మళ్లీ ఇండియాకు తిరిగి వస్తా...
కోల్కతా: మళ్లీ భారత్కు తిరిగి వస్తానని, కొంతకాలం కోసమే అమెరికా వచ్చినట్లు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ తెలిపారు. బంగ్లాదేశ్ ఉగ్రవాదుల నుంచి తనకు ముప్పు ఉన్నందునే అమెరికా వచ్చినట్లు ఆమె చెప్పారు. బంగ్లాదేశ్కు చెందిన ఇస్లామిక్ అతివాదుల నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో తస్లీమా గత కొంతకాలంగా భారత్లో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తన మాకాన్ని ఢిల్లీ నుంచి అమెరికాకు మార్చారు.
తాను శాశ్వాతంగా ఇండియా నుంచి వెళ్లిపోలేదని, మళ్లీ వస్తానంటూ తస్లీమా తెలిపారు. భారత ప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తోందని, తాను ఆ దేశానికి కావాల్సిన వ్యక్తినని ఆమె అన్నారు. ఏడు నెలల పాటు ఆమె ఢిల్లీలోని ఓ అజ్ఞాత ప్రాంతంలో గడిపిన విషయం తెలిసిందే. కాగా తస్లీమాకు ప్రాణాపాయం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో న్యూయార్క్ అడ్వొకసీ గ్రూపు సెంటర్ ఫర్ ఎంక్వైరీ (సీఎఫ్‌ఐ) ఆమెకు భద్రత కల్పిస్తోంది. 'పెట్ కాట్ ఈజ్ వెయిటింగ్' అంటూ బుధవారం ఆమె ట్విట్ చేశారు.