Night Shelter
-
నిధుల లేమి.. నిర్వహణ లోపం
సాక్షి, హైదరాబాద్: ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ ఫుట్‌పాత్‌ల మీద, రోడ్ల పక్కన నరకయాతన అనుభవించే అభాగ్యులను హైదరాబాద్‌తో పాటు అన్ని పట్టణాల్లో చూస్తుంటాం. ఈవిధంగా తల దాచుకునేందుకు అగచాట్లు పడే అనాథలు, ఒంటరి యాచకులు, అభాగ్యులు, మానసిక రుగ్మతలతో బాధపడేవారికి అండగా నిలవాల్సిన బాధ్యత స్థానిక పాలకుల దేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆచరణలోకి తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి వారి కోసం జాతీయ పట్టణ జీవనోపాధి పథకం (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ – ఎన్యూఎల్ఎం) కింద రాత్రి ఆవాసాలు (నైట్ షెల్టర్లు) ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పట్టణ పాలక సంస్థలదే. ఈ విధంగా నైట్ షెల్టర్లు ఏర్పాటు చేసే ప్రక్రియకు 2014లో శ్రీకారం చుట్టినా.. పట్టణ సంస్థల చిత్తశుద్ధి లోపంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 35 నైట్ షెల్టర్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. వీటిలో 17 సెంటర్లు జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ సర్కిళ్లలో ఉండగా, మిగతా 141 పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న నైట్ షెల్టర్లు కేవలం 18 మాత్రమే కావడం గమనార్హం. కాగా ఉన్న నైట్ షెల్టర్లు కూడా సరైన నిధుల లేమి, నిర్వహణ లోపంతో ఓ ఉదాత్త కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విఫలమవుతున్నాయి. ఖమ్మం నైట్‌షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులు నవంబర్‌లో ర్యాపిడ్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా మరో 23 కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్ (సీడీఎంఏ) సత్యనారాయణ నేతృత్వంలో ఈ కొత్త సెంటర్ల నిర్మాణం జరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో నిరాశ్రయుల ర్యాపిడ్ సర్వే ప్రక్రియ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. తదనుగుణంగా 6 కొత్త సెంటర్లను జనవరి నాటికి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అన్ని షెల్టర్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, బెడ్లు, ట్రంకులు, బాత్ రూం సదుపాయం కల్పించాలి. ఆశ్రయం పొందేవారిలో పనిచేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న 10 శాతం మందికి ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. చాలాచోట్ల ఈ పరిస్థితి లేదన్న ఫిర్యాదుపై ... ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఓ అధికారి తెలిపారు. స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో.. పలు స్వచ్ఛంద సంస్థలు ఈ నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం మెప్మా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నైట్ షెల్టర్ నిర్వహణకు తొలి సంవత్సరం రూ. 6 లక్షలు, మరుసటి ఏడాది నుంచి ఏటా రూ.4 లక్షల చొప్పున చెల్లిస్తుంది. ఈ నిధులకు అదనంగా స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరించి నిర్వహణ బాధ్యతలు చూస్తాయి. షెల్టర్లలో ఆశ్రయం పొందేవారికి బ్లాంకెట్లు, ఫ్యాన్లు, ఇతర సౌకర్యాల కల్పనకు కొన్ని సంస్థలు దాతల నుంచి సహకారాన్ని తీసుకుంటున్నాయి. రామగుండంలో మూడు షెల్టర్లున్నా.. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మూడు నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు 2013లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో నైట్‌షెల్టర్‌కు రూ.44 లక్షలు చొప్పున కేటాయించారు. గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో, రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో 2019 నుంచి వీటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. ఒక్కో షెల్టర్‌లో 50 మంది వరకు ఆశ్రయం పొందే వీలుండగా ఇందులో ఐదుగురికి మాత్రం భోజనం పెడతారు. మరోవైపు సరైన సదుపాయాలు, టాయ్లెట్లు లేక బస చేయడానికి నిరాశ్రయులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అధికారులు రాత్రుళ్లు సర్వే చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు నైట్‌షెల్టర్ల గురించి ప్రచారం కూడా చేయకపోవడంతో నిరాశ్రయులకు రోడ్లు, ఫుట్‌పాత్‌లే దిక్కవుతున్నాయి. ఖమ్మంలో భేష్.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రెండు నైట్ షెల్టర్లు ఉన్నా యి. ప్రభుత్వ ఆస్పత్రిలో మెప్మా ఆధ్వర్యంలో నైట్ షెల్టర్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ 20 మంది పడుకునేందుకు బెడ్లు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నైట్ షెల్టర్‌ను 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. మరొకటి బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ భవనంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 200 మంది ఉండేలా సౌకర్యాలు కల్పించారు. భవనంలో పై అంతస్తులో 100 మంది మహిళలు, గ్రౌండ్ ఫ్లోర్లో 100 మంది పురుషులు ఉండొచ్చు. ఈ షెల్టర్‌ను అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరగని సర్వే ఎన్యూఎల్ఎం కింద రాష్ట్రంలో మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) ఆధ్వర్యంలో నడుస్తున్న 35 నైట్ షెల్టర్లలో 1,990 మంది మాత్రమే ఆశ్రయం పొందేందుకు అవకాశం ఉంది. ఖమ్మం బైపాస్ రోడ్డులోని టాకులపల్లి బ్రిడ్జి దగ్గర డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న నైట్‌షెల్టర్‌లో మాత్రమే అత్యధికంగా 350 మంది ఆవాసం ఉండేందుకు అవకాశం ఉంది. ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసు పత్రి వద్ద ఆదిలాబాద్ పట్టణ సమాఖ్య నిర్వహిస్తున్న కేంద్రంలో 100 మంది, హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి కేంద్రంలో 118 మంది, బేగంపేట కంట్రీక్లబ్ వద్ద గల కేంద్రంలో 130 మంది, కోఠి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సెంటర్లో 100 మంది నిరాశ్రయులు ఉండేందుకు వీలుగా నైట్ షెల్టర్లు ఉన్నాయి. మిగతా అన్ని చోట్లా 15 నుంచి అత్యధికంగా 77 మంది నిరాశ్రయులు మాత్రమే రాత్రి వేళల్లో ఉండేందుకు ఏర్పాట్లు ఉన్నా యి. మెప్మా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి, ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ఈ కేంద్రాల్లో చేర్చాల్సి ఉన్నప్పటికీ.. ఈ తర హా కసరత్తు సరిగా జరగడం లేదనే ఫిర్యాదులున్నాయి. ఉన్న కొన్ని షెల్టర్లలో ప్రజలు పూర్తిస్థాయిలో తలదాచుకునే పరిస్థితులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి. నిధుల్లేవు.. వసతుల్లేవు.. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, ఆదిలాబాద్ వంటి చోట్ల మెప్మా పర్యవేక్షణ లోపంతో షెల్టర్లలో ఉన్న వారికి మౌలిక వసతుల కల్పన జరగడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల నిర్వహణకు అవసరమైన సొమ్ము అందడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. వరంగల్‌లోని రెండు సెంటర్లలో ఒక సమయంలో 233 మంది నిరాశ్రయులకు నైట్‌షెల్టర్లు ఆశ్రయం కల్పించాయి. అయితే నెలకు రూ.33 వేల చొప్పున చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులను మెప్మా నుంచి అందలేదు. దీంతో నిర్వహణ గాడితప్పింది. రామగుండంలో ఒక్కో షెల్టర్‌లో 50 మంది వరకు ఉండే వీలున్నా, 10 మంది కూడా ఉండడం లేదు. వాస్తవానికి గోదావరి ఖని, రామగుండం ప్రాంతాల్లో రోడ్లపక్కన చలికి గజగజ వణుకుతూ పడుకునేవారు కోకొల్లలు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వీరిసంఖ్య వేలల్లోనే ఉండే అవకాశం ఉండగా..వివిధ కారణాల రీత్యా ప్రస్తుతం నైట్‌షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నవారు కేవలం 1,500 మంది వరకు మాత్రమే ఉండటం శోచనీయం. అనా«థలకు నీడనిస్తున్న ఈ సెంటర్ల విషయంలో మెప్మా మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అసలే చలికాలం.. రాత్రి గజగజ వణకడమే.. మరి వారి సంగతేంటి?
ఇలాంటి అభాగ్యులెందరో.. ఈ ఫొటోను ఒక ఫౌండేషన్ వారు పోలీసులకు ట్విట్టర్లో షేర్ చేయగా, స్పందించిన మంత్రి కేటీఆర్ కూకట్పల్లి జోనల్ అధికారులను ఆదేశించడంతో.. ఫతేనగర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఈమెను షెల్టర్‌హోమ్‌కు తరలించారు. ఇలా ఏ నీడా లేకుండా ఉంటున్నవారు నగరంలో వందలు, వేలసంఖ్యలో ఉన్నారు. మంత్రిలాంటి వారి ఆదేశాలకు స్పందించిన అధికారులు.. అసలు ఇలాంటి వారెందరున్నారో సర్వే చేస్తే ఎక్కువ మందికి ఉపయోగం ఉంటుంది. అడపాదడపా చేసే సర్వేల్లోనూ చాలా తక్కువమంది మాత్రమే లెక్కల్లో ఉంటారు. కారణాలేమిటో తెలియదు. ఉన్న షెల్టర్హోమ్లనైనా అవసరమైన వారు అందరూ ఉపయోగించుకునందుకు జీహెచ్ఎంసీ నుంచి జరిగిన ప్రయత్నాలు లేవు. ప్రతి చలికాలంలో ఒక మొక్కుబడి కార్యక్రమంగా మాత్రమే స్పందిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: అసలే శీతాకాలం.. రాత్రి వేళ చలి గజగజ వణికించే కాలం.. నగరంలో ఇప్పుడు ఎక్క డ చూసినా.. చలికి గిజగిజలాడుతున్న దేహాలు.. చిక్కి శల్యమైన శరీరాలు.. రోడ్ల మధ్య డివైడర్లపై, ఫుట్‌పాత్‌లతోపాటు ఎక్కడ పడితే అక్కడ విసిరేసినట్లు కనిపిస్తుంటాయి. చలి గాలులకు తట్టుకోలేక, మంచుకత్తులనెదుర్కొనేందుకు ఉన్న శక్తినంతా ముడుచుకోవడానికే వినియోగిస్తాయి. అయినా సంబంధిత యంత్రాంగానికి ఈ దృశ్యాలు కనిపించవు. గ్రేటర్ జనాభాకు అనుగుణంగా సుమారు 200 షెల్టర్‌హోమ్స్ ఏర్పాటు చేయాలి. చదవండి: వృద్ధురాలిపై పైశాచికం: మద్యం తాగించి.. లైంగిక దాడికి పాల్పడి.. కానీ.. 13 శాశ్వత, 5 తాత్కాలిక షెల్టర్ హోమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి సైతం అంకెల్లో చెప్పుకోవడానికి తప్ప వాటిలో ఉంటున్నది కొందరే. ఒకప్పుడు నైట్ షెల్టర్లుగా వ్యవహరించిన వీటిని కరోనా అనంతరం షెల్టర్ హోమ్స్‌గా పరిగణిస్తున్నారు. రాత్రివేళల్లోనే కాకుండా ఏ నీడా లేనివారికి రక్షణనిచ్చే షెల్టర్హోమ్స్గా వీటిని చెబుతున్నారు. అన్ని హోమ్‌లలో కలిపి 960 మందికి వసతి సదుపాయం ఉండగా.. ప్రస్తుతం 323 మంది ఉన్నారు. ఎందుకిలా..? ఠిఫుట్పాత్లపైనే రోజులు వెళ్లదీస్తున్నవారికి షెల్టర్‌హోమ్స్ ఉన్నట్లు తెలియదు. పైనుంచి ఆదేశాలందితే కానీ.. రోడ్లపై ఉన్నవారిని హోమ్స్‌లోకి బల్దియా యంత్రాంగం తరలించదు. ఇది ఓవైపు దృశ్యమైతే.. ఇలాంటివారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉండేదని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వంశీ పేర్కొన్నారు. వీటిని ఏర్పాటు చేసిన ప్రాంతాలకు చాలామంది వెళ్లలేకపోవడంతో అవి పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. చదవండి: ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె ఇదే తంతు.. ప్రభుత్వ ఉన్నతస్థాయిలోనూ ఇదే పరిస్థితి. నగరంలో షెల్టర్లు లేనివారికి ఆసరా కల్పించాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు. షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్‌లెస్ (ఎస్‌యూహెచ్) ఏర్పాటు చేయాలని, వాటిల్లో తగిన సదుపాయాలుండాలని ఆదేశించారు. దాంతోపాటు వాటి గురించి తగినంత ప్రచారం చేయాలని, అందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. గత అనుభవాలతో కాబోలు అలాంటి వారు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, వాటిని హాట్‌స్పాట్స్‌గా పరిగణించి వారంలో రెండు పర్యాయాలు సర్వే నిర్వహించి, గుర్తించిన వారిని షెల్టర్హోమ్స్లోకి తరలించాలని, గుర్తించిన వారి వివరాలతో డేటాబేస్ నిర్వహించాలని సూచించారు. నైట్ షెల్టర్లున్న ప్రాంతాలివే.. ఉప్పల్ మార్కెట్, సరూర్‌నగర్, పేట్లబుర్జు, శివరాంపల్లి, టప్పాచబుత్రా, గోల్నాక, బేగంపేట ఫ్లై ఓవర్, యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, ఆర్కేపురం బ్రిడ్జి, బౌద్ధనగర్, మహవీర్ హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, కోఠి మెటర్నిటీ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్, సయోధ్య ఇనిస్టిట్యూట్. ఎవరైనా కనిపిస్తే తీసుకొస్తాం.. కొందరు ఒక్కరోజు రాత్రి మాత్రమే ఉంటారు. ఉపాధి కోసం వచ్చేవారు రెండు మూడు నెలలు సైతం ఉంటారు. ఎవరు ఎన్ని రోజులనేది చెప్పలేం. కచ్చితంగా అవసరమైన వారు మాత్రం ఉంటారు. వారంతట వారే వచ్చేవారితోపాటు సమీపంలోని రైల్వేస్టేషన్లు, తదితర ప్రాంతాల్లో ఎవరైనా కనిపిస్తే.. షెల్టర్‌హోమ్‌కు రప్పిస్తాం. – విష్ణుసాగర్, శేరిలింగంపల్లి షెల్టర్‌హోమ్ మేనేజర్ -
షెల్టర్ ప్లీజ్!
సాక్షి,సిటీబ్యూరో: ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన చలి నగర ప్రజలను గజగజలాడిస్తోంది. సిటీలో ఉష్ణోగ్రతలు సైతం 10 డిగ్రీల కంటే తగ్గిపోవడంతో నిరాశ్రయుల పరిస్థితి దయనీయంగా మారింది. తల దాచుకునేందుకు నీడ లేక.. కప్పుకొనేందుకు సరైన దుప్పట్లు లేక రోడ్డు పక్కన, దుకాణాల అరుగులపై దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. నగరంలో తగినన్ని నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్న జీహెచ్ఎంసీ ప్రకటనలు ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జీహెచ్ఎంసీలో దాదాపు 200 నైట్ షెల్టర్లు అవసరముంది. కానీ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్నది 12 షెల్టర్లు మాత్రమే. వాటిలో పరిస్థితుల çసంగతెలా ఉన్నా.. కనీస ఆశ్రయం లేక వేలాదిమంది రోడ్ల పక్కన, డివైడర్ల మీద, మూసివేసిన దుకాణాల షట్టర్ల వద్ద చలితో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లోని రోగులకు సహాయకులుగా వచ్చినవారు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, తదితర ప్రాంతాల్లో ఇలాంటి వారు అధికసంఖ్యలో ఉన్నారు. పటిపూట సైతం తీవ్ర చలి ఉండగా, రాత్రుళ్లు మరింత పెరుగుతుండడంతో వారు అల్లాడుతున్నారు. అమలుకు నోచుకోని హామీలు గ్రేటర్లో నైట్‌షెల్టర్ల సంఖ్యను పెంచుతామని నాలుగేళ్లుగా జీహెచ్ఎంసీ చెబుతున్నా నేటికీ అమలు చేయలేదు. విశ్వనగరం పేరిట ఫ్లై ఓవర్లు వంటివి త్వరితంగా పూర్తి చేసేందుకు శ్రద్ధ చూపుతున్న యంత్రాంగం.. అనాథలు, దీనులు, హీనులకు, ఆస్పత్రి అవసరాల కోసం వచ్చిన వారికి నీడనిచ్చే నైట్ షెల్టర్లపై శ్రద్ధ చూపడం లేదు. మరోవైపు ఉన్న నైట్ షెల్టర్లనూ తగిన సదుపాయాలు లేక వాటిని వినియోగించుకునే వారు అతి తక్కువగా ఉంటున్నారు. ఉన్న షెల్టర్లలో కనీస సదుపాయాలు లేకపోవడం.. అవి అవరనానికి దూరంగా, ఎవరికీ తెలియని ప్రాంతాల్లో ఉండడంతో అక్కడకు వెళ్లి ఉండేవారు కూడా తగ్గిపోతున్నారు. పైగా ఆయా షెల్టర్లలో తగిన పడకలు, తాగునీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు ఉండాలి. వీటితోపాటు లాకర్ల సదుపాయి, రాత్రిపూట రూ.5 భోజనం వంటి సదుపాయాలుండాలి. కానీ ఇవేవీ లేక పోవడంతో చాలా తక్కువ మంది మాత్రమే వీటిని వినియోగించుకుంటున్నారు. ఎక్కువమంది ఆస్పత్రుల పరిసరాల్లోనే ఎముకలు కొరికే చలిలో కాలం వెళ్లదీస్తున్నారు. తూతూమంత్రపు సర్వేలు నిరాశ్రయులను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు గతేడాది సర్వేలో చేపట్టారు. అందులో నగరంలో కేవలం 1491 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు నాలుగేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో 3,500 మంది ఉండగా, ఆ సంఖ్య çసగం కంటే తగ్గిపోయింది. కోటిమంది జనాభా ఉన్న నగరంలో ఇంత తక్కువ మంది నిరాశ్రయులు ఉండడాన్ని విశ్వసించని కేంద్ర బృందం మరోమారు సర్వే చేయాల్సిందిగా ఆదేశించి ఏడాదిన్నర దాటినా ఇప్పటి దాకా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గ్రేటర్ అధికారుకుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. నగరంలోని నైట్‌షెల్టర్లు.. బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి వద్ద నైట్ షెల్టర్ కాక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ఎన్జీఓల నిర్వహణలో 12 షెల్టర్లున్నాయి. వాటిలో 380 మందికి వసతికి సదుపాయం ఉన్నట్లు చెబుతున్నా 200 మంది కూడా ఉండడం లేదు. ఎక్కువ మంది తమ అవసరాల కోసం వచ్చిన ప్రాంతాల్లోనే చలిలో గడుపుతున్నారు. ఎక్కువ మంది ఆస్పత్రుల వద్ద ఉంటున్నట్లు నాలుగేళ్లక్రితం సర్వేలో గుర్తించిన అధికారులు ఆయా ప్రదేశాల్లో నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కోఠి ప్రసూతి, ఈఎన్టీ, ఉస్మానియా, నిలోఫర్, గాంధీ, పేట్లబుర్జు, మహావీర్ ఆస్పత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. గాంధీ ఆస్పత్రి వద్ద స్థలం ఇచ్చేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. మిగతా ఆస్పత్రుల్లో మహావీర్, నిలోఫర్ వద్ద మాత్రం పూర్తికాగా, ఉస్మానియా, నిమ్స్, కోఠి ఈఎన్టీ ఆస్పత్రుల వద్ద త్వరలో పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ అదికారులు చెబుతున్నారు. నగరంలో నైట్ షెల్టర్లు ఉన్న ప్రాంతాలు,వాటి సామర్థ్యం ఇలా.. ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద 25 సరూర్‌నగర్ చౌడీ బిల్డింగ్ 20 పేట్లబుర్జు వార్డు కార్యాలయం 30 శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీ 20 టప్పాచబుత్ర అంబేద్కర్‌నగర్ కమ్యూనిటీహాల్ 50 గోల్నాక కమలానగర్ కమ్యూనిటీహాల్ 40 యూసుఫ్‌గూడ వార్డు కార్యాలయం 25 బేగంపేట ఫ్లై ఓవర్ కింద 45 శేరిలింగంపల్లి పాత మున్సిపల్ ఆఫీస్ 25 ఆర్కేపురం బ్రిడ్జి కింద 20 సికింద్రాబాద్ నామాలగుండు 30 బేగంపేట ఫ్లై ఓవర్ కింద (బ్రాహ్మణవాడి) 50 (ఉప్పల్, సరూర్‌నగర్, గోల్నాక, నామాలగుండు ప్రాంతాల్లో మహిళలకు కేటాయించగా, మిగతావి పురుషులకు కేటాయించారు) -
ఆదమరిచి నిద్రిస్తున్న కూలీలపైకి.
-
ఆదమరిచి నిద్రిస్తున్న కూలీలపైకి..
-
ఆదమరిచి నిద్రిస్తున్న కూలీలపైకి..
లక్నోలో కారు బీభత్సం లక్నో: నైట్ షెల్టర్‌లో ఆదమరిచి నిద్రిస్తున్న నిరుపేద కార్మికులపైకి ఓ కారు దూసుకుపోయింది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన ఓ వ్యక్తి నలుగురు కూలీల ప్రాణాలను బలిగొన్నాడు. పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. లక్నో దలిబాఘ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిందితుడైన వ్యక్తి హ్యుండయ్ ఐ-20 కారు అతివేగంగా నడుపుతూ.. అదుపుతప్పి నైట్ షెల్టర్‌లోకి దూసుకుపోయాడు. ఆ సమయంలో షెల్టర్‌లో 35మంది కూలీల వరకు నిద్రిస్తున్నారు. తూర్పు యూపీకి చెందిన నిరుపేద దినసరి కూలీలు నలుగురు ఈ ఘటనలో ప్రాణాలు విడిచారు. మద్యం మత్తులో జోగుతున్న ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్నారు. వారిలో ఒకడు స్థానిక రాజకీయ నాయకుడి కొడుకు అని తెలుస్తోంది. అతివేగంగా ర్యాష్‌గా నడుపడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు చెప్తున్నారు. కారులోని ఇద్దరు వ్యక్తులను వారు అదుపులోకి తీసుకున్నారు. -
చిరుత వచ్చేస్తోంది..
రెండు నెలల్లో వీవీకేలోకి రానున్న పులి రూ.10 లక్షలతో నైట్ షల్టర్ నిర్మాణం పూర్తయిన ఎన్‌క్లోజర్ టెండర్లు చిరుత రాకకు డీఎఫ్ఓ ప్రత్యేక చొరవ హన్మకొండ అర్బన్ : జిల్లాలోని అటవీ ప్రాంతంలో పూర్తిగా కనుమరుగైన చిరుతపులిని త్వరలో నగరంలోని జూ పార్క్(వీవీకే)లో చూసే అవకాశం కలుగనుంది. ఇందుకోసం జిల్లా అటవీ శాఖ వన్యప్రాణి విభాగం తీవ్ర కసరత్తు చేస్తోంది. దసరా నాటికి వీవీకేలో చిరుత గాండ్రింపు వినబడుతుందని అధికారులు అంటున్నారు. నైట్షల్టర్ నిర్మాణం పూర్తి... వన విజ్ఞాన కేంద్రంలో చిరుత నివాసానికి అవసరమైన నైట్‌షెల్టర్(డోమ్)ను ఇప్పటికే రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఎన్‌క్లోజర్ ఏర్పాటుకు కూడా టెండర్లు పూర్తయ్యాయి. దీని నిర్మాణ వ్యయాన్ని రూ.19 లక్షలుగా అధికారులు నిర్ణయించగా, ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ రూ.18 లక్షలకు టెండర్ వేసింది. రూ.లక్ష లెస్‌కు టెండర్ దాఖలు కావడంతో ప్రభుత్వం ఆ సంస్థకే పనులు అప్పగించింది. చిరుతను తీసుకొచ్చే విషయంలో ఇంతకాలం వెనుకాడిన అధికారులు.. ఎట్టకేలకు ఎన్‌క్లోజర్ కోసం టెండర్లు పిలవడంతో ప్రక్రియ తుది దశకు వచ్చిందనే చెప్పాలి. నెహ్రూపార్క్ నుంచి వరంగల్‌కు.. దక్షిణ భారత దేశంలో అతిపెద్దదైన హైదరాబాద్‌లోని నెహ్రూ జువలాజికల్ పార్క్ నుంచి చిరుతను వీవీకేకు తీసకురానున్నారు. ఈ దిశగా పనులు పూర్తయ్యాయి. ఎన్‌క్లోజర్ ఏర్పాటు కాగానే చిరుత రానుంది. ఇందుకవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. చిరుత 20 నుంచి 30 పీట్లు ఎగిరేలా స్థలం కేటాయించారు. జూపార్క్ వెనుక పద్మాక్షి గుట్ట సమీపంలోని ఖాళీ స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించడంతో భూ సమస్య కూడా తీరినట్లయింది. పనులు సాఫీగా సాగితే మరో రెండు నెలల్లో వీవీకేలో చిరుత దర్శనమివ్వనుంది. బడ్జెటే ‘పెద్ద’ సమస్య వీవీకేకు పెద్ద జంతువులను తీసుకొచ్చేందుకు గతంలో స్థలం సమస్య ఉండేది. ప్రభుత్వం భూమి ఇస్తున్నందున ఆ సమస్య తీరింది. తెల్లపులి, పెద్దపులిని కూడా ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎన్‌క్లోజర్స్ ఏర్పాటు భారీ ఖర్చుతో కూడుకున్నది. లక్షల రూపాయల వ్యయం అవుతుంది. అందుకే ప్రస్తుతం చిరుతపులి కోసం పనులు వేగవంతం చేశాం. వన్యప్రాణి సప్తాహం నాటికి జూలో చిరుతను ఉంచాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నాం. – పురుషోత్తం, వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓ leopard, Wild Life, night Shelter -
సిద్ధిపేటలో నైట్‌షెల్టర్ ప్రారంభం
సిద్దిపేట (మెదక్): తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ప్రక్రియగా మెదక్ జిల్లా సిద్ధిపేట పట్టణంలో నిర్వాసితులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక రాత్రి బస కేంద్రాన్ని (నైట్ షెల్టర్) ఏర్పాటు చేశారు. పట్టణంలోని నాసర్‌పురా వీధిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రెండోది కావడం విశేషం. తల్లిదండ్రుల లాలనకు దూరమై మానసిక అంగవైకల్యంతో అనాథలుగా ముద్రపడిన చిన్నారులతోపాటు, వృద్ధులు, వికలాంగులు, యాచకులకు వసతి కల్పిస్తూ అన్నీ తామై ఆవాస కేంద్రంలో చోటు అందించడానికి ఇక్కడి మున్సిపాలిటీ ముందుకు వచ్చింది. ఉచిత భోజన వసతితోపాటు వారికి అవసరమైన వైద్య సదుపాయాలను మున్సిపల్ పర్యవేక్షణలో అందించనున్నారు. హైదరాబాద్ వంటి మహానగరంలో పెద్ద ఎత్తున నైట్ సెంటర్‌కు మంచి స్పందన రావడంతో మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు సిద్దిపేటలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. -
చలి... సమస్యల కౌగిలి!
ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు మృగ్యం దృష్టి పెట్టని యంత్రాంగం కప్పుకోవడానికి దుప్పట్లూ కరువే మంచాలపై సర్దుకుంటున్న రోగులు నైట్షెల్టర్లలోనూ ఇదే దుస్థితి ఓ వైపు ఎముకలు కొరికేస్తున్న చలి... మరోవైపు మూకుమ్మడిగా దోమల దాడి... కప్పుకోవడానికి దుప్పట్ల కరువు. పోనీ పరుపులైనా బాగుంటాయనుకుంటే... భరించలేని దుర్వాసన... రాత్రివేళల్లో కంటిపై నిద్ర కరువు... ఇవీ మహానగరంలోని పేరు గొప్ప ఆస్పత్రుల్లో రోగుల కష్టాలు. పెద్ద మొత్తంలో నిధులు మూలుగుతున్నా రోగులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న దిశగా యంత్రాంగం ఆలోచించడం లేదు. ఇక రోగులకు సహాయంగా వచ్చేవారి పరిస్థితి చెప్పక్కరలేదు. బాధితులకు నయమయ్యే లోపు సహాయకులు మంచాన పడే దుస్థితి తలెత్తుతోంది. సిటీబ్యూరో గ్రేటర్‌పై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులకు తోడు మంచు ప్రభావంతో నగర ప్రజలు గజగజ వణుకుతున్నారు. ముఖ్యంగా వివిధ అనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారి అవస్థలు వర్ణనాతీతం. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో చలిగాలులు... కనీసం కప్పుకునేందుకు దుప్పట్లు కూడా లేకపోవ డంతో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి, పేట్లబురుజు, నిమ్స్, ఫీవర్, ఈఎన్టీ, ఛాతి, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, మాన సిక చికిత్సాలయాల్లో చికిత్స పొందుతున్న వృద్ధులు, శిశువులు, బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు విలవిల్లాడుతున్నారు. అసలే అనారోగ్యం.. ఆపై దుప్పట్లు లేకపోవడంతో వారు నరకం చూస్తున్నారు. పడుకునేందుకు ఎక్కడా సరైన పడకలు లేవు. ఒకటీ, అరా ఉన్నా చిరిగి.. మాసిపోయి...ఇబ్బందికరంగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఒకే మంచాన్ని ఇద్దరు ముగ్గురు పంచుకోక తప్పని పరిస్థితి. ఓ వైపు ఎముకలు కొరికే చలి.. మరో వైపు వార్డుల్లో డెంగీ, మలేరియా దోమల స్వైర విహారంతో తట్టుకోలేక పోతున్నారు. ఆస్పత్రుల ఆవరణలో ఏర్పాటు చేసిన నైట్షెల్టర్స్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో రోగులసహాయకులు జాగారం చేయాల్సి వస్తోంది. బీరువాల్లోనే... ప్రతిష్ఠాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి, చిరిగిపోయిన పరుపులే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గత్యంతరం లేక వీటిని కప్పుకున్న రోగులకు ఇన్ఫెక్షన్ సోకుతోంది. గాంధీలో రోగులకు సరిపడే స్థాయిలో దుప్పట్లు ఉన్నప్పటికీ..వాటిని రోగులకు ఇవ్వకుండా బీరువాల్లోనే భద్రపరుస్తున్నారు. దీంతో అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారు సొంతంగా వీటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. పొరపాటున ఎవరైనా దుప్పటి తెచ్చుకోకపోతే రాత్రంగా చలికి వణకాల్సిందే. ఇక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో పడుకునేందుకు మంచాలే కాదు, రాత్రి చలేస్తే కప్పుకునేందుకు దుప్పట్లు కూడా లేకపోవడంతో శిశువులు గజగజ వ ణికుతున్నారు. సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలు, గర్భిణుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. వీరిని పట్టించుకునే నాథుడే లేరు. -
ఎయిమ్స్‌లో నైట్‌షెల్టర్లు
న్యూఢిల్లీ : చలికాలంలో నగరంలోని వివిధ ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నగరంలో అత్యంత ప్రముఖమైన ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్(ఎఐఐఎంఎస్)కు రోగుల తాకిడి అత్యధికంగా ఉంటుంది. కొందరికి ఆస్పత్రిలో బెడ్స్ దొరకవు. చలికాలంలో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నైట్‌షెల్టర్లను ఎయిమ్స్ ఏర్పాటు చేస్తోంది. దంతవైద్యశాల ప్రాంగణంలో మరో 40 నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటి తృమా సెంటర్లో సీఆర్పీఎఫ్తో కలిసి 160 నైట్ షెల్టర్లను నిర్వహిస్తోంది. చలి తీవ్రత కారణంగా మరిన్ని షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు ఎయిమ్స్ అధికారులు పేర్కొన్నారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి పరిధిలో 500 బెడ్ల సౌకర్యం ఉన్న షెల్టర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎయిమ్స్ డెరైక్టర్ ఎంసీ మిశ్రా చెప్పారు. నగరంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. ఇంకా రోగులు, వారి బంధువులకు మరిన్ని షెల్టర్ల అవసరం ఉన్నదని ఆయన అన్నారు. మరో 200 బెడ్ సౌకర్యంతో కూడిన నైట్ షెల్టర్లను నిర్మిస్తున్నామని, 2015 వరకు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి ఇందుకు అవసరమైన రూ. 29 కోట్ల తీసుకొన్నట్లు చెప్పారు. ఎయిమ్స్ సెప్టెంబర్ 25, 1956లో ఏర్పాటైంది. ప్రస్తుతం రోజూ 10,000 మంది పేషంట్లు ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వీరికి అనుగుణంగా సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఎంతో దూరం నుంచి వచ్చే రోగులు, వైద్యపరీక్షల నిమిత్తం వచ్చే వారికి ఇబ్బందులు పడకుండా నైట్‌షెల్టర్లు దోహదపడుతాయని చెప్పారు. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోందని, ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు రాజధానిలో రెసిడెన్సియల్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆ మేరకు సరాసరి అక్కడకు వెళ్లి వైద్యసేవలు అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా 22 శాతం రోగులు ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి ఎయిమ్స్ వస్తుంటారని, మరో 40 శాతం మధ్యప్రదేశ్, ఒడిశ్సా రాష్ట్రాల నుంచి వస్తున్నారని చెప్పారు. ఆస్పత్రి వెలుపల రెస్డెన్సియల్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఎయిమ్స్‌లో ప్రస్తుతం 2,200 బెడ్స్ సౌకర్యం మాత్రమే ఉన్నదని అన్నారు. -
సమృద్ధిగా నీరు - పరిశుభ్రత
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరంలో నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన రాత్రి శిబిరాలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనలను చేసేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఈ నెల 15 నుంచి పనిచేయడం ప్రారంభించింది. నగరంలోని అన్ని నైట్ షెల్టర్లకు ప్రతిరోజు 800 లీటర్ల నీటిని సరఫరా చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీ జలబోర్డును బుధవారం ఆదేశించారు. డిసెంబర్, జనవరి నెలల్లో ప్రభుత్వ కార్యదర్శులు, సీనియర్ అధికారులు తరచు గా ఈ నైట్‌షెల్టర్లను తనిఖీ చేయాలని కూడా ఆయన సూచించారు. నగరంలో నైట్‌షెల్టర్ల స్థితిగతులపై లెప్టినెంట్ గవర్నర్ బుధవారం సమీక్షా సమావేశం జరి పారు. నైట్ షెల్టర్లలో పారిశుధ్య నిర్వహణకు సిబ్బం దిని రెట్టింపు చేయాలని ఎల్జీ డీయూఎస్ఐబీని ఆదేశిం చారు. డాక్టర్లు, మొబైల్ క్లినిక్‌లు నైట్‌షెల్టర్లను సందర్శిస్తున్నది లేనిదీ తనిఖీ చేయాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రస్తుతం 130 నైట్షెల్టర్లకు డీజేబీ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తోంది. మరో 79 శిబిరాలకు పైప్‌లైన్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 219 నైట్‌షెల్టర్లు ఉన్నాయి. శాశ్వత నిర్మాణాలు, పోర్టా కేబిన్లు, టెంట్లు, కమ్యూనిటీ హాళ్ళలో నడుస్తోన్న ఈ షెల్టర్లలో 15,000 మంది తలదాచుకునే వీలుంది. అయితే నగరంలో చలి తీవ్రంగా ఉన్నప్పటికీ కొన్ని నైట్ షెల్టర్లలో ఉండడానికి నిరాశ్రయులు ఇష్టపడటం లేదు. నైట్ షెల్టర్ల కన్నా చలిలో నీలాకాశం కింద నిద్రించడాన్నే వారు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో నైట్‌షెల్టర్లలో ఏవైనా లోపాలుంటే ఎల్జీ లిజినింగ్ పోస్ట్‌కు తెలియచేయాలని నజీబ్‌జంగ్ కోరారు. 155355 టోల్ ఫ్రీ నంబరుకు గానీ, 23975555, 23976666, 23978888, 23994444 నంబర్లకు గానీ కాల్ చేయాలని చెప్పారు. లేదా లిజినింగ్పోస్ట్ఢిల్లీఎల్జీ డాట్‌ఇన్‌కు లాగైగానీ ఎల్జీజీసీడాట్ ఢిల్లీకి ఈ మెయిల్ పంపిగానీ తెలియచేయవచ్చు. -
కొత్తగా ఏడు నైట్ షెల్టర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు తోడుగా వచ్చిన వారికి ఆస్పత్రుల్లో గాని బయట గాని వసతులు లేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు రాత్రివేళల్లో కనీసం నిలువ నీడ లేక ఆస్పత్రి ఆవరణల్లోనూ, సమీపంలోని ఫుట్‌పాత్‌లు, పార్కులు, రోడ్డు డివైడర్ల పైనే కాలం గడుపుతున్నారు. కనీసం మరుగుదొడ్లు, స్నానాలు చేసేందుకు సైతం పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి కోసం నైట్ షెల్టర్ల ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఎంపిక చేసిన ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద రానున్న చలికాలం లోగా వాటిని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. గ తేడాది చలికాలంలో బాధితుల వేదనలు వర్ణిస్తూ ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నైట్ షెల్టర్ ఏర్పాటుకు అప్పట్లోనే చర్యలు తీసుకున్నారు. దాని వల్ల ప్రస్తుతం ఎందరికో మేలు జరుగుతోంది. మిగతా ఆస్పత్రుల వద్ద సైతం పేషెంట్లు.. వారికి తోడుగా వచ్చేవారు ఉండేందుకు నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. అనంతరం ఆయా ఆస్పత్రుల ఉన్నతాధికారులతో చర్చించి ఇందుకు వారిని ఒప్పించారు. త్వరగా ఆయా ఆస్పత్రుల వద్ద నైట్ షెల్టర్లు అందుబాటులోకి తెచ్చేందుకు నివేదిక రూపొందించాల్సిందిగా కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తూ టెండరు నోటిఫికేషన్ జారీ చేశారు. ఒక్కో ఆస్పత్రి వద్ద డిజైన్‌కు తక్కువలో రూ. 69 వేల వంతున ఏడు ఆస్పత్రులకు రూ.4.83 లక్షలకు కన్సల్టెన్సీ సేవలందించేందుకు ముందుకొచ్చిన సంస్థకు సదరు పనులను అప్పగించారు. సంస్థ నుంచి నివేదిక అందగానే నైట్ షెల్టర్ల పనులు ప్రారంభించనున్నారు. అమలుకు నోచని ‘సుప్రీం’ఆదేశాలు.. ఐదు లక్షల జనాభా దాటిన నగరాల్లో ఒక నైట్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆ లెక్కన నగరంలో దాదాపు వంద నైట్ షెల్టర్లు ఉండాలి. కాగా14 మాత్రమే ఏర్పాటు చేయగా వాటిలో 10 సక్రమంగా నడుస్తున్నాయి. పైగా నగరానికి దూరంగా ఏర్పాటు చేయడంతో వాటిని వినియోగించుకునే వారు లేక కొన్నింటిని మూసివేశారు. -
గర్భిణీలు, పాలిచ్చే తల్లులకే నైట్‌షెల్టర్లు
ఆరోగ్యంగా ఉన్న వారి కోసం కాదన్న హైకోర్టు న్యూఢిల్లీ: నైట్ షెల్టర్లను తమ శాశ్వత ఆవాసాలుగా ఏర్పరచుకున్న వారిపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాశ్రయులైన గర్భిణీలు, పాలిచ్చే తల్లులకే వాటిలో ఆశ్రయం కల్పించాలని, ఆరోగ్యంగా ఉన్న వారి కోసం కాదని స్పష్టం చేసింది. నైట్‌షెల్టర్లను శాశ్వత ఆవాసాలుగా మార్చుకొనేందుకు వాటిని నిర్మించలేదని పేర్కొంది. ‘‘ఢిల్లీకి వచ్చే ప్రతి వారికి శాశ్వత నివాసం కల్పించడం ఎలా సాధ్యం? వాటిపై మీకు గుత్తాధిపత్యం ఎలా ఉంటుంది? ఈ నివాసాలు నిరాశ్రయులైన గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు మాత్రమే’’ అని జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీలో వేల సంఖ్యలో నిరాశ్రయులున్నారని, కేవలం అవసరమైన వారికి మాత్రమే నైట్‌షెల్టర్లలో ఆశ్రయం కల్పిస్తామని తెలిపింది. అవసరం తీరిన వారు నైట్‌షెల్టర్లను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సదుపాయాలు కల్పించాలంటూ హైకోర్టు గతం లో ఇచ్చిన ఆదేశాలపై స్పష్టతనివ్వాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన అనేకులు సంవత్సరాలుగా ఈ నైట్‌షెల్టర్లలో నివాసం ఉంటున్నారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మోతియాఖాన్ నైట్‌షెల్టర్‌లో నివాసముంటున్న ప్రియా కాలే అంతకుముందు ఓ కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ శిబిరంలో అపరిశుభ్ర వాతావరణం కారణంగా తాను తన రెండు నెలల శిశువును కోల్పోయానని ఆమె పేర్కొన్నారు. నైట్ షెల్టర్లలో మెరుగైన జీవన, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆమె కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బస్సే నైట్ షెల్టర్
జీహెచ్ఎంసీ తాత్కాలిక ఏర్పాట్లు ముందుకొచ్చిన ఆర్టీసీ సాక్షి, సిటీబ్యూరో: రాత్రి వేళల్లో నిలువ నీడ లేకుండా రోడ్లపైన, ఫుట్‌పాత్‌లపైన , ఎక్కడ పడితే అక్కడ నిద్రిస్తున్న వారికి అవసరమైనన్ని నైట్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది జీహెచ్ఎంసీ. అవి అందుబాటులోకి వచ్చేలోగా ఆర్టీసీ బస్సులనే నైట్ షెల్టర్లుగా మార్చనుంది. ఇందుకు ఆర్టీసీ కూడా జీహెచ్ఎంసీతో చేతులు కలిపింది. తొలుత రెండు బస్సులను ఇందుకు వినియోగించేందుకు ఆర్టీసీ ఎండీ అంగీకరించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ‘ప్రజావాణి’ అనంతరం కమిషనర్ విలేకరులతో మాట్లాడారు. ఈ బస్సుల్లోని సీట్లను తొలగించి, వాటిల్లో నిద్రించే ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. వీలైనన్ని నైట్‌షెల్టర్లను... వీలైనంత త్వరితంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే శీతాకాలంలోగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ నిద్రించకుండా అవసరమైనన్ని నైట్ షెల్టర్లు అందుబాటులోకి తెస్తామన్నారు. బస్సులను బయట నిద్రిస్తున్నవారు అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి పంపుతామన్నారు. వీరి అవసరాల కోసం మొబైల్ టాయ్లెట్లను కూడా అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇంకా... బీటీ రెండో ఫేజ్ పనులకు రూ.12 కోట్లు మంజూరు చేశామని, బీటీ రోడ్లు, డీసిల్టింగ్ పనులకు సంబంధించి రెండు మూడు రోజుల్లో టెండర్లు పూర్తవుతాయని, వేసవిలోనే డీసిల్టింగ్ పనుల్ని పూర్తి చేస్తామని కమిషనర్ చెప్పారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండానే ఆస్తి పన్ను వసూళ్లు చేయాలనేది లక్ష్యమని, హెచ్చరించినా నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై మాత్రం చర్యలు తప్పవన్నారు. ఈ ఆర్థిక సంవత్సర వసూళ్ల లక్ష్యం రూ.1000 కోట్ల- రూ.1250 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.538 కోట్లు వసూలైందని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.70 కోట్లు అదనమన్నారు. ఆస్తిపన్ను చెల్లించినంత మాత్రాన అక్రమ భవనం సక్రమం కాదన్నారు. అక్రమ భవనాల ఆస్తి పన్నును అసెస్ చేసే అధికారులపై చర్యలు తగదని ప్రభుత్వానికి లేఖ రాశామని, దీనిపై స్పష్టతనిస్తూ ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేస్తుందన్నారు. రోడ్డు కటింగ్‌లకు అనుమతులివ్వడం లేదని తెలిపారు. కొత్తగా 20 ఫిర్యాదులు... ‘ప్రజావాణి’కి మొత్తం 47 ఫిర్యాదులు రాగా, వీటిల్లో 20 మాత్రమే కొత్తవి. మిగతావి పాత ఫిర్యాదులే. అవి పరిష్కారం కాకపోవడంతో ప్రజలు మళ్లీ ఫిర్యాదు చేశారు. కొత్త బడ్జెట్‌పై ఆందోళన వద్దు... ‘వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2014-15) సంబంధించిన బడ్జెట్ స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాల్లో ఇంకా ఆమోదం పొందకపోయినా ఆందోళన చెందాల్సిన పని లేదు. జీహెచ్ ఎంసీ చట్టంలో దీనిపై స్పష్టత లేదు. ఈ అంశంపై ప్రభుత్వానికి ఇప్పటికే రెండు లేఖలు రాశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం’ అని కమిషనర్ చెప్పారు. -
నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో నైట్ షెల్టర్ల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించేందుకు వెంటనే వంద బృందాలను నియమించాల్సిందిగా జీహెచ్ంఎసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ (సోమవారం) రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ బృందాలు రంగంలోకి దిగి, నిలువనీడలేక రోడ్లపైన, పార్కుల్లోనూ నిద్రిస్తున్న వారు ఏయే ప్రాంతాల్లో ఎక్కువమంది ఉన్నారో సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. సోమవారం యూసీడీ విభాగ కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీలైనన్ని నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు మూడు ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలుపగా.. ఎక్కువమంది ఉన్న ప్రాంతాల్లో నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు తగిన స్థలాల్ని, అందుబాటులో ఉన్న భవనాల్ని గుర్తించాల్సిందిగా సూచించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వెంటనే నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. భవనాలు అందుబాటులో ఉంటే వాటిలోనూ, బహిరంగ ప్రదేశాలుంటే అక్కడా కొత్తగా నిర్మిస్తామన్నారు. ప్రస్తుతానికి బేగంపేట ఫ్లై ఓవర్ దిగువన రెండు నైట్ షెల్టర్లు, బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద తాత్కాలిక నైట్‌షెల్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత నవంబర్‌లో నిలువనీడలేక చలికి గిజగిజలాడుతున్న వారి గురించి ‘సాక్షి’ లో వెలువడిన కథనంతో వెంటనే స్పందించిన కమిషనర్.. త్వరలోనే వీలైనన్ని నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. తాత్కాలిక షెల్టర్ ఏర్పాటుకు క్యాన్సర్ ఆస్పత్రి వారితో మాట్లాడారు. యువతకు ఉపాధి.. నిరుద్యోగ యువతకు ఆయా అంశాల్లో శిక్షణ ఇప్పించి వారి ఉపాధికి ఉపకరించే కార్యక్రమాలు చేపట్టేందుకు జోన్‌కొక ప్రత్యేక విభాగం(జీవనోపాధి) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జోనల్ కమిషనర్లకు సూచించారు. వాటి ద్వారా సర్కిల్‌కు వెయ్యిమందికి శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఇందుకు తగు స్థలాల్ని గుర్తించాలన్నారు. ఏయే అంశాల్లో శిక్షణనిచ్చేది ఈ నెల 18లోగా ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా సూచించారు. సమావేశంలో స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్ (యూసీడీ) జయరాజ్ కెన్నెడి, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
నైట్షెల్టర్లకు మంచిరోజులు
సాక్షి, సిటీబ్యూరో : నిర్వాసితులు రాత్రివేళల్లో తలదాచుకునేందుకు సదుపాయవంతమైన నైట్‌షెల్టర్లు అందుబాటులోకి రానున్నాయి. గ్రేటర్లో మూడేళ్ల కిందటి నుంచే నైట్‌షెల్టర్ల ఏర్పాటు ప్రారంభమైనప్పటికీ, ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. జీహెచ్ఎంసీలోని నైట్‌షెల్టర్ల పనితీరును సమీక్షించిన ప్రభుత్వం.. లోటుపాట్లను గుర్తించింది. నైట్‌షెల్టర్లను నిజంగా ఆశ్రయకేంద్రాలుగా మార్చేం దుకు తగు సూచనలతో మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్‌శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ప్రారంభించిన ఎన్యూఎల్ఎం (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్) మార్గదర్శకాల మేరకు గూడు లేని పట్టణ ప్రజల కోసం ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. నైట్‌షెల్టర్ల నిర్మాణానికయ్యే వ్యయంలో 75 శాతం సొమ్మును కేంద్రప్రభుత్వం ఇవ్వనుంది. ఈ స్కీంను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు.. నైట్‌షెల్టర్లలో నీరు, పారిశుధ్యం, భద్రత ఏర్పాట్లుండాలి రాత్రిపూట ఉండేందుకు స్థిరమైన, చాలినంత వసతి లేనివారితోపాటు వివిధ అవసరాల కోసం పట్ణణాలకు వచ్చి.. వసతి లేని వారు. వీధిబాలలు, అనాథలు, చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలు, తల్లిదండ్రుల్లేని బాలలు, హాస్పిటళ్లు, ైరె ల్వే స్టేషన్లు, బస్స్టేషన్ల సమీపంలో తలదాచుకునేవారు తదితరులు నైట్‌షెల్టర్లలో ఉండవచ్చు. ఒక్కో షెల్టర్‌లో 50- 100 మంది ఉండవచ్చు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా నైట్షెల్టర్లతోపాటు కుటుంబాల కోసం, ఒంటరి మహిళలు, వారి మీద ఆధారపడ్డ మైనర్పిల్లల కోసం, వృద్ధులు, అంగవికలురు, తదితరులకు సైతం వేర్వేరేగా షెల్టర్లు ఏర్పాటు చేయాలి. సర్వే చేసి నిరాశ్రయులను గుర్తించాలి. నైట్‌షెల్టర్లలో ఉండేవారికి గుర్తింపు కార్డులివ్వాలి. షెల్టర్లలో తాగడానికి, ఇతర అవసరాాలకు నీటితోపాటు చాలినన్ని టాయ్లెట్లు, బాత్రూంలు, ప్రథమచికిత్స కిట్లు, అవసరమైన వంటసామగ్రితోపాటు, పిల్లల రక్షణ ఏర్పాట్లు, ఎప్పటికప్పుడు దుప్పట్లను శుభ్రపరచడం.. ఇతరత్రా చర్యలు తీసుకోవాలి. మేనేజ్మెంట్ కమిటీలుండాలి. పిల్లలు సమీపంలోని పాఠశాలలకెళ్లే ఏర్పాట్లు. షెల్టర్లలోని వారి అర్హతలను బట్టి ఆయా ప్రభుత్వ పథకాలు, ఉపాధి పొందే ఏర్పాట్లు. నిర్వహణకు మేనేజర్, కేర్టేకర్లు తదితరులు. -
త్వరలో నైట్‌షెల్టర్ల ఏర్పాటు
సాక్షి, సిటీబ్యూరో : ఎముకలు కొరికే చలి రాత్రుల్లో నిరాశ్రయుల దుస్థితిని వెల్లడిస్తూ.. అలాంటి వారికోసం నైట్‌షెల్టర్ల అవసరాన్ని తెలియజేస్తూ శుక్రవారం ‘చలిపంజా’ శీర్షికన ‘సాక్షి’ వెలువరించిన కథనానికి జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పందించారు. ఆశ్రయం లేక.. రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్న ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఉంటున్నారో గుర్తించి వివరాలు అందజేయాల్సిందిగా కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు. నైట్‌షెల్టర్లు అవసరమైన ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన భవనాలు అందుబాటులో ఉన్నట్లయితే ఏర్పాట్లకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో భవనాలను గుర్తించడమో.. నిర్మించేందుకు అవకాశాలున్నాయేమో పరిశీలించాలన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, అదనపు కమిషనర్ (యూసీడీ) కెన్నడీతో కలిసి శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని సందర్శించారు. రాత్రి వేళలో రోగి సహాయకులు నిద్రించేందుకు అవసరమైన షెల్టర్ నిర్మాణం గురించి ఆస్పత్రి సీఈఓ ఆర్పీ సింగ్‌తో ఆయన చర్చించారు. షెల్టర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ అవసరమైన అనుమతులు ఇవ్వడం లేదని సింగ్.. కమిషనర్ దృష్టికి తెచ్చారు. తమ తరపున అవసరమైన సహాయం అందిస్తామని సోమేశ్‌కుమార్ హామీనిచ్చారు. అనంతరం ఆయన రోగులు, వారి సహాయకులతో సాధకబాధకాలపై చర్చించారు. అదే విధంగా మిగతా ఆస్పత్రుల వద్ద రోగి సహాయకులు, ఇతరత్రా నిరాశ్రయులు తలదాచుకునేందుకు, రాత్రి వేళల్లో సౌకర్యవంతంగా నిద్రించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కెన్నడీని సోమేశ్‌కుమార్ ఆదేశించారు. కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు నగరంలో నైట్‌షెల్టర్లు లేని వైనంపై వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, కార్పొరేటర్ సురేష్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు హరిగౌడ్ తదితరులు శుక్రవారం కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను కలిసి.. తలదాచుకునే చోటు లేని అభాగ్యుల కోసం వెంటనే వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్, వీలైనంత త్వరితంగా.. వీలైనన్ని ప్రాంతాల్లో నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దుప్పట్లు పంపిణీ చేసిన వైఎస్సార్సీపీ ఐటీవింగ్ రాత్రివేళల్లో చలికి వణికిపోతున్న అభాగ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీవిభాగం ఆపన్నహస్తం అందించింది. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘చలిపంజా’ కథనానికి చలించి బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఉన్న వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డితో పాటు హర్షవర్ధన్, సురేంద్ర, రాకేష్, మహేష్, శంకర్, ప్రసాద్, చంద్ర, ఆదిత్య, అరవింద్‌లు ఉన్నారు. -
చలి పంజా
=ఆశ్రయం కరువైన అభాగ్యులు = చలికి విలవిల =ప్రకటనలకే పరిమితమైన నైట్ షెల్టర్లు =పట్టనట్టుగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో : లాంటివారు పదులు.. వందలు కాదు.. వేలల్లోనే ఉన్నారు. ఎముకలు కొరికే చలిలో సైతం రోడ్డు పక్కన.. మూసివేసిన దుకాణాల ముందు.. బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లు.. ఆస్పత్రుల పరిసరాల్లో చలిని తట్టుకోలేక కడుపులో కాళ్లు ముడుచుకుంటూ అవస్థలు పడుతున్న వారెందరో. అనాథలు.. యాచకులు.. ఇతరత్రా ప్రజలందరిదీ ఇదే దుస్థితి. ఈ పరిస్థితి వల్ల ఆత్మగౌరవం దెబ్బతిని.. తీవ్ర నిరాశానిస్పృహల్లో కొట్టుకుపోకుండా ఉండేందుకు.. వారి గౌరవానికి భంగం కలుగ కుండా ఉండేందుకు.. వారికోసం నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిందిగా ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా వాటిని జీహెచ్ఎంసీ అమలు చేయడం లేదు. ఐదు లక్షల జనాభా దాటిన నగరాల్లో లక్షమందికి ఒకటి చొప్పున ఇలాంటి నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలి. ఆ లెక్కన నగరంలో 70కి పైగా నైట్షెల్టర్లుండాలి. కానీ ఇప్పటివరకు పది కూడా ఏర్పాటు కాలేదు. ఏర్పాటైనవి సైతం నిరాశ్రయులకు అందుబాటులో లేకుండా ఎక్కడెక్కడో ఉండటంతో తక్కువమంది మాత్రమే వాటిని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల అవసరాల కోసం వచ్చేవారిలో వందలాది మంది ఆయా ఆస్పత్రుల సమీపాల్లో కనిపిస్తున్నారు. అలాగే.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వంటి ప్రాంతాల్లో వీరి సంఖ్య ఎక్కువ. వీటిని దృష్టిలో పెట్టుకొని నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు పడుతున్న వారెందరో. గత సంవత్సరం ఇలాంటి వారి దుస్థితిపై ‘సాక్షి’లో వెలువడిన కథనంతో స్పందించిన జీహెచ్ఎంసీ వర్గాలు చెప్పుకోవడానికన్నట్లుగా ఆయా ఆస్పత్రులకు మొక్కుబడి లేఖలు రాశాయి. మీ ఆస్పత్రుల ప్రాంగణాల్లో మీరే నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలంటూ ఎల్వీప్రసాద్, సరోజినీదేవి కంటి ఆస్పత్రులు.. ఉస్మానియా, గాంధీ, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రులకు లేఖలు రాసి చేతులు దులుపుకొన్నాయి. నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను జీహెచ్ఎంసీ పూర్తిగా విస్మరించింది. జీహెచ్ ఎంసీయే వాటి ఏర్పాటుకు ముందుకొచ్చినట్లయితే.. అవసరమైన స్థలం ఇచ్చేందుకు ఆయా ఆస్పత్రులు ముందుకొచ్చేవేమో కానీ.. ఆ బాధ్యతను కూడా ఆస్పత్రులపైనే రుద్దడంతో ఏ ఆస్పత్రి కూడా సానుకూలంగా స్పందించలేదు. షరా మామూలుగానే.. షెల్టర్ లేని ప్రజలు తమ అవస్థలు తాము పడుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు చొరవ తీసుకొని .. బజార్లలోనే బతుకులీడుస్తున్న పేదలకు తగు భరోసా నివ్వాల్సి ఉంది. త్వరలో వినియోగంలోకి రానున్నవి... = సరూర్‌నగర్ కమ్యూనిటీహాల్, ఎల్బీ నగర్ = మల్లాపూర్, కాప్రా కాచిగూడ = ఆర్కేపురం కమ్యూనిటీ హాల్, మల్కాజిగిరి ప్రస్తుతమున్న నైట్‌షెల్టర్లు 1. బైబిల్‌హౌస్, సికింద్రాబాద్ 2. నామాలగుండు, సికింద్రాబాద్ (మహిళలు) 3. అంబేద్కర్‌నగర్, టప్పాచబుత్రా 4. పాత మునిసిపల్ కార్యాలయం, ఉప్పల్ (మహిళలు) 5. వార్డు కార్యాలయం, యూసుఫ్‌గూడ 6. గోల్నాక 7. హఫీజ్‌పేట 8. బలహీనవర్గాల కాలనీ, శివరాంపల్లి 9. పాత మునిసిపల్ కార్యాలయం, శేరిలింగంపల్లి