షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి | Actress Revathi Clarify Allegations Sajeer Photo Issue | Sakshi
Sakshi News home page

Revathi: నాకు ఎవరూ ఎలాంటి ఫొటోలు పంపలేదు

Published Sat, Aug 31 2024 2:58 PM | Last Updated on Sat, Aug 31 2024 3:18 PM

Actress Revathi Clarify Allegations Sajeer Photo Issue

ప్రముఖ నటి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రేవతి.. తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పుడు స్పందించింది. కొద్దిరోజుల క్రితం కోజికోడ్‌కు చెందిన సజీర్‌ (33), దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. సుమారు పదేళ్ల క్రితం తనపై దర్శకుడు రంజిత్‌ లైంగిక దాడికి పాల్పడ్డారని చెబుతూనే, రేవతి పేరును కూడా బయటపెట్టాడు. తన వ్యక్తిగత ఫోటోలు రేవతికి రంజిత్‌ పంపాడని అతడు ఆరోపించాడు. దీంతో ఈ వార్త పెను సంచలనంగా మారింది.

(ఇదీ చదవండి: ‘బిగ్ బాస్' కథ పెద్దదే... పురాతనమైంది కూడా!)

అవి నిజం కాదు 
సజీర్‌ చేసిన ఆరోపణలపై నటి రేవతి ఇప్పుడు స్పందించింది. దర్శకుడు రంజిత్.. యువకుడి నగ్న చిత్రాలని తనకు పంపారనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్‌లో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. మీడియాలో వస్తున్న వాటిలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే?
సినిమా అవకాశాల కోసం డైరెక్టర్‌ రంజిత్‌ని సంప్రదిస్తే ఒక హోటల్‌కు పిలిపించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సజీర్‌ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో నటి రేవతి పేరును తీసుకొచ్చాడు. 'దర్శకుడు రంజిత్ గదిలోకి నేను వెళ్లినప్పుడు ఆయన ఒక నటితో మాట్లాడుతున్నాడు. ఆ నటి రేవతి అని రంజిత్ నాకు చెప్పాడు. రేవతి, రంజిత్‌కి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. రంజిత్ నా ఫోటో తీసి వారికి పంపాడు. ఎవరికి పంపారు అని నేను అడిగాను. అప్పుడు రేవతికి పంపించానని దర్శకుడు రంజిత్ సమాధానమిచ్చాడు.  ఫొటో చూసి రేవతికి నచ్చిందని కూడా నాతో చెప్పాడు. కానీ, అటువైపు నిజంగానే రేవతినే అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. రంజిత్‌ నాతో చెప్పిన విషయాన్నే ఇప్పుడు చెబుతున్నాను' అని సజీన్ చెప్పడం చర్చనీయాంశమవుతోంది.

(ఇదీ చదవండి: కారవాన్‌లలో సీక్రెట్‌ కెమెరాలతో వీడియోలు: రాధిక శరత్‌కుమార్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement