'ముస్లిం మతవాదులను ఎందుకు ప్రశ్నించరు?' | Taslima Nasreen says India not intolerant, asks why secularists only target Hindu fundamentalists | Sakshi
Sakshi News home page

'ముస్లిం మతవాదులను ఎందుకు ప్రశ్నించరు?'

Published Sun, Feb 7 2016 12:50 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

'ముస్లిం మతవాదులను ఎందుకు ప్రశ్నించరు?'

'ముస్లిం మతవాదులను ఎందుకు ప్రశ్నించరు?'

కోజికోడ్: లౌకికవాదులు ఎప్పుడూ హిందూ మతవాదులనే ప్రశ్నిస్తారుగానీ.. ముస్లిం మతవాదులను ఎందుకు ప్రశ్నించరు అని వివాదాస్పద రచయిత్రి, మహిళా హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ అన్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఆశ్రయం పొందుతున్న ఆమె.. శనివారం కోజికోడ్లో జరుగుతున్న 'కేరళ లిటరేచర్ ఫెస్టివల్' కు హాజరయ్యారు.

ఇండియాలో అసహనం  ఉందని తాను భావించడంలేదన్న తస్లీమా ఇక్కడ ఒకరి నమ్మకాలపై మరొకరు సహనంతో వ్యవహరిస్తారని పేర్కొన్నారు. భారత చట్టాలు అసహనానికి మద్దతు పలకవని, అయినప్పటికీ ఇక్కడ అసహనానికి గురయ్యేవారి సంఖ్య తక్కువేమీకాదని అన్నారు. లౌకికవాదులు గా పేరుపొందినవారు కేవలం హిందూ మతవాదులనే ప్రశ్నించి ఊరుకుంటారని, ముస్లిం మతవాదుల జోలికి పోరని, ఇలాంటి బూటకపు లౌకికవాద ప్రజాస్వామ్యం ఎప్పటికీ నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదని తస్లీమా అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement