నైట్‌షెల్టర్లకు మంచిరోజులు | Night Shelter better days | Sakshi
Sakshi News home page

నైట్‌షెల్టర్లకు మంచిరోజులు

Published Sun, Dec 29 2013 5:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

Night Shelter better days

సాక్షి, సిటీబ్యూరో : నిర్వాసితులు రాత్రివేళల్లో తలదాచుకునేందుకు సదుపాయవంతమైన నైట్‌షెల్టర్లు అందుబాటులోకి రానున్నాయి. గ్రేటర్‌లో మూడేళ్ల కిందటి నుంచే నైట్‌షెల్టర్ల ఏర్పాటు ప్రారంభమైనప్పటికీ, ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. జీహెచ్‌ఎంసీలోని నైట్‌షెల్టర్ల పనితీరును సమీక్షించిన ప్రభుత్వం.. లోటుపాట్లను గుర్తించింది. నైట్‌షెల్టర్లను నిజంగా ఆశ్రయకేంద్రాలుగా మార్చేం దుకు తగు సూచనలతో మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్‌శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ప్రారంభించిన ఎన్‌యూఎల్‌ఎం (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్) మార్గదర్శకాల మేరకు గూడు లేని పట్టణ ప్రజల కోసం ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. నైట్‌షెల్టర్ల నిర్మాణానికయ్యే వ్యయంలో 75 శాతం సొమ్మును కేంద్రప్రభుత్వం ఇవ్వనుంది. ఈ స్కీంను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
 
 ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు..
 
 నైట్‌షెల్టర్లలో నీరు, పారిశుధ్యం, భద్రత ఏర్పాట్లుండాలి
 
  రాత్రిపూట ఉండేందుకు స్థిరమైన, చాలినంత వసతి లేనివారితోపాటు వివిధ అవసరాల కోసం పట్ణణాలకు వచ్చి.. వసతి లేని వారు. వీధిబాలలు, అనాథలు, చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలు, తల్లిదండ్రుల్లేని బాలలు, హాస్పిటళ్లు, ైరె ల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్ల సమీపంలో తలదాచుకునేవారు తదితరులు  నైట్‌షెల్టర్లలో ఉండవచ్చు.  
 
 ఒక్కో షెల్టర్‌లో 50- 100 మంది ఉండవచ్చు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా నైట్‌షెల్టర్లతోపాటు కుటుంబాల కోసం, ఒంటరి మహిళలు, వారి మీద ఆధారపడ్డ మైనర్‌పిల్లల కోసం, వృద్ధులు, అంగవికలురు, తదితరులకు సైతం వేర్వేరేగా షెల్టర్లు ఏర్పాటు చేయాలి.
 
 సర్వే చేసి నిరాశ్రయులను గుర్తించాలి. నైట్‌షెల్టర్లలో ఉండేవారికి గుర్తింపు కార్డులివ్వాలి.
 
 షెల్టర్లలో తాగడానికి, ఇతర అవసరాాలకు నీటితోపాటు చాలినన్ని టాయ్‌లెట్లు, బాత్‌రూంలు, ప్రథమచికిత్స కిట్లు, అవసరమైన వంటసామగ్రితోపాటు, పిల్లల రక్షణ ఏర్పాట్లు, ఎప్పటికప్పుడు దుప్పట్లను శుభ్రపరచడం.. ఇతరత్రా చర్యలు తీసుకోవాలి.
 
 మేనేజ్‌మెంట్ కమిటీలుండాలి.
 
 పిల్లలు సమీపంలోని పాఠశాలలకెళ్లే ఏర్పాట్లు.
 
 షెల్టర్లలోని వారి అర్హతలను బట్టి ఆయా ప్రభుత్వ పథకాలు, ఉపాధి పొందే ఏర్పాట్లు.
 
 నిర్వహణకు మేనేజర్, కేర్‌టేకర్లు తదితరులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement