటు ఎలా జరిగిందనే దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా మెటా వర్స్ సక్సెస్‌లో ఇబ్బందులు పడుతున్న మోటాకు తాజాగా ఫాలోవర్ల కౌంట్ తగ్గిపోవడంతో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్‌లో రష్యన్ మిలిటరీకి వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చే పోస్ట్‌లను మెటా అనుమతిస్తోందని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ను ఉగ్రవాదులు, తీవ్రవాదుల జాబితాలో చేరుస్తూ ఆర్థిక పర్యవేక్షణ ఏజెన్సీ రోస్ఫిన్‌మోనిటరింగ్ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, లింక్డ్ఇన్ సీఈవొ ర్యాన్ రోస్లాన్స్కీతో సహా అనేక మంది అమెరికన్ పౌరులపై క్రెమ్లిన్ విధించిన ఆంక్షలలో భాగంగా జుకర్‌బర్గ్ రష్యాలోకి ప్రవేశించకుండా నిషేధం ఇప్పటికే అమల్లో ఉంది. .@facebook created a tsunami that wiped away my almost 900,000 followers and left only 9000 something on the shore: @taslimanasreen. Several users of @Meta's #facebook are complaining losing majority of their #followers. read more here. #MarkZuckerberghttps://t.co/QbxBSgMvId — The Telegraph (@ttindia) October 12, 2022 -
‘సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉన్నా.. అయినా’
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తూనే ఉంది. రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ తారలు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విటర్లో తెలిపారు. సుమారుగా ఒక సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉన్న తనకు కోవిడ్ ఎలా వచ్చిందనే విషయం అర్థమవ్వడంలేదని ట్విటర్లో తెలిపింది. కరోనా నేపథ్యంలో ఇంట్లోకి ఇప్పటివరకు ఎవర్నీ రానివ్వలేదని అయినా తనకు కోవిడ్ సోకడం ఆశ్చర్యం కల్గిస్తోందని తస్లీమా పేర్కొన్నారు. తస్లీమా నస్రీన్ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసును వేయించుకున్నారు. i haven't stepped out of my home for more than a year. Didn't allow anyone to enter my home. i was alone with a cat. And then i caught covid-19. Wish i knew how i caught it. ☹️ — taslima nasreen (@taslimanasreen) May 9, 2021 చదవండి: కరోనాపై పోరుకు కొత్తవైద్యులు -
తస్లీమాపై పరువు దావా నష్టం వేయనున్న మొయిన్ అలీ
ముంబై: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ''మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడంటూ'' ట్విటర్లో సంచలన కామెంట్స్ చేసింది. తస్లీమా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. మొయిన్ అలీపై తస్లీమా చేసిన వ్యాఖ్యలపై పలువురు క్రికెటర్లతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ క్రికెటర్లు జోప్రా ఆర్చర్, శామ్ బిల్లింగ్స్‌తో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా మొయిన్ అలీకి మద్దతుగా నిలుస్తూ ఆమెను ఉతికారేశారు. తాజాగా తస్లీమా నస్రీన్ వ్యాఖ్యలపై మొయిన్ అలీ పరువు నష్టం దావా వేయనున్నట్లు సమాచారం. ''మొయిన్ అలీపై తస్లీమా నస్రీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలు అలీ పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని.. అందుకే లీగల్ పద్దతిలో మా లాయర్‌తో చర్చించి కోర్టును ఆశ్రయించనున్నాం. ఒక వ్యక్తిని కించపరిచేలా మాట్లాడినందుకు తస్లీమాపై పరువు నష్టం దావా వేయనున్నాం.''అంటూ అలీ మేనేజ్మెంట్ కంపెనీ ఎసెస్ మిడిల్ ఈస్ట్ తన ట్విటర్లో రాసుకొచ్చింది. అయితే మొయిన్ అలీ తస్లీమా వ్యాఖ్యలపై స్పందించలేదు.. అయితే ఈ విషయాన్ని తన మేనేజ్మెంట్ చూసుకుంటుందని అలీ భావించి ఉంటాడని సమాచారం. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో మెయిన్ అలీ సీఎస్కేకు ఆడనున్న సంగతి తెలిసిందే. కాగా వేలంలో సీఎస్కే అలీని రూ.7 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సీఎస్కే ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్10న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. చదవండి: ‘అతను క్రికెటర్ కాకపోయుంటే టెర్రరిస్ట్ అయ్యేవాడు ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్కే For the record - we are consulting our lawyers with regards the defamatory tweet made by @taslimanasreen in regards to Moeen Ali and will look at the possible angles for legal proceedings - one mustn’t be allowed to utter such nonsense and be allowed to get away with it — Aces Middle East (@Aces_sports) April 6, 2021 -
‘అతను క్రికెటర్ కాకపోయుంటే టెర్రరిస్ట్ అయ్యేవాడు’
న్యూఢిల్లీ: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మొయిన్ అలీపై ట్విటర్ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడని సంచలన కామెంట్స్ చేసింది. దీంతో తస్లీమాపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. క్రికెటర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదని మండిపడుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ముస్లిం అయినంత మాత్రాన అతను టెర్రరిస్ట్ అవుతాడా? అని ప్రశ్నిస్తున్నారు. తనకు నచ్చింది తాను చేస్తున్నాడని, తన చర్యల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించడం లేదు కదా? అని నిలదీస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. తస్లీమా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. కాగా, త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్తగా జెర్సీని రూపొందించింది. అయితే ఆ జర్సీపై మద్యం కంపెనీ లోగో ఉన్నందున దాని బదులు మరో జర్సీ ధరించేందుకు తనకు అనుమతివ్వాలని మొయిన్ అలీ జట్టు యాజమాన్యాన్ని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యమే మొయిన్ అలీపై తస్లీమా వివాదాస్పద వ్యాఖ్యలకు కారణమైంది. కాగా, లోగో అంశంలో మొయిన్ నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని సీఎస్కే సీఈవో విశ్వనాథన్ ఇప్పటికే స్పష్టం చేశారు. చదవండి: ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు 5 వికెట్లు సాధించడమే లక్ష్యం: షకీబ్ -
తస్లీమాకు ఏఆర్ రెహమాన్ కుమార్తె ధీటైన రిప్లై
నిజమైన స్త్రీవాదం అంటే ఏంటో గూగుల్‌లో వెతికి చూడాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్‌కు.. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా హితవు పలికారు. కాగా తస్లీమా.. రెహమాన్ కుమార్తె ఖతీజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఖతీజా బుర్జా ధరించిన ఫోటోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘నాకు ఏఆర్ రెహమాన్ పాటలంటే చాలా ఇష్టం. కానీ ఖతీజాను ఎప్పుడూ చూసిన నాకు ఊపిరాడని అనుభూతి కలుగుతుంది. తండ్రి ఏఆర్ రెహమాన్ చెప్పినందుకే ఆమె ముఖాన్ని కవర్ చేసుకుంటారేమో’ అంటూ ఆరోపించారు. ఇక ఇలాంటి విమర్శలు రావడం ఖతీజాకు మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఆమె వస్త్రధారణపై అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇష్టమైన దుస్తులు ధరించే స్వేచ్ఛ తనకు ఉందని విమర్శకుల నోళ్లను మూయించేలా ఖతీజా కౌంటర్ ఇచ్చారు. ఇక తస్లీమా ట్వీట్‌పై ఖతీజా తనదైన స్టైల్లో స్పందించారు. తస్లీమా వ్యాఖ్యలకు బదులిస్తూ.. ఓ కొటేషన్‌తో మండుతున్న అగ్ని ఫోటోను పంచుకున్నారు. ‘నేను మౌనంగా ఉన్నంత మాత్రాన తప్పుగా అంచనా వేయకండి. మాట్లాడకుండా ఉన్నానంటే అది నా మంచితనం. నా ప్రియమైన స్నేహితులారా. .ఎవరికైతే నా వస్త్రధారణ వల్ల ఊపిరాడటం లేదో వారు దయచేసి వెళ్లి స్వచ్చమైన గాలిని స్వీకరించండి. ఎందుకంటే నేను బుర్ఖా ధరించడం వల్ల ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లేదు. వాస్తవానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. నిజమైన స్త్రీ వాదం అంటే ఏంటో గూగుల్‌లో వెతకండి. నిజమైన ఫెమినిజం ఇతర మహిళలను ఎప్పుడూ కించపరచదు అలాగే వారి తండ్రుల్ని సమస్యలోకి లాగదు. అసలు నేను నా ఫోటోలను మీ పరిశీలన కోసం,మెప్పు కోసం మీకు పంపించినట్టు నాకైతే గుర్తు లేదు.' అంటూ సమాధానమిచ్చారు. అలాగే మరో పోస్ట్‌ను షేర్చేస్తూ.. ఈ విషయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎవరూ కూడా తస్లీమాపై వ్యతిరేకంగా మాట్లాడొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు. View this post on Instagram Been only a year and this topic is in the rounds again..there’s so much happening in the country and all people are concerned about is the piece of attire a woman wants to wear. Wow, I’m quite startled. Every time this topic comes the fire in me rages and makes me want to say a lot of things..Over the last one year, I’ve found a different version of myself which I haven’t seen in so many years. I will not be weak or regret the choices I’ve made in life. I am happy and proud of what I do and thanks to those who have accepted me the way I am. My work will speak, God willing.. I don’t wish to say any further. To those of you who feel why I’m even bringing this up and explaining myself, sadly it so happens and one has to speak for oneself, that’s why I’m doing it. 🙂. Dear Taslima Nasreen, I’m sorry you feel suffocated by my attire. Please get some fresh air, cause I don’t feel suffocated rather I’m proud and empowered for what I stand for. I suggest you google up what true feminism means because it isn’t bashing other women down nor bringing their fathers into the issue 🙂 I also don’t recall sending my photos to you for your perusal 🙂 A post shared by 786 Khatija Rahman (@khatija.rahman) on Feb 14, 2020 at 11:45am PST -
అక్బరుద్దీన్ అంతగా మారిపోయాడా?
హైదరాబాద్: పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారి ఆలయం అభివృద్ధికి నిధులను కోరుతూ.. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలవడంపై మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్ కూడా అక్బరుద్దీన్‌పై విమర్శలు సంధించారు. 'గతంలో హిందువుల పట్ల చులకనగా మాట్లాడటమే కాక 15 నిమిషాలు పోలీసులు కళ్లు మూసుకుంటే హిందూ, ముస్లిం జనాభాను సమానం చేస్తానన్న ఆయన ఇంత మంచి మనిషిగా ఎప్పుడు మారిపోయారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ ఇప్పుడు మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నాడు. అతడు ముఖానికి మాస్క్ తగిలించుకున్నాడా? లేకపోతే మంచిమనిషిగా మారాడా?' అంటూ ఆమె ట్వీట్ చేశారు. తనకు స్వేచ్ఛ కలిగితే దేశంలో హిందూ ముస్లింల జనాభాను సమానం చేస్తానని అక్బరుద్దీన్ ఇదివరకు పలుమార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా: హీరోయిన్ హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం శ్రీ కేసీఆర్ ను కోరారు. ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందచేశారు. pic.twitter.com/EyaORdJxUH — Telangana CMO (@TelanganaCMO) February 9, 2020 Akbaruddin Owaisi who wanted to kill Hindus if police is removed for 15 minutes, now want Rs 10 crore for the development of Mahankali temple! Is he wearing a mask? Or he has become a better man! — taslima nasreen (@taslimanasreen) February 10, 2020 -
శ్రీలంక సంచలన నిర్ణయం; వాళ్లూ మనుషులే!
కొలంబో : శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో బుర్ఖాలతో సహా ముఖాన్ని కవర్ చేసుకునేందుకు ఉపయోగించే దుస్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈమేరకు ఆదేశాలు జారీచేయగా.. సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. శ్రీలంక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సంప్రదాయవాదులు ఈ విషయాన్ని తప్పుపడుతుండగా...బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ మాత్రం స్వాగతించారు. ఈ మేరకు... ‘ బాంబు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలకం బుర్ఖాలను నిషేధించింది. చాలా మంచి నిర్ణయం. దీని ద్వారా మహిళలు తాము కూడా మనుషులమేనని భావిస్తారు. మొబైల్ ప్రిజన్(ముసుగులో ఉన్న కారణంగా ఎక్కడ ఉన్నా జైలు ఉన్నట్లుగా అనే ఉద్దేశంలో) నుంచి బయపడేందుకు వారు’ అర్హులు అంటూ తస్లిమా ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ‘ మొబైల్ ప్రిజన్ అనే ఒకే ఒక్కమాటతో ఈ విషయాన్ని అత్యద్భుతంగా వర్ణించారు అని కొందరు కామెంట్ చేస్తూ.. భారత్‌తో పాటు పలు ముస్లిం దేశాలలో ఇలాంటి నిబంధన రావాలని కోరుకుంటుండగా.. మరికొందరు మాత్రం.. ‘అందరూ మీ లాగే బుర్ఖాను జైలులా భావించారు. దయచేసి మీ అభిప్రాయాన్ని ముస్లిం మహిళలందరికీ ఆపాదించకండి. కేవలం ముస్లిం కమ్యూనిటీలోనే కాదు హిందూ మతంలో కూడా రాజస్తాన్ వంటి చోట్ల పర్దా పద్ధతి ఉంది’ అంటూ తస్లిమాను ట్రోల్ చేస్తున్నారు. Sri Lanka banned burqas for 'public protection' after bomb attacks. Good decision. It will help women feel like human beings. They deserve to have the right to not live in a mobile prison. — taslima nasreen (@taslimanasreen) April 29, 2019 -
వెనుతిరిగిన తృప్తి దేశాయ్
తిరువనంతపురం : భక్తుల శరణు ఘోషతో మారుమోగాల్సిన అయ్యప్ప సన్నిధానం నిరసనకారుల నినాదాలతో హోరెత్తుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తరువాత శబరిమల ఆలయాన్ని ఇప్పటికి మూడు సార్లు తెరిచారు. కానీ ప్రతి సారి అయ్యప్ప సన్నిధానం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా వార్షిక మండల దీక్ష సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి శబరిమల ఆలయాన్ని తెరిచారు. ఈ సందర్భంగా తాను శబరిమలలో ప్రవేశించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకునే తీరతానని శపథం చేసి శుక్రవారం కొచ్చి చేరుకున్నారు సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్. కానీ నిరసనకారులు ఆమెను కొచ్చి విమానాశ్రయం వద్దే అడ్డుకున్నారు. ఆలయానికి వెల్లనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. 14 గంటల నిరసనల అనంతరం తృప్తి దేశాయ్, ఆమెతో పాటు వచ్చిన మరో 6గురు కార్యకర్తలు ముంబై తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వీరికి ముంబై విమానాశ్రయంలో కూడా నిరసనల సెగ తగిలింది. ఎందుకు ఇంత అత్యుత్సాహం : తస్లిమా నస్రీన్ ఈ సందర్భంగా బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ శబరిమల వివాదంపై స్పందించారు. ‘మహిళా కార్యకర్తలంతా శబరిమల ఆలయాన్ని సందర్శించడానికి ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. శబరిమల బదులు గ్రామాలకు వెళ్లి అక్కడ మహిళ పట్ల జరుగుతున్న గృహహింస, అత్యాచారం, వేధింపులు, నిరక్షరాస్యత, సమాన వేతనం, ఆరోగ్యం, ఉద్యోగం చేసే స్వేచ్ఛ వంటి అంశాల గురించి పోరాడితే మంచిది’ అంటూ ట్వీట్ చేశారు. I do not understand why women activists are so eager to enter Sabarimala. Better they should enter the villages where women suffer from domestic violence, rape, sexual abuse,hate, where girls have no access to education, heath-care,and no freedom to take a job or get equal pay. — taslima nasreen (@taslimanasreen) November 16, 2018 -
రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన నిర్ణయం
-
'నా శరీరాన్ని దానంగా ఇచ్చేస్తున్నా'
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. తాను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సస్(ఎయిమ్స్) దానం చేస్తున్నట్టు తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణ గురైన ఈమెకు భారత్ ఆసరా కల్పించిన సంగతి తెలిసిందే. తన శరీరాన్ని ఎయిమ్స్‌కు విరాళంగా ఇస్తున్న విషయాన్ని తస్లీమా నస్రీన్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. శాస్త్రీయ పరిశోధన, బోధన కోసం తన శరీరాన్ని విరాళంగా ఇస్తున్నట్టు తెలిపింది. 1962లో జన్మించిన తస్లీమా, ‘లజ్జ’ అనే వివాదాస్పద రచనతో 32 ఏళ్ల వయసులోనే తన స్వదేశం నుంచి బహిష్కరణకు గురైంది. బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన ఆమెకు, భారత్ ఆశ్రయం కల్పిస్తోంది. స్వీడస్ పాస్పోర్టుతో తస్లీమా భారత వీసాను పొందుతూ ఉన్నారు. 2017 జూన్ ఆమె వీసా గడువును మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. I have donated my body after death to AIIMS for scientific research and teaching purpose. pic.twitter.com/jq1KNLZCZQ — taslima nasreen (@taslimanasreen) May 22, 2018 -
తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు!
జైపూర్: ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ లా)ను పలు ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రవాస బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు అత్యవసరంగా ఉమ్మడి పౌరస్మృతి అవసరముందని ఆమె స్పష్టం చేశారు. డిగ్గీ ప్యాలెస్‌లో జరిగిన జైపూర్ సాహిత్యోత్సవం (జెఎల్ఎఫ్)లో ఆమె అనూహ్యంగా హాజరై ప్రసంగించారు. ఇస్లాంను విమర్శించడమే ఇస్లామిక్ దేశాల్లో లౌకికవాదం నెలకొల్పడానికి మార్గమని ఆమె అన్నారు. బంగ్లాదేశ్‌లో మతఛాందసవాదుల ఆగ్రహావేషాల నేపథ్యంలో 1994 నుంచి ఈ వివాదాస్పద రచయిత ప్రవాసంలో గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, జేఎల్ఎఫ్ వేదిక బయట ముస్లిం సంఘాలు ఆమె రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించాయి. 'తస్లీమాను బంగ్లాదేశ్ వెళ్లగొట్టింది. ఆమెను ఈ దేశంలో బతికేందుకు అనుమతిస్తే.. ఆమె మరీ ఎక్కువ స్వేచ్ఛను తీసుకుంటోంది' అని రాజస్థాన్ ముస్లిం ఫోరం కన్వీనర్ కారీ మొయినుద్దీన్ విమర్శించారు. ఈ ఇద్దరు వ్యక్తుల్ని (సల్మాన్ రష్దీ, తస్లీమా నస్రీన్లను) మళ్లీ ఎప్పుడూ సాహిత్యోత్సవానికి ఆహ్వానించమని జేఎల్ఎఫ్ నిర్వాహకులు హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. 'ఎగ్జైల్' (ప్రవాసం) పేరిట జరిగిన సెషన్లో తస్లీమా మాట్లాడుతూ.. 'నేను, ఇతరులు హిందూయిజం, బుద్ధిజం లేదా ఇతర మతాల్ని విమర్శించినప్పుడు ఏమీ జరగదు. కానీ మీరు ఇస్లాంను విమర్శించిన వెంటనే జీవితకాలం వ్యక్తులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. మీకు వ్యతిరేకంగా ఫత్వాలు జారీచేస్తారు. మిమ్మల్ని చంపాలని చూస్తారు. కానీ, వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారు? నాతో ఏకీభవించనప్పుడు.. నాకు వ్యతిరేకంగా వాళ్లు కూడా రాయవచ్చు. మనందరిలాగే వారి అభిప్రాయాలు వెల్లడించవచ్చు. ఫత్వాలకు బదులు సంభాషించవచ్చు కదా' అని ఆమె పేర్కొన్నారు. ముస్లిం మహిళలు అణచివేయబడుతున్నారని, వారి రక్షణ కోసం ఉమ్మడి పౌరస్మృతి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. -
'అలా అనడానికి ఇష్టపడను'
న్యూఢిల్లీ: ఏవో కొన్ని దురదృష్టకర ఘటనలు జరిగినంత మాత్రాన భారత్‌లో అసహనం రాజ్యమేలుతోందనుకోవాల్సిన అవసరం లేదని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో సీఐఐ యంగ్ ఇండియా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. దాద్రీ , పన్సారే, దభోల్కర్, కల్బుర్గీ, జార్ఖండ్‌లో పశువుల వ్యాపారుల హత్యలను ఖండించారు. ‘ఇలాంటి ఘటనలు దురదృష్టకరం. అలాగని భారత్‌లోని 124 కోట్ల మంది అసహనంతో ఉన్నారనేది సరికాదు’ అని ఆమె పేర్కొన్నారు. భారత్ ను అసహన దేశంగా పేర్కొనడానికి తాను ఇష్టబోనని అన్నారు. భారతీయ చట్టాలు, రాజ్యాంగం సహనంతో కూడుకున్నదని తస్లీమా పేర్కొన్నారు. -
'ముస్లిం మతవాదులను ఎందుకు ప్రశ్నించరు?'
కోజికోడ్: లౌకికవాదులు ఎప్పుడూ హిందూ మతవాదులనే ప్రశ్నిస్తారుగానీ.. ముస్లిం మతవాదులను ఎందుకు ప్రశ్నించరు అని వివాదాస్పద రచయిత్రి, మహిళా హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ అన్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఆశ్రయం పొందుతున్న ఆమె.. శనివారం కోజికోడ్‌లో జరుగుతున్న 'కేరళ లిటరేచర్ ఫెస్టివల్' కు హాజరయ్యారు. ఇండియాలో అసహనం ఉందని తాను భావించడంలేదన్న తస్లీమా ఇక్కడ ఒకరి నమ్మకాలపై మరొకరు సహనంతో వ్యవహరిస్తారని పేర్కొన్నారు. భారత చట్టాలు అసహనానికి మద్దతు పలకవని, అయినప్పటికీ ఇక్కడ అసహనానికి గురయ్యేవారి సంఖ్య తక్కువేమీకాదని అన్నారు. లౌకికవాదులు గా పేరుపొందినవారు కేవలం హిందూ మతవాదులనే ప్రశ్నించి ఊరుకుంటారని, ముస్లిం మతవాదుల జోలికి పోరని, ఇలాంటి బూటకపు లౌకికవాద ప్రజాస్వామ్యం ఎప్పటికీ నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదని తస్లీమా అభిప్రాయపడ్డారు. -
'అలాగని మన గొంతు విప్పకుంటే ప్రమాదమే'
న్యూఢిల్లీ: భారత్ చాలా సహనశీల దేశమని బంగ్లాదేశ్ ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ అన్నారు. ప్రతి సమాజంలో కొంత అసహనాన్ని సృష్టించే వ్యక్తులు ఉంటారని, అది హిందువుల్లోనూ, ముస్లింలోనూ అయ్యి ఉండొచ్చని చెప్పారు. ఏదేమైనా ఒక వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అన్నింటికంటే ప్రథమమైన అంశమని చెప్పారు. సహనానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తస్లిమా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నారు. 'భారత్ చాలా సహనంతో నిండిన దేశమని నేను భావిస్తాను. అయితే కొంతమంది ప్రజలు అసహనంతో ఉండి ఉండొచ్చు. ప్రతి సమాజంలో ఇలాంటివారు ఉండనే ఉంటారు. మనం ఇలాంటి విషయాల్లో హిందువులను ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఓసారి ముస్లింల గురించి కూడా మాట్లాడాలి. కొంతమంది వ్యక్తులకు కొన్ని విషయాలు నచ్చకపోయినా భావ ప్రకటన స్వేచ్ఛ మేరకు మన అభిప్రాయాలను వెల్లడించాలి. మనం మన గొంతు విప్పకుంటే దేశానికి, సమాజానికి అంతమంచిది కాదు. మత ప్రాతిపదికన చేసిన ఎలాంటి చెడుపనులనైనా మనం వ్యతిరేకించాల్సిందే' అని ఆమె అభిప్రాయపడ్డారు. -
ఢిల్లీ ప్రపంచ పుస్తక మేళా ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: భారత, చైనాల్లో ప్రచురణ రంగం అభివృద్ధి చెందుతోందని, ఇరు దేశాల సాంస్కృతిక సంబంధాలు మరింతగా మెరుగుపడతాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారమిక్కడి ప్రగతిమైదాన్‌లో 43వ న్యూఢి ల్లీ ప్రపంచ పుస్తక మేళా(వరల్డ్ బుక్ ఫెయిర్)ను ఆమె ప్రారంభించారు. భారత సాంస్కతిక వైభవం ప్రధానాంశంగా నిర్వహిస్తోన్న ఈ మేళాలో యువరచయితలకు ప్రోత్సహించడానికి నవలేఖన్ కార్యక్రమాన్ని తొలిసారి నిర్వహిస్తున్నారు. కాగా, రచయితలకు సంపూర్ణ భావప్రకటన స్వేచ్ఛ ఉండాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ‘మనం నోరు విప్పకపోతే సమాజం ముందుకు వెళ్లదు’ అని ఢిల్లీ సాహిత్యోత్సవంలో అన్నారు. -
మళ్లీ ఇండియాకు తిరిగి వస్తా...
కోల్‌కతా: మళ్లీ భారత్‌కు తిరిగి వస్తానని, కొంతకాలం కోసమే అమెరికా వచ్చినట్లు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ తెలిపారు. బంగ్లాదేశ్ ఉగ్రవాదుల నుంచి తనకు ముప్పు ఉన్నందునే అమెరికా వచ్చినట్లు ఆమె చెప్పారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లామిక్ అతివాదుల నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో తస్లీమా గత కొంతకాలంగా భారత్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తన మాకాన్ని ఢిల్లీ నుంచి అమెరికాకు మార్చారు. తాను శాశ్వాతంగా ఇండియా నుంచి వెళ్లిపోలేదని, మళ్లీ వస్తానంటూ తస్లీమా తెలిపారు. భారత ప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తోందని, తాను ఆ దేశానికి కావాల్సిన వ్యక్తినని ఆమె అన్నారు. ఏడు నెలల పాటు ఆమె ఢిల్లీలోని ఓ అజ్ఞాత ప్రాంతంలో గడిపిన విషయం తెలిసిందే. కాగా తస్లీమాకు ప్రాణాపాయం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో న్యూయార్క్ అడ్వొకసీ గ్రూపు సెంటర్ ఫర్ ఎంక్వైరీ (సీఎఫ్ఐ) ఆమెకు భద్రత కల్పిస్తోంది. 'పెట్ కాట్ ఈజ్ వెయిటింగ్' అంటూ బుధవారం ఆమె ట్విట్ చేశారు. -
ఇక్కడే తస్లీమా జీవించాలని ఎందుకు కోరుకుంటోంది!
న్యూఢిల్లీ: భారత్ లోనే జీవించాలనుకుంటున్నానని వివాదస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. నాకు యూరప్ పౌరసత్వం, అమెరికాలో శాశ్వత నివాసి హోదా ఉంది. నేను ఎక్కడైనా జీవించడానికి అవకాశం ఉంది. ఒక వేళ బంగ్లాదేశ్ అనుమతిచ్చినా.. భారత్ లోనే నా శేష జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతాను అని పీటీఐ ఇచ్చిన ఇంటర్వ్యూలో తస్లీమా అన్నారు. గత 20 ఏళ్లలో భారత దేశంలో ఎంతో మంది స్నేహితులు ఏర్పడ్డారు. ఓ సిద్దాంతం ప్రకారం జీవించాలని భావిస్తే... బంధువులు కూడా అవసరం లేదని ఆమె అన్నారు. నీపై ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారనేదే చివరకు ముఖ్యం.. వారే నా బంధువులు అని అన్నారు. బంగ్లాదేశ్ తో నా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అని తస్లీమా తెలిపారు. భారత్ లో రెండు నెలలు నివసించడానికి తస్లీమాకు ఆగస్టు 1 తేది నుంచి భారత ప్రభుత్వం అనుమతించింది. సుదీర్ఘ కాలం జీవించడానికి అనుమతించాలని హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను తస్లీమా కలిశారు. -
తస్లీమా వీసా పొడిగింపునకు కేంద్రం హామీ!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. భారత్‌లో నివసించేందుకు తనకు ఏడాది కాలవ్యవధిగల వీసా మంజూరు చేయాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం బుధవారం తిరస్కరించి ఆగస్టు 1 నుంచి కేవలం రెండు నెలల తాత్కాలిక నివాసానికి అంగీకరించిన నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు ఆయనతో భేటీఅయ్యారు. సుమారు 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో తన వీసాను పొడిగించాలని ఆమె రాజ్‌నాథ్‌ను కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీ గురించి తస్లీమా ట్వీట్ చేస్తూ రాజ్‌నాథ్‌కు తన పుస్తకం ‘వో అంధేరే దిన్’ (ఆ చీకటి రోజులు)ను అందించానని...దీనికి ఆయన బదులిస్తూ ‘మీ చీకటి రోజులు ముగిసిపోతాయి’ అని అన్నారని పేర్కొన్నారు. -
రచయిత్రి తస్లీమా నస్రీన్ పై ఎఫ్ఐఆర్ నమోదు
లక్నో/కోల్‌కతా : బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. తమ మత విశ్వాసాలను కించపరిచేలా తస్లీమా ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ మత గురువు హసన్ రజా ఖాన్ నూరి మియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నవంబర్ 6వ తేదీన తస్లీమా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. మత గురువులపై ఆమె చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని హసన్ రజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తస్లీమా పాస్‌పోర్టును వెంటనే స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తనపై ఎఫ్ఐఆర్ నమోదయినట్టు తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తస్లీమా అన్నారు. తాను వాస్తవాలనే చెప్పానని ఆమె పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమిటో అర్థం కావడం లేదని, సత్యం మాట్లాడినందుకు మరోసారి తనకు ఇబ్బందులు తప్పడం లేదని ఢిల్లీలో మీడియాతో అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ ఉన్న ప్రజాస్వామిక భారత దేశంలో ఇలాంటిది జరుగుతుందని అనుకోలేదని అన్నారు. గతంలో ఛాందసవాదులనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను అధికారులు కోల్‌కతానుంచి ఢిల్లీకి పంపించిన విషయం తెలిసిందే.