సిద్దిపేట (మెదక్): తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ప్రక్రియగా మెదక్ జిల్లా సిద్ధిపేట పట్టణంలో నిర్వాసితులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక రాత్రి బస కేంద్రాన్ని (నైట్ షెల్టర్) ఏర్పాటు చేశారు. పట్టణంలోని నాసర్‌పురా వీధిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రెండోది కావడం విశేషం.
తల్లిదండ్రుల లాలనకు దూరమై మానసిక అంగవైకల్యంతో అనాథలుగా ముద్రపడిన చిన్నారులతోపాటు, వృద్ధులు, వికలాంగులు, యాచకులకు వసతి కల్పిస్తూ అన్నీ తామై ఆవాస కేంద్రంలో చోటు అందించడానికి ఇక్కడి మున్సిపాలిటీ ముందుకు వచ్చింది. ఉచిత భోజన వసతితోపాటు వారికి అవసరమైన వైద్య సదుపాయాలను మున్సిపల్ పర్యవేక్షణలో అందించనున్నారు. హైదరాబాద్ వంటి మహానగరంలో పెద్ద ఎత్తున నైట్ సెంటర్‌కు మంచి స్పందన రావడంతో మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు సిద్దిపేటలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
సిద్ధిపేటలో నైట్‌షెల్టర్ ప్రారంభం
Published Sun, May 10 2015 7:22 PM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement
Advertisement