ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు | Khatija Rahman Open Up About Her Life And Ar Rahman | Sakshi
Sakshi News home page

Khatija Rahman: ఆయన కూతురని తెలిసి పరిచయం పెంచుకునేవారు

Published Sat, Aug 31 2024 3:39 PM | Last Updated on Sat, Aug 31 2024 5:09 PM

Khatija Rahman Open Up About Her Life And Ar Rahman

సెలబ్రిటీల పిల్లలని చూస్తే.. వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ అని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా కష్టాలు ఉంటాయి. కాకపోతే అవి విచిత్రమైన కష్టాలు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూతురు కూడా తన గురించి, తండ్రి గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు బయటపెట్టింది. 'మిన్ మినీ' అనే తమిళ సినిమాతో రీసెంట్‌గా సంగీత దర్శకురాలిగా పరిచయమైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకుంది.

ఏఆర్‌ రెహమన్‌ కూతురు కావడంతోనే మీతో మాట్లాడుతున్నారా? లేదంటే నిజంగానే మీతో స్నేహం చేస్తున్నారా అనే ప్రశ్నకు బదులిచ్చిన ఖతీజా రెహమాన్.. చిన్నప్పటి నుంచి చాలామంది తనతో మాట్లాడేవారని, కొందరు మాత్రం ఏఆర్‌.రెహమన్‌ కూతురిననే పరిచయం పెంచుకునేవారని, ఆ తర్వాత వారి అవసరాల గురించి చెప్పేవారని, అదే తనకు చాలా కష్టంగా ఉండేదని చెప్పింది.

(ఇదీ చదవండి: తప్పు చేశా నాన్న.. ఏడ్చేసిన ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్‌)

ఇక రెహమాన్ ఫ్యామిలీ విషయానికొస్తే.. ఏఆర్ రెహమాన్ తండ్రి సంగీత కళాకారుడు. ఆయన స్ఫూర్తితోనే రెహమాన్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదట్లో పియానిస్ట్‌గా పనిచేశాడు. 'రోజా' మూవీతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆస్కార్‌ కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇకపోతే రెహమాన్ సోదరి రెహానా కూడా సంగీత దర్శకురాలే. రెహమాన్ కొడుకు ఏఆర్‌ అమీన్‌, సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కూతురు ఖతీజా సంగీత దర్శకురాలి అయిపోయింది. మిన్‌మినీ చిత్రానికి ఖతీజా సంగీతమందించింది. తాజాగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా, ఈమె పనితనాన్ని బాగానే మెచ్చుకుంటున్నారు.

(ఇదీ చదవండి: షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement