హైదరాబాద్: పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారి ఆలయం అభివృద్ధికి నిధులను కోరుతూ.. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలవడంపై మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్ కూడా అక్బరుద్దీన్‌పై విమర్శలు సంధించారు.
'గతంలో హిందువుల పట్ల చులకనగా మాట్లాడటమే కాక 15 నిమిషాలు పోలీసులు కళ్లు మూసుకుంటే హిందూ, ముస్లిం జనాభాను సమానం చేస్తానన్న ఆయన ఇంత మంచి మనిషిగా ఎప్పుడు మారిపోయారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ ఇప్పుడు మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నాడు. అతడు ముఖానికి మాస్క్ తగిలించుకున్నాడా? లేకపోతే మంచిమనిషిగా మారాడా?' అంటూ ఆమె ట్వీట్ చేశారు. తనకు స్వేచ్ఛ కలిగితే దేశంలో హిందూ ముస్లింల జనాభాను సమానం చేస్తానని అక్బరుద్దీన్ ఇదివరకు పలుమార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే.
చదవండి: మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా: హీరోయిన్
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం శ్రీ కేసీఆర్ ను కోరారు. ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందచేశారు. pic.twitter.com/EyaORdJxUH
— Telangana CMO (@TelanganaCMO) February 9, 2020
Akbaruddin Owaisi who wanted to kill Hindus if police is removed for 15 minutes, now want Rs 10 crore for the development of Mahankali temple! Is he wearing a mask? Or he has become a better man!
— taslima nasreen (@taslimanasreen) February 10, 2020
Comments
Please login to add a commentAdd a comment