న్యూఢిల్లీ : చలికాలంలో నగరంలోని వివిధ ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నగరంలో అత్యంత ప్రముఖమైన ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్(ఎఐఐఎంఎస్)కు రోగుల తాకిడి అత్యధికంగా ఉంటుంది. కొందరికి ఆస్పత్రిలో బెడ్స్ దొరకవు. చలికాలంలో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నైట్‌షెల్టర్లను ఎయిమ్స్ ఏర్పాటు చేస్తోంది. దంతవైద్యశాల ప్రాంగణంలో మరో 40 నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటి తృమా సెంటర్‌లో సీఆర్‌పీఎఫ్‌తో కలిసి 160 నైట్ షెల్టర్లను నిర్వహిస్తోంది. చలి తీవ్రత కారణంగా మరిన్ని షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు ఎయిమ్స్ అధికారులు పేర్కొన్నారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి పరిధిలో 500 బెడ్‌ల సౌకర్యం ఉన్న షెల్టర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎయిమ్స్ డెరైక్టర్ ఎంసీ మిశ్రా చెప్పారు.
నగరంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. ఇంకా రోగులు, వారి బంధువులకు మరిన్ని షెల్టర్ల అవసరం ఉన్నదని ఆయన అన్నారు. మరో 200 బెడ్ సౌకర్యంతో కూడిన నైట్ షెల్టర్లను నిర్మిస్తున్నామని, 2015 వరకు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి ఇందుకు అవసరమైన రూ. 29 కోట్ల తీసుకొన్నట్లు చెప్పారు. ఎయిమ్స్ సెప్టెంబర్ 25, 1956లో ఏర్పాటైంది. ప్రస్తుతం రోజూ 10,000 మంది పేషంట్లు ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వీరికి అనుగుణంగా సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఎంతో దూరం నుంచి వచ్చే రోగులు, వైద్యపరీక్షల నిమిత్తం వచ్చే వారికి ఇబ్బందులు పడకుండా నైట్‌షెల్టర్లు దోహదపడుతాయని చెప్పారు.
రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోందని, ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు రాజధానిలో రెసిడెన్సియల్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆ మేరకు సరాసరి అక్కడకు వెళ్లి వైద్యసేవలు అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా 22 శాతం రోగులు ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి ఎయిమ్స్ వస్తుంటారని, మరో 40 శాతం మధ్యప్రదేశ్, ఒడిశ్సా రాష్ట్రాల నుంచి వస్తున్నారని చెప్పారు. ఆస్పత్రి వెలుపల రెస్‌డెన్సియల్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఎయిమ్స్‌లో ప్రస్తుతం 2,200 బెడ్స్ సౌకర్యం మాత్రమే ఉన్నదని అన్నారు.
ఎయిమ్స్‌లో నైట్‌షెల్టర్లు
Published Sat, Dec 20 2014 10:48 PM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM
Advertisement
Advertisement