
తస్లీమా నస్రీన్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. తాను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సస్(ఎయిమ్స్) దానం చేస్తున్నట్టు తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణ గురైన ఈమెకు భారత్ ఆసరా కల్పించిన సంగతి తెలిసిందే. తన శరీరాన్ని ఎయిమ్స్‌కు విరాళంగా ఇస్తున్న విషయాన్ని తస్లీమా నస్రీన్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ ద్వారా ప్రకటించింది.
శాస్త్రీయ పరిశోధన, బోధన కోసం తన శరీరాన్ని విరాళంగా ఇస్తున్నట్టు తెలిపింది. 1962లో జన్మించిన తస్లీమా, ‘లజ్జ’ అనే వివాదాస్పద రచనతో 32 ఏళ్ల వయసులోనే తన స్వదేశం నుంచి బహిష్కరణకు గురైంది. బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన ఆమెకు, భారత్ ఆశ్రయం కల్పిస్తోంది. స్వీడస్ పాస్‌పోర్టుతో తస్లీమా భారత వీసాను పొందుతూ ఉన్నారు. 2017 జూన్ ఆమె వీసా గడువును మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
I have donated my body after death to AIIMS for scientific research and teaching purpose. pic.twitter.com/jq1KNLZCZQ
— taslima nasreen (@taslimanasreen) May 22, 2018