న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తూనే ఉంది. రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ తారలు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో తెలిపారు. సుమారుగా ఒక సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉన్న తనకు కోవిడ్ ఎలా వచ్చిందనే విషయం అర్థమవ్వడంలేదని ట్విటర్‌లో తెలిపింది. కరోనా నేపథ్యంలో ఇంట్లోకి ఇప్పటివరకు ఎవర్నీ రానివ్వలేదని అయినా తనకు కోవిడ్ సోకడం ఆశ్చర్యం కల్గిస్తోందని తస్లీమా పేర్కొన్నారు. తస్లీమా నస్రీన్ కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసును వేయించుకున్నారు.
i haven't stepped out of my home for more than a year. Didn't allow anyone to enter my home. i was alone with a cat. And then i caught covid-19. Wish i knew how i caught it. ☹️
— taslima nasreen (@taslimanasreen) May 9, 2021
చదవండి: కరోనాపై పోరుకు కొత్తవైద్యులు
Comments
Please login to add a commentAdd a comment